త్వరలో iQOO Z11 లాంచ్.. చైనాలో మొదలైన ప్రీ-ఆర్డర్లు, అదిరిపోయే లుక్ అండ్ డిజైన్..!

గేమింగ్ ప్రపంచంలో సంచలనాలు సృష్టించడానికి iQOO సరికొత్త 'Z11' సిరీస్‌తో మనముందుకు వచ్చేస్తోంది.

త్వరలో iQOO Z11 లాంచ్.. చైనాలో మొదలైన ప్రీ-ఆర్డర్లు, అదిరిపోయే లుక్ అండ్ డిజైన్..!

Photo Credit: Gadgets 360

iQOO Z11

ముఖ్యాంశాలు
  • త్వరలో iQOO Z11 లాంచ్
  • చైనాలో మొదలైన ప్రీ-ఆర్డర్లు
  • అదిరిపోయే లుక్ అండ్ డిజైన్
ప్రకటన

గేమింగ్ ప్రపంచంలో సంచలనాలు సృష్టించడానికి iQOO సరికొత్త 'Z11' సిరీస్‌తో మనముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే చైనాలో దీనికి సంబంధించిన టీజర్లు సందడి చేస్తుండగా, తాజాగా విడుదలైన అఫీషియల్ పోస్టర్ ఈ స్మార్ట్‌ఫోన్ లుక్ అండ్ డిజైన్‌ను రివీల్ చేసింది. ముఖ్యంగా ఈ ఫోన్ వెనుక భాగం చాలా క్లాసీగా, ప్రీమియం లుక్‌తో కనిపిస్తోంది. ఇందులో ఒక 'స్క్విర్కిల్' ఆకారంలో ఉండే కెమెరా ఐలాండ్ ఉంది, అందులో రెండు పవర్ ఫుల్ కెమెరా సెన్సార్లు, ఒక ఎల్‌ఈడీ ఫ్లాష్ అమర్చారు. బ్లూ కలర్ ఎడిషన్‌లో మెరిసిపోతున్న ఈ డివైజ్ అంచులు గుండ్రంగా ఉండి, చేతిలో పట్టుకున్నప్పుడు మంచి గ్రిప్‌ను ఇచ్చేలా ఉన్నాయి. ప్రస్తుతం చైనాలో దీని ప్రి-ఆర్డర్లు కూడా మొదలైపోయాయి, కాబట్టి ఈ నెలాఖరులోపు ఇది మార్కెట్లోకి అడుగుపెట్టడం ఖాయమని తెలుస్తోంది.

ఈ జనరేషన్ యూజర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని iQOO Z11లో అత్యంత అద్భుతమైన డిస్‌ప్లేను పరిచయం చేస్తున్నారు. గేమర్లకు అసలైన మజాను అందించడానికి కంపెనీ తొలిసారిగా ఇందులో '165Hz ఐ-ప్రొటెక్షన్ గేమింగ్ స్క్రీన్'ను ఉపయోగిస్తోంది. ఇంతటి హై రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమ్స్ ఆడుతున్నప్పుడు గానీ, యాప్స్ వాడుతున్నప్పుడు గానీ స్క్రీన్ ఎంతో స్మూత్‌గా రన్ అవుతుంది. కళ్లపై ఒత్తిడి పడకుండా ఐ-ప్రొటెక్షన్ టెక్నాలజీని కూడా జోడించడం విశేషం. లీక్స్ ప్రకారం ఇది 6.83 అంగుళాల OLED ప్యానెల్‌తో 1.5K రిజల్యూషన్ అందించనుంది. అంటే విజువల్స్ పరంగా యూజర్లకు ఒక నెక్స్ట్ లెవల్ ఎక్స్‌పీరియన్స్ లభించబోతోంది.

బ్యాటరీ విషయంలో iQOO Z11 ఒక భారీ రికార్డును సృష్టించబోతోంది. ఏకంగా 9,020mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీతో ఈ ఫోన్ రాబోతోంది. iQOO చరిత్రలోనే ఇంత పెద్ద బ్యాటరీని వాడటం ఇదే మొదటిసారి. రోజు మొత్తం గేమింగ్ చేసినా లేదా హెవీగా వాడినా ఛార్జింగ్ అయిపోతుందనే భయం ఉండదు. ఇంత భారీ బ్యాటరీకి తోడుగా 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో, తక్కువ సమయంలోనే ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. నేటి టెక్నాలజీ ప్రపంచంలో ఇది నిజంగా ఒక గ్రేట్ అప్‌డేట్ అని చెప్పాలి. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ డిజైన్ స్లిమ్ గానే ఉండేలా కంపెనీ జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.

పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ ఫోన్ ఎక్కడా తగ్గేలా లేదు. ఇందులో గరిష్టంగా 16GB వరకు భారీ ర్యామ్,  512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. దీనివల్ల మల్టీటాస్కింగ్,  పెద్ద పెద్ద గేమ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా సులభమవుతుంది. సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే, ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్,  iQOO సొంత యూజర్ ఇంటర్‌ఫేస్‌తో రన్ అవుతుంది. స్పీడ్,  స్టెబిలిటీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ ఫోన్, బడ్జెట్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్ల కలయికగా ఉండబోతోంది. హెవీ టాస్క్‌లను కూడా వెన్నలా చేసేసే సామర్థ్యం ఈ ఫోన్ సొంతం.

ఇక ధర విషయానికి వస్తే, చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్ 2,000 నుండి 3,000 యువాన్ల మధ్య అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 26,000 నుండి 40,000 రూపాయల మధ్య ఉండొచ్చని అంచనా. ఈ రేంజ్‌లో 165Hz స్క్రీన్, 9,020mAh బ్యాటరీ అంటే ఇది మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ప్రస్తుతం చైనాలో లాంచ్ అవుతున్న ఈ ఫోన్, త్వరలోనే గ్లోబల్ మార్కెట్‌లోకి,  మన ఇండియాలోకి వచ్చే అవకాశం ఉంది. గేమింగ్ ప్రేమికులకు , ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వస్తే iQOO క్రేజ్ మరో స్థాయికి వెళ్లడం గ్యారెంటీ.

సంబంధిత వార్తలు

#తాజా కథనాలు
  1. గంటకు 1.37 లక్షల మైళ్ల వేగం.. మన సౌర కుటుంబంలోకి దూసుకొచ్చిన 'పరాయి' గ్రహ శకలం!
  2. భూమిపై నీరు ఎక్కడి నుంచి వచ్చింది?.. NASA షాకింగ్ ఆన్సర్.. అంతరిక్షంలో భారీ 'మంచు కొండలు'!
  3. వాట్సాప్‌లో అదిరిపోయే మార్పు.. మెసెంజర్ లాగా 'చాట్ బబుల్స్' వచ్చేస్తున్నాయి.. మల్టీటాస్కింగ్ ఇక ఈజీ!
  4. జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.459 ప్లాన్‌తో రూ.35,000 విలువైన Google AI ఫ్రీ!
  5. గుడ్ న్యూస్! వాట్సాప్‌లోనే మొబైల్ రీఛార్జ్.. జియో, ఎయిర్‌టెల్, Vi యూజర్లు ఎలా రీఛార్జ్ చేయాలో చూడండి!
  6. శాంసంగ్ Galaxy S28 Ultra లీక్స్! ఫోన్ స్క్రీన్ పైనే 3D సినిమాలు.. అదిరిపోయే సరికొత్త మెటాలెన్స్ టెక్నాలజీ!
  7. ఐఫోన్ యూజర్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి! సిగ్నల్ మెసేజ్‌లు లీక్ అవుతున్నాయా? యాపిల్ సీరియస్ వార్నింగ్!
  8. ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్! ఇకపై OTP లతో పనిలేదు.. గూగుల్ తెచ్చిన కొత్త మ్యాజిక్!
  9. గూగుల్ మీట్ అదిరిపోయే అప్‌డేట్! ఇకపై జూమ్, టీమ్స్ మీటింగ్స్ నోట్స్ కూడా గూగుల్ రాసేస్తుంది!
  10. వన్‌ప్లస్ నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్! 8000mAh బ్యాటరీ.. వాటర్ ప్రూఫ్ ఫీచర్స్! ధర ఎంతంటే?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »