Photo Credit: HMD
Finnish OEM నుంచి రాబోయే మరో కొత్త స్మార్ట్ ఫోన్ HMD Orka అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన మోనికర్ ఇంకా ధృవీకరించబడనప్పటికీ, ఆన్‌లైన్‌లో లీకైన డిజైన్ రెండర్‌లు అంచనా వేయగల కలర్ ఆప్షన్‌లను సూచిస్తున్నాయి. అంతేకాదు, ఇప్పటికే ఫోన్‌లోని కొన్ని కీలకమైన ఫీచర్లు కూడా బహిర్గతమయ్యాయి. ఇటీవల, HMD Sage స్మార్ట్‌ఫోన్ డిజైన్, రంగులు, అంచనా వేయబడ్డ స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో సందడి చేశాయి. ముఖ్యంగా, స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌గా పిలిచే మార్చుకోగలిగిన కవర్‌లతో కూడిన HMD Fusion హ్యాండ్‌సెట్ మన దేశంలో ఇటీవల కంపెనీ లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ HMD Orka స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన డిజైన్ రెండర్‌లు ఓ వినియోగదారుడు HMD_MEME'S (@smashx_60) ద్వారా X పోస్ట్‌లో షేర్ చేయబడ్డాయి. అయితే, దీని మోనికర్ నిజానికి Orka లేదా అది ఇంటర్నల్ కోడ్ నేమ్ అనేదానిపై పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. ఈ ఫోన్ బ్లూ, గ్రీన్, పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండనున్నట్లు పోస్ట్ ద్వారా తెలుస్తోంది. మొత్తంగా పోస్టులో మాత్రం డిజైన్ ఆకర్షణీయంగా ఉన్నట్లు పలు కామెంట్స్ వస్తున్నాయి.
దీని వెనుక ప్యానెల్ ఎగువ ఎడమవైపున రూపొందించిన దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌తో HMD Orka ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అలాగే, మాడ్యూల్ కెమెరా సెన్సార్, LED ఫ్లాష్ యూనిట్‌ను అందించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీంతోపాటు 108MP AI కెమెరా అని టెక్ట్స్ చేసిన డిజైన్‌ను కూడా ఇందులో చూడొచ్చు. స్లిమ్ బెజెల్స్‌తో HMD Orka ఫోన్ ఫ్లాట్ స్క్రీన్, కొంచెం మందంగా ఉండే చిన్, ముందు కెమెరాను అమర్చేందుకు పైభాగంలో కేంద్రీకృత హోల్-పంచ్ స్లాట్‌ను రూపొందించినట్లు కనిపిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ కుడి అంచున అందించినట్లు ఇక్కడ చూడొచ్చు. ఈ HMD Orka హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్-HD+ IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. అలాగే, ఈ ఫోన్‌లో 8GB RAMను అందిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా Qualcommతో స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 5G ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహించవచ్చని లీక్‌లో సూచించబడుతోంది. అయితే, ఖచ్చితమైన ప్రాసెసర్ మాత్రం స్పష్టం కాలేదు.
ఇక HMD Orka స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. AI ఫీచర్స్‌తో కూడిన 108-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా సెన్సార్‌ను అందించవచ్చు. అలాగే, సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఫోన్‌లో ప్రత్యేకమైన 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ని కలిగి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇది 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ గురించిన పూర్తి వివరాలు రాబోయే కొద్ది వారాల్లోనే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన