ఒకప్పుడు 5000mAh బ్యాటరీ ఉంటే అబ్బో చాలా ఎక్కువ అనుకునేవారు, కానీ ఇప్పుడు అది చాలా తక్కువగా మారిపోయింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మొబైల్ బ్రాండ్లు ఏకంగా పవర్‌బ్యాంక్ లాంటి సామర్థ్యం గల 10000mAh బ్యాటరీలతో సరికొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తెస్తున్నాయి.
Photo Credit: Realme
realme P4 Power 5G की भारत में कीमत 25,999 रुपये से शुरू है
Big Battery Phones : ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ మొబైల్ స్క్రీన్‌కు అతుక్కుపోతున్నారు. హెవీ గేమింగ్, రీల్స్ చూడటం, ఆఫీస్ వర్క్స్ వల్ల ఫోన్ బ్యాటరీ చాలా వేగంగా అయిపోతోంది. అందుకే ఇప్పుడు కస్టమర్లు ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇచ్చే ఫోన్ల కోసం చూస్తున్నారు. ఒకప్పుడు 5000mAh బ్యాటరీ ఉంటే అబ్బో చాలా ఎక్కువ అనుకునేవారు, కానీ ఇప్పుడు అది చాలా తక్కువగా మారిపోయింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మొబైల్ బ్రాండ్లు ఏకంగా పవర్‌బ్యాంక్ లాంటి సామర్థ్యం గల 10000mAh బ్యాటరీలతో సరికొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో టాప్ రేటింగ్‌లో ఉన్న భారీ బ్యాటరీ ఫోన్ల గురించి తెలుసుకుందాం.
1. రియల్‌మి పి4 పవర్ 5జీ
భారీ బ్యాటరీతో వస్తున్న ఫోన్లలో రియల్‌మి పి4 పవర్ 5జీ మొదటి స్థానంలో నిలుస్తుంది. భారత మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 25,999 (8GB+128GB) గా ఉంది. అలాగే దీని టాప్ వేరియంట్ (12GB+256GB) ధర రూ. 30,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ యొక్క ప్రధాన హైలైట్ ఇందులో ఉన్న 10,001 mAh భారీ బ్యాటరీ. దీనికి తోడుగా 80W ఫాస్ట్ చార్జింగ్, 27W రివర్స్ చార్జింగ్ (మరో ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు) సౌకర్యం ఉంది. ఈ ఫోన్ లో 6.8 ఇంచుల 1.5K AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉన్నాయి. కెమెరా విషయానికొస్తే.. వెనుక వైపు OIS ఫీచర్ ఉన్న 50MP మెయిన్ కెమెరా, రేర్ లో 8MP అల్ట్రావైడ్ మరియు సెల్ఫీల కోసం 16MP కెమెరాను అందించారు. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐ 7.0 పై రన్ అవుతుంది.
2. రియల్‌మి నార్జో పవర్ 5జీ
రియల్‌మి బ్రాండ్ నుండి వచ్చిన మరో పవర్‌ఫుల్ ఫోన్ రియల్‌మి నార్జో పవర్ 5జీ. దీని 8GB + 128GB వేరియంట్ ధర రూ. 27,999 కాగా, 8GB + 256GB వేరియంట్ ధర రూ. 29,999 గా ఉంది. ఈ ఫోన్ లో కూడా 10,001mAh సామర్థ్యం ఉన్న టైటాన్ బ్యాటరీని వాడారు. భారతదేశంలోనే ఇది అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ అని కంపెనీ చెబుతోంది. ఇందులో నెక్స్ట్ జనరేషన్ సిలికాన్ కార్బన్ ఆనోడ్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల 4 సంవత్సరాల తర్వాత కూడా బ్యాటరీ హెల్త్ 80 శాతం వరకు పక్కాగా ఉంటుంది. ఈ ఫోన్ లో 6.8 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి 7000mm² ఎయిర్‌ఫ్లో కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు. ఇందులో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 80W సూపర్ ఊక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. కేవలం 5 నిమిషాల చార్జింగ్‌తో హాఫ్ డే వాడుకోవచ్చని కంపెనీ హామీ ఇస్తోంది.
3. హానర్ విన్ టర్బో
హానర్ కంపెనీ కూడా భారీ బ్యాటరీ విభాగంలో హానర్ విన్ టర్బో మోడల్‌తో దుమ్మురేపుతోంది. ప్రస్తుతం ఈ ఫోన్ చైనా మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని 12GB+256GB బేస్ వేరియంట్ ధర 3,299 యువాన్లు (మన కరెన్సీలో సుమారు రూ.46,000) కాగా, 16GB+512GB టాప్ వేరియంట్ ధర 4,199 యువాన్లు (సుమారు రూ.58,800) గా ఉంది. ఇందులో 10,000mAh భారీ బ్యాటరీతో పాటు 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 27W రివర్స్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఈ ఫోన్ నిరంతరాయంగా 14 గంటల గేమింగ్ టైమ్ లేదా 22 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఈ మొబైల్ లో 6.79 ఇంచుల LTPS OLED స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎలైట్ చిప్‌సెట్, 50MP మెయిన్ కెమెరా, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్ అందించారు.
4. వన్‌ప్లస్ నార్డ్ 6
ప్రీమియం బ్రాండ్ వన్‌ప్లస్ కూడా ఈ రేసులో వెనుకబడలేదు. వన్‌ప్లస్ నార్డ్ 6 ఫోన్ 8GB + 256GB వేరియంట్ ధర రూ. 41,999 గాను, 12GB + 256GB వేరియంట్ ధర రూ. 46,999 గాను మార్కెట్లో ఉంది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్ డిజైన్, బ్యాటరీ విషయాలపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇందులో 9,000mAh కెపాసిటీ గల విపరీతమైన బ్యాటరీని అమర్చారు. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 27W రివర్స్ చార్జింగ్, బైపాస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో కిల్లర్ లుక్ ఇచ్చే 6.78 ఇంచుల 1.5K AMOLED స్క్రీన్, సూపర్ స్మూత్ 165Hz రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 పవర్‌ఫుల్ ప్రొసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా పరంగా OIS సపోర్ట్ ఉన్న 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి.
Summer Safety Tips : ఫోన్ ఓవర్‌హీట్ అవుతుందా?.. నిమిషాల్లో కూల్ చేసే 6 అద్భుతమైన స్మార్ట్ ట్రిక్స్
5. వీవో టీ5 ప్రో 5జీ
ఇక ఐదో స్థానంలో ఇటీవల భారత మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న వీవో టీ5 ప్రో 5జీ నిలుస్తుంది. దీని ధరలు వేరియంట్లను బట్టి రూ. 29,999 (8GB+128GB), రూ. 33,999 (8GB+256GB), రూ. 39,999 (12GB+256GB) గా ఉన్నాయి. ఇందులో 9,020mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు ఏకంగా 90W సూపర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు. దీనివల్ల కేవలం 37 నిమిషాల్లోనే కారు స్పీడ్‌తో 50% వరకు ఫోన్ చార్జ్ అయిపోతుందని కంపెనీ చెబుతోంది. దీని బ్యాటరీ లైఫ్ ఏకంగా 5 సంవత్సరాల వరకు పటిష్టంగా ఉంటుంది. ఈ మొబైల్ లో 6.83 ఇంచుల అమోలెడ్ స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రొసెసర్ ఉన్నాయి. అంతేకాకుండా ఫొటోల కోసం 50MP మెయిన్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరాను, ధూళి, నీటి నుంచి రక్షణ కోసం టాప్ లెవెల్ IP68/IP69 రేటింగ్‌ను అందించారు.
ప్రకటన
ప్రకటన
Oppo Reno 16 Indian Variant Listed on Geekbench With Snapdragon 7 Gen 4 Chip, Android 16