ఐఫోన్ SE, ఐప్యాడ్ ప్రో, ఆపిల్ వాచ్ మోడల్స్ ఇప్పుడు వాడుకలో లేవని ఆపిల్ వెల్లడించింది. ఆపిల్ తన పాత, వాడుకలో లేని పరికరాల జాబితాను అప్‌డేట్ చేసి వివిధ కేటగిరీలలో అనేక కొత్త ఉత్పత్తులను చేర్చింది. ఇందులో ఐఫోన్ SE, ఐప్యాడ్ ప్రో ఉన్నాయి.
Photo Credit: Apple
ఆపిల్ 2016 లో ఇప్పటివరకు అత్యంత చౌకైన ఐఫోన్ మోడల్‌గా ఐఫోన్ SE ని పరిచయం చేసింది.
ఆపిల్ కంపెనీ తన పాత, వాడుకలో లేని పరికరాల జాబితాను అప్‌డేట్ చేసి వివిధ కేటగిరీలలో అనేక కొత్త ఉత్పత్తులను చేర్చింది. కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ప్రకారం ఈ లిస్ట్‌లోకి కొత్తగా చేర్చిన పరికరాల్లో 2016లో ప్రవేశపెట్టబడిన అసలు ఐఫోన్ SE ఒకటి. ఇతర ఉత్పత్తులతో పాటు, హ్యాండ్‌సెట్ ఇప్పుడు పాతదిగా లేబుల్ చేయబడింది. ఈ జాబితాలో చేర్చబడిన ఇతర పరికరాల్లో ఐప్యాడ్ ప్రో 12.9-అంగుళాల (2017), ఆపిల్ వాచ్ సిరీస్ 4 హీర్మేస్, నైక్ మోడల్స్, బీట్స్ పిల్ 2.0 కూడా ఉన్నాయి. ఐఫోన్ SE (మొదటి తరం) ఆపిల్ వింటేజ్, వాడుకలో లేని జాబితాలో చేర్చబడింది. ఇది 2016లో ప్రారంభించబడింది. ఈ 16GB స్టోరేజ్ బేస్ మోడల్ కోసం రూ. 39,000ల నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 64GB వేరియంట్ ధర రూ. 49,000లు. ఐఫోన్ SEని ఆపిల్ 2018లో నిలిపివేసింది. రెండు సంవత్సరాల తర్వాత ఐఫోన్ SE రెండో తరం ద్వారా భర్తీ చేయబడింది.
అదే సమయంలో 12.9-అంగుళాల ఐప్యాడ్ ప్రో 2017లో ప్రవేశపెట్టబడింది. ఒక సంవత్సరం తర్వాత నిలిపివేయబడింది, అయితే దాని 10.5-అంగుళాల వేరియంట్ 2019 వరకు ఉత్పత్తిలో ఉంది. ఆపిల్ 2018లో వాచ్ సిరీస్ 4 హెర్మేస్, నైక్ మోడళ్లను విడుదల చేసింది. ఆపిల్ వాచ్ సిరీస్ 5 లాంఛ్ తర్వాత 2019లో వాటి అమ్మకాలను నిలిపివేసింది. ఆపిల్, వింటేజ్ వాడుకలో లేని జాబితాలో చేర్చబడిన చివరి ఉత్పత్తి బీట్స్ పిల్ 2.0, ఇది 2013లో ప్రారంభమైంది.
ఆపిల్ ప్రకారం, ఒక ఉత్పత్తి అమ్మకాలకు పంపిణీ ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం క్రితం ఆగిపోయి ఉంటే దానిని పాతకాలపు ఉత్పత్తిగా పరిగణిస్తారు. ఒక ఉత్పత్తి ఏడు సంవత్సరాలకు పైగా అమ్మకానికి పంపిణీ చేయకపోతే అది పాతదని కంపెనీ చెబుతోంది. ఇంకా వాడుకలో లేనివిగా వర్గీకరించబడిన ఉత్పత్తుల కోసం సర్వీస్ ప్రొవైడర్లు ఆపిల్ నుంచి విడిభాగాలను ఆర్డర్ చేయలేరు.
ఆపిల్ ప్రకారం, విడిభాగాలను సోర్సింగ్ చేయడంలో, మరమ్మతులు చేయడంలో ఇబ్బంది ఉంటుంది. అయినప్పటికీ వాటికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల ద్వారా సపోర్ట్ ఉంది. అయితే Mac ల్యాప్‌టాప్‌లు బ్యాటరీ మరమ్మతు కాలాన్ని పొడిగించడానికి అర్హత కలిగి ఉంటాయి.
ప్రకటన
ప్రకటన