యాపిల్ అధికారిక ప్రకటన ప్రకారం, ఈ సరికొత్త సిరి ఏఐ ఇకపై కేవలం ఐఫోన్లకే పరిమితం కాకుండా ఐప్యాడ్, మ్యాక్ బుక్, యాపిల్ వాచ్, యాపిల్ విజన్ ప్రో లలో కూడా సజావుగా పనిచేస్తుంది.
Photo Credit: Apple
Apple announced major upgrades to Siri
Apple WWDC 2026 : ప్రముఖ గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన వార్షిక కాన్ఫరెన్స్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026 వేదికగా సరికొత్త యాపిల్ ఇంటెలిజెన్స్ వ్యూహాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇందులో భాగంగానే ఐఓఎస్ 27, ఐప్యాడ్ ఓఎస్ 27, మ్యాక్ ఓఎస్ 27, వాచ్ ఓఎస్ 27, టీవీ ఓఎస్ 27, విజన్ ఓఎస్ 27 లను సరికొత్త ఫీచర్లతో లాంచ్ చేసింది. ఈ ఈవెంట్‌లో కంపెనీ తన సాఫ్ట్‌వేర్ ఎకోసిస్టమ్‌లో ఏఐ సామర్థ్యాలను భారీగా విస్తరించింది. ముఖ్యంగా, మరింత తెలివిగా మారిన సరికొత్త డిజిటల్ అసిస్టెంట్ సిరి ఏఐని తీసుకురావడంతో పాటు, స్పీచ్, టెక్స్ట్, ఇమేజ్‌లను సులభంగా అర్థం చేసుకోగల సెకండ్ జనరేషన్ యాపిల్ ఫౌండేషన్ మోడల్స్‌ను ఆవిష్కరించింది.
ఇకపై అన్ని డివైజ్‌లలో సిరి ఏఐ హవా
యాపిల్ అధికారిక ప్రకటన ప్రకారం, ఈ సరికొత్త సిరి ఏఐ ఇకపై కేవలం ఐఫోన్లకే పరిమితం కాకుండా ఐప్యాడ్, మ్యాక్ బుక్, యాపిల్ వాచ్, యాపిల్ విజన్ ప్రో లలో కూడా సజావుగా పనిచేస్తుంది. ఈ డిజిటల్ అసిస్టెంట్ మీ ఫోన్‌లోని మెసేజ్‌లు, ఈమెయిల్స్, ఫొటోస్ వంటి వివిధ యాప్స్ నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించి, మీరు అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు క్షణాల్లో సమాధానాలు ఇస్తుంది. అంతేకాకుండా, మీ ఫోన్ స్క్రీన్‌పై ప్రస్తుతం రన్ అవుతున్న కంటెంట్‌ను కూడా ఇది రీడ్ చేయగలదు. దీని కోసం యాపిల్ ఒక ప్రత్యేకమైన సిరి యాప్‌ను కూడా పరిచయం చేసింది. దీని సహాయంతో యూజర్లు తమ పాత సంభాషణలను (చాట్ హిస్టరీ) ఐక్లౌడ్ ద్వారా అన్ని యాపిల్ డివైజ్‌లలో ఒకేలా చూసుకోవచ్చు.
ఒక్క చోటే అన్నీ.. సరికొత్త సెర్చ్ ఇంటర్‌ఫేస్
కస్టమర్ల సౌకర్యార్థం యాపిల్ ఒక సరికొత్త సెర్చ్ లేదా ఆస్క్ ఇంటర్‌ఫేస్‌ను ప్రవేశపెట్టింది. ఇది సెర్చ్ టూల్స్, ఏఐ అసిస్టెన్స్, టాస్క్ మేనేజ్‌మెంట్‌లను ఒకే చోటికి తీసుకువస్తుంది. యూజర్లు కేవలం తమ వాయిస్ లేదా టెక్స్ట్ కమాండ్స్ ద్వారా యాప్స్‌ను లాంచ్ చేయడం, సమాచారాన్ని వెతకడం వంటి పనులను ఈజీగా చేసుకోవచ్చు. వివిధ రకాల యాప్స్ నుంచి డేటాను లింక్ చేస్తూ సిరి ఏఐ మీ పనులను చక్కబెడుతుంది. థర్డ్-పార్టీ డెవలపర్లు కూడా తమ యాప్స్‌లో ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను సులభంగా వాడుకునేలా సరికొత్త టూల్స్, ఫ్రేమ్‌వర్క్‌లను యాపిల్ అందుబాటులోకి తెచ్చింది.
సిస్టమ్ లెవెల్‌లో ఏఐ అప్‌డేట్స్
ఈ నెక్స్ట్ జనరేషన్ యాపిల్ ఇంటెలిజెన్స్ యూజర్ల ప్రైవసీకి భంగం కలగకుండా అత్యంత సురక్షితమైన ఆర్కిటెక్చర్‌తో డిజైన్ చేయబడింది. ఇందులో సిస్టమ్-లెవెల్ మరియు యాప్-లెవెల్ ఫీచర్లను అందించారు. ఇవి మీకు మెయిల్స్ లేదా వ్యాసాలు రాయడంలో సహాయపడటమే కాకుండా, నార్మల్ లాంగ్వేజ్‌తో షార్ట్‌కట్స్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే ఇందులోని విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఇమేజ్‌లలోని కంటెంట్‌ను మరింత లోతుగా విశ్లేషించి దానికి తగిన యాక్షన్స్ తీసుకుంటుంది.
Apple iOS 27 : మీ ఫోన్‌లో ఐఓఎస్ 27 సపోర్ట్ చేస్తుందా?.. ఎలిజిబుల్ ఐఫోన్ల పూర్తి లిస్ట్ ఇదే!
యాపిల్ ఇన్-బిల్ట్ యాప్స్‌కు సరికొత్త రూపు
యాపిల్ తన ఇన్-బిల్ట్ యాప్స్ అన్నింటినీ ఏఐ పవర్‌తో అప్‌గ్రేడ్ చేసింది. ఇకపై సఫారీ బ్రౌజర్ మీ ట్యాబ్‌లను ఆటోమేటిక్‌గా కేటగిరీల వారీగా సర్దుతుంది. అలాగే మెసేజెస్, మెయిల్, క్యాలెండర్, ఫోన్, హోమ్, పాస్‌వర్డ్స్ యాప్స్‌లో కాంటెక్స్ట్ బేస్డ్ సజెషన్స్, ఆటోమేషన్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఫొటోస్ యాప్‌లో కస్టమర్ల కోసం క్లీన్ అప్, ఎక్స్‌టెండ్, రీఫ్రేమ్, స్పేషియల్ రీఫ్రేమింగ్ వంటి అద్భుతమైన ఎడిటింగ్ టూల్స్ వచ్చాయి.
డెవలపర్ టెస్టింగ్ షురూ
ఈ సరికొత్త సిరి ఏఐని డెవలపర్ల టెస్టింగ్ కోసం యాపిల్ తక్షణమే అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది చివర్లో సాధారణ కస్టమర్ల కోసం పబ్లిక్ బీటా వెర్షన్‌ను విడుదల చేయనున్నారు. ప్రారంభంలో ఈ ఫీచర్ కేవలం ఇంగ్లీష్ భాషను మాత్రమే సపోర్ట్ చేస్తుంది, రాబోయే రోజుల్లో ఇతర భాషలను జోడిస్తారు. అయితే, ఈ యాపిల్ ఇంటెలిజెన్స్, సిరి ఏఐ సేవలు ప్రాంతాలను బట్టి మారుతుంటాయని, చైనాతో సహా కొన్ని ప్రధాన మార్కెట్లలో ఇవి వెంటనే లాంచ్ కావడం లేదని యాపిల్ స్పష్టం చేసింది.
ప్రకటన
ప్రకటన
Redmi Turbo 5 India Variant to Feature Slightly Smaller Battery Than Chinese Version