ముఖ్యంగా 40 వేల రూపాయల బడ్జెట్ విభాగంలో గత కొన్ని నెలలుగా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పరిస్థితి చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది. ముఖ్యంగా 40 వేల రూపాయల బడ్జెట్ విభాగంలో గత కొన్ని నెలలుగా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. దీనికి ప్రధాన కారణం మెమరీ చిప్స్ ధరలు విపరీతంగా పెరగడమే. దీనివల్ల కంపెనీలు తమ ఫోన్ల ధరలను పెంచక తప్పడం లేదు. పాత మోడళ్లకు చిన్నపాటి మెరుగులు దిద్ది కొత్త పేర్లతో మార్కెట్లోకి వదులుతున్నారు. గతంలో 30 వేల లోపు దొరికే ఫోన్లు ఇప్పుడు ఏకంగా 40 వేల సెగ్మెంట్‌లోకి చేరిపోయాయి. వినియోగదారులు కూడా ఈ ధరల పెరుగుదలను గమనిస్తూనే ఉన్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో సరైన ఫోన్ ఎంచుకోవడం కొంచెం కష్టమైన పనే. టెక్నాలజీ మారుతున్న కొద్దీ ధరలు పెరగడం సహజమే అయినా ఈసారి మాత్రం ఆ భారం సామాన్యుడి జేబుకు గట్టిగానే తగులుతోంది.
నథింగ్ ఫోన్ 4a ప్రో
నథింగ్ ఫోన్ 4a ప్రో గురించి మాట్లాడుకుంటే ఇది పాత మోడల్ కన్నా చాలా మెరుగ్గా కనిపిస్తుంది. కంపెనీ తన ఐకానిక్ డిజైన్‌ను వదులుకోకుండానే అల్యూమినియం యూనిబాడీతో కొత్త రూపునిచ్చింది. ఇందులో వాడిన గ్లిఫ్ మ్యాట్రిక్స్ సిస్టమ్ మునుపటి కంటే చాలా పవర్‌ఫుల్ అని చెప్పొచ్చు. కెమెరా విషయంలో కూడా నథింగ్ ఈసారి రాజీ పడలేదు. ముఖ్యంగా టెలిఫోటో లెన్స్ ద్వారా వచ్చే 7X లాస్‌లెస్ జూమ్ ఫోటోలు అద్భుతంగా వస్తున్నాయి. బ్యాటరీ సామర్థ్యం 5,400mAh ఉండటం వల్ల రోజంతా ఛార్జింగ్ గురించి చింతించాల్సిన అవసరం లేదు. డిజైన్ పరంగా మెచ్యూర్డ్‌గా కనిపిస్తూనే పర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడా తగ్గకుండా ఈ ఫోన్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. నథింగ్ బ్రాండ్ ఇష్టపడే వారికి ఇది కచ్చితంగా ఒక మంచి ఆప్షన్ అవుతుంది.
వన్‌ప్లస్ నార్డ్ 6
వన్‌ప్లస్ తన నార్డ్ సిరీస్ దిశను పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు మిడ్-రేంజ్ ఆల్ రౌండర్‌గా ఉండే ఈ బ్రాండ్ ఇప్పుడు గేమింగ్ ఫోకస్డ్ ప్రొడక్ట్‌గా మారిపోయింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. భారీ 9,000mAh బ్యాటరీ ఈ ఫోన్ హైలైట్ అని చెప్పాలి. సాధారణంగా వాడితే రెండు రోజుల వరకు ఛార్జింగ్ వస్తుంది. 165Hz డిస్‌ప్లే గేమింగ్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది. కెమెరా పరంగా మాత్రం ఇది కొంచెం వెనుకబడిందనే చెప్పాలి. కేవలం ఫోటోల కంటే పక్కా గేమింగ్ కావాలనుకునే వారికి వన్‌ప్లస్ నార్డ్ 6 సరైన ఎంపిక. ఐపీ69 రేటింగ్ ఉండటం వల్ల దుమ్ము, నీటి నుండి పూర్తి రక్షణ లభిస్తుంది.
గూగుల్ పిక్సెల్ 9a భరోసా
సాఫ్ట్‌వేర్ అనుభవం ముఖ్యం అనుకునే వారికి గూగుల్ పిక్సెల్ 9a ఒక వరం లాంటిది. ఈ ఫోన్ చూడటానికి చాలా క్లాసిక్‌గా ఉంటుంది. కెమెరా బంప్ లేని డిజైన్ దీనికి ఒక యూనిక్ లుక్ ఇస్తుంది. గూగుల్ ఇచ్చే 7 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ దీనికి ప్రధాన బలం. కెమెరా పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ వెలుతురులోనైనా మంచి ఫోటోలు తీయడంలో గూగుల్ సాఫ్ట్‌వేర్ మ్యాజిక్ ఇక్కడ కనిపిస్తుంది. 5,100mAh బ్యాటరీ ఒక రోజుకు సరిపోతుంది. బ్లోట్‌వేర్ లేని క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవం కావాలనుకునే వారు దీని వైపు మొగ్గు చూపుతారు. ధర కొంచెం ఎక్కువే అనిపించినా ఆ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ దీనికి విలువను జోడిస్తుంది.
ఐకూ నియో 10
వన్‌ప్లస్ లాగే ఐకూ కూడా గేమింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టింది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 తో పాటు ఇందులో వాడిన సూపర్ కంప్యూటింగ్ చిప్ Q1 గేమింగ్ ఫీచర్లను మెరుగుపరుస్తుంది. సూపర్ రిజల్యూషన్ వంటి టెక్నాలజీ వల్ల గ్రాఫిక్స్ చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. ఫోన్ వేడెక్కకుండా వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తుంది. డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌తో చాలా స్మూత్‌గా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ ఐపీ65 రేటింగ్‌తో పర్వాలేదనిపిస్తుంది. అయితే కెమెరా క్వాలిటీ ఆశించిన స్థాయిలో లేదు. కేవలం మొబైల్ గేమింగ్ మీద ఎక్కువ సమయం గడిపేవారు ఈ ఫోన్ తీసుకోవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ పవర్ కావాలనుకునే వారికి ఇది మంచి డీల్.
వన్‌ప్లస్ 13R
బడ్జెట్‌ను కొంచెం పెంచుకోగలిగితే వన్‌ప్లస్ 13R ఒక కంప్లీట్ ప్యాకేజీలా కనిపిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ పాతదైనా ఇప్పటికీ మొనగాడిలా పనిచేస్తుంది. దీని 6.78 ఇంచ్ ఎల్‌టీపీఓ డిస్‌ప్లే ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది. 6,000mAh బ్యాటరీ చాలా సేపు తోడుంటుంది. కెమెరా విషయంలో కూడా ఇది మిగతా ఫోన్ల కంటే మెరుగ్గా ఉంది. ముఖ్యంగా డే లైట్ ఫోటోలు చాలా వివరంగా వస్తాయి. తక్కువ వెలుతురులో టెలిఫోటో లెన్స్ కొంచెం ఇబ్బంది పెట్టినా ఓవరాల్‌గా మంచి ఫలితాలను ఇస్తుంది. స్టైలిష్ డిజైన్, మంచి కెమెరా, సూపర్ పర్ఫార్మెన్స్ అన్నీ ఒకే ఫోన్‌లో కావాలనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్.
ప్రకటన
ప్రకటన