Pixel 10a, Pixel 9aలో చూసిన అదే పరిచితమైన డిజైన్‌ను కొనసాగిస్తోంది. వెనుక భాగంలో హారిజాంటల్ పిల్-షేప్ కెమెరా ఐలాండ్ లో రెండు కెమెరాలతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. దీనితో పాటు ఒకే LED ఫ్లాష్ కూడా ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ మధ్యలో సెంటర్-అలైన్ చేసిన Google లోగో కనిపిస్తుంది.
Photo Credit: Google
పిక్సెల్ 10a నీలం రంగులో అందించబడుతుంది.
గూగుల్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ Pixel 10a ను ఈ నెలాఖరులో భారత మార్కెట్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేయనున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇది మార్చి 2025లో విడుదలైన Pixel 9a కు వారసుడిగా రానుంది. ఇప్పటికే డిజైన్‌కు సంబంధించిన పలు లీకులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన నేపథ్యంలో, ఇప్పుడు గూగుల్ స్వయంగా ఈ ఫోన్‌పై తెరలేపింది. Pixel 10a డిజైన్ పరంగా దాని ముందస్తు మోడల్‌లాగే ఉండనుండగా, కొత్తగా ఒక ఆకర్షణీయమైన బ్లూ కలర్ ఆప్షన్ లో అందుబాటులోకి రానుంది.
గూగుల్ వెల్లడించిన సమాచారం ప్రకారం, Pixel 10a ఫిబ్రవరి 18న అధికారికంగా లాంచ్ అవుతుంది. అయితే ధరల వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. Google Store సబ్‌స్క్రైబర్లకు ప్రత్యేక ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 1:29 గంటల లోపు ఫోన్‌కు సంబంధించిన సమాచారానికి సైన్ అప్ చేసుకున్న వారికి ఈ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్ వర్తిస్తుంది. Pixel 10a కొనుగోలు సమయంలో ఈ ఆఫర్‌ను ఉపయోగించి, భవిష్యత్తులో చేసే కొనుగోలుపై ప్రత్యేక ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని గూగుల్ తెలిపింది.
Pixel 10a, Pixel 9aలో చూసిన అదే పరిచితమైన డిజైన్‌ను కొనసాగిస్తోంది. వెనుక భాగంలో హారిజాంటల్ పిల్-షేప్ కెమెరా ఐలాండ్ లో రెండు కెమెరాలతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. దీనితో పాటు ఒకే LED ఫ్లాష్ కూడా ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ మధ్యలో సెంటర్-అలైన్ చేసిన Google లోగో కనిపిస్తుంది.ముందు వైపు చూస్తే, అన్ని వైపులా కాస్త మందమైన బెజెల్స్, మధ్యలో హోల్-పంచ్ కట్‌అవుట్ డిస్‌ప్లే కనిపిస్తాయి. టీజర్ చిత్రాల్లో చూపించిన బ్లూ కలర్, Pixel 9aలో ఉన్న Iris కలర్‌వే ను గుర్తు చేసేలా ఉంది.
గూగుల్ ఇప్పటివరకు పూర్తి స్పెసిఫికేషన్లను వెల్లడించకపోయినా, ఫోటోగ్రఫీ సామర్థ్యం మరింత మెరుగ్గా ఉంటుందని టీజర్ ద్వారా స్పష్టం చేసింది. అలాగే, Pixel 10a ను “ఇప్పటివరకు వచ్చిన అత్యంత దృఢమైన Pixel A-సిరీస్ ఫోన్” గా గూగుల్ పేర్కొనడం గమనార్హం. దీనర్థం మెరుగైన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా.
Pixel 9a మాదిరిగానే, ఈ ఫోన్‌లో కూడా Gemini AI అసిస్టెంట్ బిల్ట్-ఇన్‌గా అందుబాటులో ఉంటుంది.
రిపోర్ట్స్ ప్రకారం, Pixel 10a 128GB మరియు 256GB స్టోరేజ్ వేరియంట్లలో లభించే అవకాశం ఉంది. కలర్ ఆప్షన్లుగా బెర్రీ, ఫాగ్, లావెండర్, ఆబ్సిడియన్ వేరియంట్లు మార్కెట్‌లోకి రావొచ్చని సమాచారం.
ధర విషయానికి వస్తే, యూరప్ మార్కెట్‌లో 128GB వేరియంట్ ధర EUR 549 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని, అలాగే 256GB మోడల్ EUR 649 వరకు ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. భారత మార్కెట్‌లో ధరలు దీనికి భిన్నంగా ఉండే అవకాశముంది.
మొత్తంగా చూస్తే, Pixel 10a డిజైన్‌లో పెద్ద మార్పులు లేకపోయినా, మెరుగైన కెమెరా, బలమైన నిర్మాణం మరియు గూగుల్ AI ఫీచర్లతో మిడ్-రేంజ్ విభాగంలో మంచి ఎంపికగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన
MediaTek Dimensity 9600 Pro Leak Suggests 5GHz Clock Speed, High Benchmark Scores
Oppo Find X9s Pro Key Specifications Surface Online as Launch Date Draws Closer
Assassin's Creed: Black Flag Resynced Will Reportedly Release in July, Reveal Set for Next Week