ఇరాన్‌లోనే అత్యంత ప్రజాదరణ పొందిన, అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ అయిన నోబిటెక్స్ పై అమెరికా ప్రభుత్వం అధికారికంగా నిషేధం విధించింది.
इस एक्सचेंज पर प्रतिबंधों के बावजूद ईरान की सरकार को फंडिंग हासिल करने में मदद का आरोप है
Iran Crypto Ban : గత కొన్ని వారాలుగా ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయడానికి అమెరికా దూకుడుగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఇరాన్ సైనిక, ప్రభుత్వ అవసరాలకు అందుతున్న నిధుల సరఫరాను అడ్డుకునేందుకు యూఎస్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేసింది. ఇరాన్‌లోనే అత్యంత ప్రజాదరణ పొందిన, అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ అయిన నోబిటెక్స్ పై అమెరికా ప్రభుత్వం అధికారికంగా నిషేధం విధించింది. పాశ్చాత్య దేశాలు ఇరాన్‌పై ఎన్ని ఆర్థిక ఆంక్షలు విధించినప్పటికీ, ఈ క్రిప్టో ఎక్స్ఛేంజ్ మాత్రం దొంగచాటుగా ఇరాన్ ప్రభుత్వానికి, అలాగే బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ప్రభుత్వ సంస్థలకు భారీగా నిధులు సమకూరుస్తోందని అమెరికా గుర్తించింది.
రాయిటర్స్ పరిశోధనలో వెలుగుచూసిన నిజాలు
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఇటీవల జరిపిన అంతర్గత విచారణలో నోబిటెక్స్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఇరాన్ సెంట్రల్ బ్యాంక్, అలాగే ఆ దేశానికి చెందిన శక్తివంతమైన మిలిటరీ విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కోసం నోబిటెక్స్ లక్షలాది డాలర్ల అక్రమ లావాదేవీలను ప్రాసెస్ చేసినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇరాన్ అంతర్గత అల్లర్ల సమయంలో అక్కడ ప్రభుత్వం ఇంటర్నెట్‌ను పూర్తిగా బంద్ చేసినప్పటికీ, ఈ నోబిటెక్స్ ఎక్స్ఛేంజ్ మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా తన కార్యకలాపాలను కొనసాగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
అమెరికా ట్రెజరీ సెక్రటరీ ఆగ్రహం
ఈ అక్రమ క్రిప్టో నెట్‌వర్క్‌పై అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ పతనమవుతున్నప్పటికీ, అక్కడి పాలకుల భ్రష్టాచార ఎజెండా మాత్రం మారలేదని విమర్శించారు. అంతర్జాతీయ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి, దేశం నుంచి సంపదను విదేశాలకు సులభంగా తరలించడానికి ఇరాన్ ప్రభుత్వం డిజిటల్ అసెట్ టెక్నాలజీలను (క్రిప్టో కరెన్సీ) ఒక అస్త్రంగా ఎంచుకుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నోబిటెక్స్‌తో పాటు మరో మూడు క్రిప్టో ఎక్స్ఛేంజ్‌లను కూడా అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.
Summer Safety Tips : ఫోన్ ఓవర్‌హీట్ అవుతుందా?.. నిమిషాల్లో కూల్ చేసే 6 అద్భుతమైన స్మార్ట్ ట్రిక్స్
తెరపైకి ఇరాన్ పాలకుల బంధుగణం
నోబిటెక్స్ వెనుక ఉన్నది ఎవరో కాదు, ఇరాన్‌లోనే అత్యంత ప్రభావవంతమైన, సంపన్నమైన కుటుంబాలలో ఒకటైన ఖరాజీ కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులని రాయిటర్స్ విచారణలో తేలింది. ఈ ఖరాజీ కుటుంబానికి ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్రమ నిధుల బదిలీకి సహకరించినందుకు గాను సయ్యద్ మహ్మద్ అలీ అఘామీర్ మహ్మద్ అలీ, సయ్యద్ మహ్మద్ అఘామీర్ మహ్మద్ అలీ అనే ఇద్దరు సోదరులతో పాటు నోబిటెక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమీర్ హుస్సేన్ రాద్‌పై కూడా అమెరికా కఠినమైన ఆంక్షలు విధించింది.
బైనాన్స్ ఎక్స్ఛేంజ్ ద్వారా వేల కోట్ల లావాదేవీలు
ఇదిలావుండగా గత నెలలో వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన మరో నివేదిక అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఇరాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బాబక్ జంజానీకి చెందిన ఒక భారీ నెట్‌వర్క్, ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ అయిన బినాన్స్ ను ఉపయోగించి ఇరాన్ మిలిటరీకి నిధులు పంపినట్లు ఆధారాలు లభించాయి. ఈ నెట్‌వర్క్ ద్వారా బైనాన్స్ లో ఏకంగా 2.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.20,000 కోట్లకు పైగా) లావాదేవీలు జరిగాయని దర్యాప్తు సంస్థల రిపోర్టులు చెబుతున్నాయి. కేవలం గత రెండేళ్లలోనే ఈ నెట్‌వర్క్ ద్వారా 850 మిలియన్ డాలర్లు బదిలీ అయ్యాయని, అంతకుముందు జరిగిన మరో 1.7 బిలియన్ డాలర్ల అనుమానాస్పద లావాదేవీలపై కూడా హెచ్చరికలు జారీ అయ్యాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన
Stellar Blade: Blood Rain Protagonist Will Have More of a Personality, Says Shift Up
Samsung Galaxy Tab Active 6 Reportedly Set to Launch in 2027 With 5G Connectivity