ఇంటెల్, AMD లేటెస్ట్ ప్రాసెసర్లు, టచ్ స్క్రీన్, ఏఐ ఆధారిత ఫీచర్లతో ఉన్న ల్యాప్‌టాప్‌లు ఇప్పుడు బడ్జెట్‌లో దొరుకుతున్నాయి.ఈ సేల్‌లో అసూస్, ఏసర్, హెచ్పీ, లెనోవో లాంటి ప్రముఖ బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి.
Photo Credit: Amazon
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2025 జూలై 31న ప్రారంభమైంది
అమెజాన్ ఇండియా ప్రతి సంవత్సరం నిర్వహించే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2025 ఈసారి కూడా గ్రాండ్‌గా ప్రారంభమైంది. జూలై 31న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ సేల్ ప్రస్తుతం భారతీయ వినియోగదారులకు అన్ని విభాగాల్లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా ల్యాప్‌టాప్‌లు కొనేందుకు ఇది సరిగ్గా సరైన సమయం అని చెప్పాలి. ఇంటెల్, AMD లేటెస్ట్ ప్రాసెసర్లు, టచ్ స్క్రీన్, ఏఐ ఆధారిత ఫీచర్లతో ఉన్న ల్యాప్‌టాప్‌లు ఇప్పుడు బడ్జెట్‌లో దొరుకుతున్నాయి.ఈ సేల్‌లో అసూస్, ఏసర్, హెచ్పీ, లెనోవో లాంటి ప్రముఖ బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. రూ.60,000 లోపు మంచి ల్యాప్‌టాప్ తీసుకోవాలని చూస్తున్నవారికి ఇది ఓ అరుదైన అవకాశం.
ఉదాహరణకు, HP బ్రాండ్ నుంచి వచ్చిన 15-ఇంచ్ మోడల్ (13 జెన్ ఇంటెల్ కోర్ i5-1334U ప్రాసెసర్ తో) ఇప్పుడు కేవలం రూ.45,240కే లభిస్తోంది. దీని అసలు ధర రూ.72,111 కాగా, ఈ సేల్లో 37% తగ్గింపుతో వస్తోంది. విద్యార్థులు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
ఇంకొక అద్భుతమైన డీల్ - లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 (13 జెన్ ఇంటెల్ కోర్ i7-13620H ప్రాసెసర్‌తో) ఇప్పుడు రూ.55,240కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.89,390 కాగా, దాదాపు రూ.34,000 తగ్గింపుతో ఇది దొరకుతోంది. హై-ఎండ్ ప్రాసెసింగ్ పనులకు ఇది ఒక పవర్ఫుల్ ల్యాప్‌టాప్ అని చెప్పవచ్చు.
కేవలం ధర తగ్గింపులు మాత్రమే కాదు, కొనుగోలుదారులకు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. SBI కార్డ్ వినియోగదారులకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ గరిష్ఠంగా రూ.5,250 వరకు లభిస్తుంది. అలాగే అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డు వినియోగదారులకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అమెజాన్ పే UPI ద్వారా చెల్లింపులు చేసిన వారికి కూడా 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది.
ఎక్స్చేంజ్ ఆఫర్ లో భాగంగా మీ పాత ల్యాప్‌టాప్ ఇచ్చి కొత్త లాప్టాప్ తీసుకుంటే మరింత తగ్గింపు పొందవచ్చు. ఇక నో-కాస్ట్ EMI ప్లాన్స్ ద్వారా నెలనెలా తక్కువ వాయిదాలతో ల్యాప్‌టాప్ కొనుగోలు చేయొచ్చు. ప్రత్యేకంగా ఎంపికైన ఉత్పత్తులపై కూపన్ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. కొన్ని ఉత్పత్తులపై క్యాష్-ఆన్-డెలివరీ సౌకర్యం కూడా ఉంది.
అయితే, ఈ సేల్ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. అందువల్ల మీకు కావలసిన ల్యాప్‌టాప్‌ను వెంటనే బుక్ చేసుకోవడం మంచిది. లేటెస్ట్ టెక్నాలజీ, అద్భుతమైన ఫీచర్స్ తో ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఈ గ్రేట్ ఇండియా ఫ్రీడమ్ ఫెస్టివల్ 2025 మంచి ఆఫర్ అని చెప్పవచ్చు. లాప్టాప్స్ మాత్రమే కాకుండా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా ఈ సెల్ లో మంచి ప్రైస్ కి లభిస్తున్నాయి.
ఈ వెబ్సైట్లో మీరు కొనుగోలు చేసే ప్రోడక్ట్ ల మీద ధరలు, డిస్కౌంట్లు మరియు ఆఫర్లు స్టాక్ అందుబాటుపై ఆధారపడి ఉండొచ్చు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ప్రకటన
ప్రకటన
Neutrino Detectors May Unlock the Search for Light Dark Matter, Physicists Say
Uranus and Neptune May Be Rocky Worlds Not Ice Giants, New Research Shows
Steal OTT Release Date: When and Where to Watch Sophie Turner Starrer Movie Online?
Murder Report (2025): A Dark Korean Crime Thriller Now Streaming on Prime Video