Photo Credit: Reliance
భారత్‌లోని రిలయన్స్ జియో తమ నెట్‌వర్క్ వినియోగదారుల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్ దేశంలో అపరిమిత వాయిస్ కాల్స్, SMS సేవలతోపాటు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇది చందాదారులకు రూ. 2150 విలువైన అదనపు ప్రయోజనాలను పొందే అవకాశాన్ని ఇస్తుంది. షాపింగ్ వెబ్‌సైట్‌లు, ఫుడ్ డెలివరీ యాప్‌లతోపాటు ఫ్లైట్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లపైన డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ ప్లాన్ ద్వారా రూ.400 మొత్తాన్ని వినియోగదారుల వార్షిక పొదుపుగా కంపెనీ అందిస్తోంది. ఈ ఆఫర్‌లను పొందేందుకు ఆసక్తి ఉన్న వినియోగదారులు 2025, జనవరి 11వ తేదీలోగా రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
రానున్న కొత్త సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని పలు ప్రయివేటు టెకలికాం సంస్థలు కస్టమర్‌లను ఆకర్షించేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టాయి. ఇందులో రిలయన్స్ జియో ముందు వరుసలో ఉంది. తాజాగా ఈ సంస్థ నుండి రిలయన్స్ జియో న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్ 2025 ప్రస్తుతం మన దేశంలో రూ. 2,025గా ఉంది. వినియోగదారులకు ఈ ప్లాన్ ప్రయోజనాలు కొనుగోలు చేసిన రోజు నుండి 200 రోజుల వరకు చెల్లుబాటు అవుతాయి. మన దేశంలోని రిలయన్స్ జియో ప్రీపెయిడ్ కస్టమర్లు డిసెంబర్ 11 నుంచి జనవరి 11, 2025 మధ్య ఈ ప్లాన్‌ని తీసుకోవచ్చు. ఈ సమయంలో ప్లాన్‌ను యాక్టీవ్ చేసుకోవడం ద్వారా మాత్రమే పూర్తి ప్రయోజనాలను పొందవచ్చని జియో స్పష్టం చేసింది.
రిలయన్స్ జియో కొత్తగా ప్రకటించిన ఈ న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్ 2025 ప్రయోజనాలలో అపరిమిత 5G డేటా ప్రముఖంగా ఉంటుంది. అయితే, ఈ 5G కనెక్టివిటీ అనేది వినియోగదారులు ఉన్న ప్రాంతంలోని 5G నెట్‌వర్క్ లభ్యతపైన ఆధారపడి ఉంది. ఈ ప్లాన్‌లో ఏడాదికి 500GB 4G డేటా లేదా రోజుకు 2.5GB 4G డేటాను అందిస్తుంది. అలాగే, వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్స్‌తోపాటు SMSలకు యాక్సెస్ ఉంటుంది. ఇదే తరహా ఆఫర్‌లు గతంలోనూ ఉన్నప్పటికీ ఈ ధరల్లో అందించడంపై వినియోగదారులల్లో ఆసక్తి పెరిగే అవకాశం ఉన్నట్లు కంపెనీ భావిస్తోంది.
ఈ రూ.2,025 రీఛార్జ్ ప్లాన్‌తో Reliance Jio వినియోగదారులు JioTV, JioCinemaతోపాటు JioCloud సబ్‌స్క్రిప్షన్‌లను ఆస్వాదించొచ్చు. అలాగే, వీరు రూ.2,150 విలువైన అర్హతగల బ్రాండ్‌లకు చెందిన కూపన్‌లను సొంతం చేసుకోవచ్చు. ఇందులో ఈ-కామర్స్ సైట్‌లో రూ. 2,500 కనీస షాపింగ్‌పై రూ. 500 Ajio కూపన్ రీడీమ్ చేసుకోవచ్చు. రిలయన్స్ జియో న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్‌తో ఇతర ప్రయోజనాలలో Swiggyపై రూ. 499 కనీస కొనుగోలుపై రూ. 150 తగ్గింపు, EaseMyTrip.com మొబైల్ యాప్, వెబ్‌సైట్‌లో ఫ్లైట్ బుకింగ్‌పై రూ. 1,500 వరకూ తగ్గింపును పొందవచ్చు. ఇటీవల జియోను అధిగమిస్తోన్న ఇతర టెలికాం నెట్‌వర్క్‌లకు ఈ న్యూయర్ ఆఫర్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన