Google Pixel మొబైల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో జరిగిన ‘మేడ్ బై గూగుల్' ఈవెంట్‌లో Google Pixel 9 Pro Fold ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. మనదేశంతో సహా గ్లోబల్ మార్కెట్‌లలో ఈ Pixel 9 Pro Fold త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. ఇది కంపెనీ నుంచి వచ్చిన రెండవ పిక్సెల్-బ్రాండెడ్ ఫోల్డబుల్ ఫోన్ కాగా, భారతదేశంలో మొదటిది. ఈ ఏడాది పిక్సెల్ 9 సిరీస్ నుంచి మనదేశంలో మొత్తం నాలుగు హ్యాండ్‌సెట్‌లను పరిచయం చేసింది. ఈ లైనప్ Google యొక్క Tensor G4 ప్రాసెసర్ ద్వారా శక్తిని అందుకుంటుంది. Pixel 9 Pro Fold 8-అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 6.3-అంగుళాల కవర్ స్క్రీన్ మరియు 45W వరకు ఛార్జ్ చేయగల 4,650mAh బ్యాటరీ సామర్థ్యంతో రూపొందించబడింది.
ప్రముఖ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంలో..
Pixel 9 సిరీస్ మోడల్ ఫోన్స్ అన్ని టెన్సార్ జీ4 ఎస్‌ఓసీ, టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్‌తో రూపొందిచినట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే, ఐపీ68 రేటింగ్ వాటర్‌తోపాటు దుమ్మూధూళిని తట్టుకునే విధంగా వీటిని తయారుచేశారు. Google Pixel 9 సిరీస్‌ను ఆగస్టు 22 నుంచి అమ్మకాలు జరపనున్నట్లు సంస్థ ప్రకటించింది. అలాగే, ప్రముఖ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్ అయిన ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ రిటేల్ ఔట్‌లెట్‌లలో ఈ మోడల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆవకాశం కల్పించారు.
ఇంట్రనల్ ఫీచర్స్‌లో..
కొనుగోలుదారులు Pixel 9 Pro Foldను ఢిల్లీ మరియు బెంగళూరులోని గూగుల్ ఆధీనంలోని వాక్-ఇన్ సెంటర్‌ల నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. మన దేశంలో Pixel 9 Pro Fold ధరను రూ. 1,72,999గా నిర్ణయించారు. దీని ఇంట్రనల్ ఫీచర్స్‌లో భాగంగా 16GB+256GB RAM మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ఉన్న మోడల్ ఇక్కడ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది అబ్సిడియన్‌తోపాటు పింగాణీ రంగుల విక్రయించబడుతుంది. మన దేశంలో ఆగస్టు 22 నుండి Pixel 9 Pro Fold విక్రయించబడుతుందని Google అధికారికంగా వెల్లడించింది.
ఏడు సంవత్సరాల ఆండ్రాయిడ్ OS..
కొత్తగా లాంచ్ చేయబడిన ఈ Google Pixel 9 Pro Fold డ్యూయల్-సిమ్ (నానో+eSIM) హ్యాండ్‌సెట్‌గా అందుబాటులోకి రానుంది. ఇది ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. అలాగే, ఏడు సంవత్సరాల ఆండ్రాయిడ్ OS, సెక్యూరిటీ, పిక్సెల్ డ్రాప్ అప్‌డేట్‌లను కొనుగోలుదారులు పొందవచ్చు. ఈ మోడల్ 8-అంగుళాల (2,076x2,152 పిక్సెల్‌లు) LTPO OLED సూపర్ యాక్చువల్ ఫ్లెక్స్ ఇన్నర్ స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. గరిష్టంగా 2,700nits వరకు బ్రైట్‌నెస్‌తో రూపొందించబడింది. వెలుపల 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల (1,080x2,424 పిక్సెల్‌లు) OLED యాక్చువల్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది.
కెమెరా మరియు ఎడిటింగ్ ఫీచర్స్..
ఫోన్ వెలుపల భాగంలో 48-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో ఎఫ్/1.7ను అందించారు. 10.5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో ఆటోఫోకస్ మరియు ఎఫ్/2.2తో 10.8-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 5x ఆప్టికల్ జూమ్, 20x సూపర్ రెస్ జూమ్ అలాగే, f/3.1తో వస్తుంది. వైడ్ మరియు టెలిఫోటో కెమెరాలు రెండూ ఆప్టికల్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను కలిగి ఉంటాయి. అలాగే, యాడ్ మీ, హ్యాండ్స్-ఫ్రీ ఆస్ట్రోఫోటోగ్రఫీ, ఫేస్ అన్‌బ్లర్, టాప్ షాట్, ఫ్రీక్వెంట్ ఫేసెస్, వీడియో బూస్ట్, విండ్ నాయిస్ రిడక్షన్, ఆడియో మ్యాజిక్ ఎరేజర్, మాక్రో ఫోకస్ వీడియోతో సహా Google ఫోన్‌లకు ప్రత్యేకమైన మేడ్ యు లుక్, మరియు మ్యాజిక్ ఎడిటర్ లాంటి అనేక కెమెరా మరియు ఎడిటింగ్ ఫీచర్‌లను అందిస్తుంది.