Summer Safety Tips : ఫోన్ ఓవర్‌హీట్ అవుతుందా?.. నిమిషాల్లో కూల్ చేసే 6 అద్భుతమైన స్మార్ట్ ట్రిక్స్

చాలామంది ఫోన్‌ను ఎక్కడపడితే అక్కడ ఎండ తగిలేలా పెడుతుంటారు. మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడూ నేరుగా సూర్యరశ్మి పడే చోట ఉంచకూడదు.

Summer Safety Tips : ఫోన్ ఓవర్‌హీట్ అవుతుందా?.. నిమిషాల్లో కూల్ చేసే 6 అద్భుతమైన స్మార్ట్ ట్రిక్స్

Photo Credit: iStock

कई बार ओवरहीटिंग की वजह से स्मार्टफोन बैटरी डैमेज होने या फटने का खतरा हो जाता है।

ముఖ్యాంశాలు
  • ఈ చిన్న పొరపాట్లు చేస్తే బ్యాటరీ బ్లాస్ట్ అవ్వడం ఖాయం!
  • నిమిషాల్లో కూల్ చేసే 6 అద్భుతమైన స్మార్ట్ ట్రిక్స్!
  • చార్జింగ్ పెట్టేటప్పుడు బెడ్‌పై పెడుతున్నారా?.
ప్రకటన

Summer Safety Tips : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర, మధ్య భారతదేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. భానుడి భగభగలకు ఇళ్లు, ఆఫీసులు నిప్పుల కొలిమిలా మారుతుంటే.. మన నిత్యజీవితంలో భాగమైన స్మార్ట్‌ఫోన్లు కూడా విపరీతంగా వేడెక్కుతున్నాయి. చాలాసార్లు ఈ ఓవర్‌హీటింగ్ సమస్య కారణంగా మొబైల్స్ హ్యాంగ్ అవ్వడమే కాకుండా, బ్యాటరీ పూర్తిగా పాడైపోవడం లేదా కొన్ని సందర్భాల్లో పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మీ ఫోన్‌ను వేసవి తాపం నుంచి కాపాడుకోవడానికి, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కొన్ని అద్భుతమైన స్మార్ట్ ట్రిక్స్ ఇక్కడ ఉన్నాయి.

సూర్యుడి కాంతికి దూరంగా ఉంచండి
చాలామంది ఫోన్‌ను ఎక్కడపడితే అక్కడ ఎండ తగిలేలా పెడుతుంటారు. మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడూ నేరుగా సూర్యరశ్మి పడే చోట ఉంచకూడదు. ఎండ వేడి నేరుగా ఫోన్‌పై పడటం వల్ల లోపల ఉండే బ్యాటరీ చాలా వేగంగా హీట్ అవుతుంది. దీనివల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోవడమే కాకుండా, అది ఉబ్బిపోయి అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం చాలా రేట్లు పెరుగుతుంది. కాబట్టి ఎండలో నడిచేటప్పుడు లేదా బయట కూర్చున్నప్పుడు ఫోన్‌ను నీడలో లేదా జేబులో, బ్యాగ్‌లో సురక్షితంగా ఉంచుకోవడం ఎంతో మంచిది.

కార్లలో ప్రయాణించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మీరు కారులో ప్రయాణిస్తున్నప్పుడు మొబైల్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ డ్యాష్‌బోర్డ్ పై పెట్టకూడదు. అక్కడ సూర్యుడి ఎండ నేరుగా పడుతుంది కాబట్టి ఫోన్ ఇనుప ముక్కలా కాలిపోతుంది. ఒకవేళ కారును ఎక్కడైనా పార్క్ చేసి వెళ్తుంటే.. ఫోన్‌ను సీట్లపై గానీ డ్యాష్‌బోర్డ్‌పై గానీ వదిలేసి వెళ్లొద్దు. ఎందుకంటే ఎండలో నిలిపి ఉంచిన కారు లోపల గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్ వల్ల ఉష్ణోగ్రత చాలా వేగంగా, ఊహించని రేంజ్‌లో పెరుగుతుంది. బంద్ చేసిన కారులో నీడ ఉన్నప్పటికీ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫోన్ అందులో ఉంచడం అస్సలు సురక్షితం కాదు.

చార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేయకండి
చాలామంది రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను బెడ్ పైన, పరుపుల మీద లేదా దిండు కింద పెట్టి చార్జింగ్ ఆన్ చేస్తారు. ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు. పరుపు, దిండు వంటి వస్తువులు ఫోన్ నుంచి వచ్చే వేడిని బయటకు పోనివ్వకుండా లోపలే నొక్కిపెడతాయి. దీనివల్ల ఫోన్ డబుల్ స్పీడ్‌తో వేడెక్కుతుంది. ఫోన్‌ను ఎప్పుడూ టేబుల్ లేదా ఏదైనా చదునైన నేలపై ఉంచి, గాలి ఆడే ప్రదేశంలోనే చార్జ్ చేయాలి. అలాగే ఫోన్ హీట్ ఎక్కినప్పుడు చార్జింగ్ పెట్టాలనుకుంటే, మొదట దాని బ్యాక్ కవర్ లేదా కేస్‌ను తొలగించడం వల్ల వేడి త్వరగా బయటకు పోతుంది.

 

Google Photos : స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. బ్లర్ ఫొటోలను క్లియర్ చేసే గూగుల్ అద్భుతమైన ఏఐ ఫీచర్

ఫాస్ట్ చార్జింగ్‌కు కాస్త బ్రేక్ ఇవ్వండి
ఈ రోజుల్లో వస్తున్న ఫోన్లు 60W, 80W లేదా 120W వంటి సూపర్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తున్నాయి. అయితే విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు ఎక్కువ సమయం పాటు హెవీ ఫాస్ట్ చార్జర్లు వాడటం మంచిది కాదు. ఎందుకంటే ఫాస్ట్ చార్జింగ్ అనేది తక్కువ సమయంలో ఎక్కువ పవర్‌ను బ్యాటరీకి పంపుతుంది, దీనివల్ల సహజంగానే కెమికల్ రియాక్షన్ జరిగి బ్యాటరీ హీట్ అవుతుంది. బయట ఉన్న వేడి, లోపల చార్జింగ్ వేడి తోడైతే ప్రమాదం జరగొచ్చు. అందుకే వేసవిలో వీలైనంత వరకు స్టాండర్డ్ 10W లేదా 15W సాధారణ చార్జర్లను వాడటం వల్ల ఫోన్ సురక్షితంగా ఉంటుంది.

ఈ సాఫ్ట్‌వేర్ ట్రిక్స్ ఫాలో అవ్వండి
ఫోన్ లోపలి భాగం వేడెక్కకుండా ఉండటానికి కొన్ని సులభమైన సాఫ్ట్‌వేర్ టిప్స్ ఉన్నాయి. మొదటగా మీ మొబైల్ బ్రైట్‌నెస్ ఎప్పుడూ ఫుల్ గా పెట్టకండి, దీనివల్ల డిస్‌ప్లే ప్యానెల్ విపరీతంగా హీట్ అవుతుంది. అవసరమైతే ఆటో-బ్రైట్‌నెస్ ఆన్ చేసుకోండి. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే హెవీ గేమింగ్ యాప్స్, వీడియో స్ట్రీమింగ్ లేదా కెమెరాను ఎక్కువ సమయం వాడటం తగ్గించండి. ఈ యాప్స్ ప్రొసెసర్‌పై లోడ్ పెంచి ఫోన్ ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఫోన్ కాస్త వేడెక్కినట్లు అనిపిస్తే, కాసేపు వాడటం ఆపేసి పక్కన పెట్టేస్తే ఆటోమేటిక్‌గా కూల్ అయిపోతుంది.

#తాజా కథనాలు
  1. VI Plan : ఏడాది పొడవునా నో రీఛార్జ్ టెన్షన్.. రోజుకు 2జీబీ డేటాతో పాటు అమెజాన్ ప్రైమ్ ఉచితం
  2. Summer Safety Tips : ఫోన్ ఓవర్‌హీట్ అవుతుందా?.. నిమిషాల్లో కూల్ చేసే 6 అద్భుతమైన స్మార్ట్ ట్రిక్స్
  3. Google Photos : స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. బ్లర్ ఫొటోలను క్లియర్ చేసే గూగుల్ అద్భుతమైన ఏఐ ఫీచర్
  4. Apple WWDC 2026 : యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026 అప్‌డేట్.. సిరి ఏఐతో సరికొత్త యాపిల్ ఇంటెలిజెన్స్ వ్యూహం
  5. Apple iOS 27 : మీ ఫోన్‌లో ఐఓఎస్ 27 సపోర్ట్ చేస్తుందా?.. ఎలిజిబుల్ ఐఫోన్ల పూర్తి లిస్ట్ ఇదే!
  6. WWDC 2026 : యాపిల్ ఇంటెలిజెన్స్ సరికొత్త ఆర్కిటెక్చర్.. ఇక మాటలతో కూడా ఇమేజ్ ఎడిటింగ్ చేయవచ్చు
  7. OnePlus Ace 7 : ఏకంగా 10,000 mAh బ్యాటరీ.. వన్‌ప్లస్ కొత్త ఫోన్ పవర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే
  8. OnePlus : వన్ ప్లస్ నుంచి సరికొత్త పవర్‌ఫుల్ ఫోన్లు.. జూన్ 18న టర్బో 6ఎక్స్ సిరీస్ లాంచ్
  9. Instagram : రీల్స్ అంటే కేవలం టైమ్‌పాస్ కాదు.. షాపింగ్ డెసిషన్స్‌ను మార్చేస్తున్న సరికొత్త ప్లాట్‌ఫామ్
  10. Vivo V70 Lite : మార్కెట్లోకి వివో సరికొత్త 5G ఫోన్.. గుట్టుచప్పుడు కాకుండా వివో వి70 లైట్ లాంచ్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »