ఒప్పో K13X 5G ప్రైస్ ఏ రేంజ్ లో ఉంటుందంటే... బెస్ట్ బడ్జెట్ ఫోన్ అనే చెప్పవచ్చు

లీకైనా రిటైల్ బాక్స్ ఇమేజెస్ ప్రకారం చూస్తే ఈ ఫోన్ ఫ్లాట్ డిస్ప్లే, రౌండ్ కార్నర్స్, టాప్లో సెంటర్ హోల్ పంచ్ స్లాట్ తో వస్తుంది.

ఒప్పో K13X 5G  ప్రైస్ ఏ రేంజ్ లో ఉంటుందంటే... బెస్ట్ బడ్జెట్ ఫోన్ అనే చెప్పవచ్చు

Photo Credit: Oppo

Oppo K13 5G (చిత్రంలో) 8GB + 128GB ఆప్షన్ ధర రూ. 17,999

ముఖ్యాంశాలు
  • ఈ ఒప్పో K13X 5G మోడల్లో 6000mAh బ్యాటరీ బ్యాకప్ ఇస్తున్నారు
  • హై క్వాలిటీ ఫొటోస్ తీసుకునేందుకు 50 మెగాపిక్సల్ రేర్ కెమెరా యూనిట్ ఉంది
  • రూ.15,999 మిడిల్ క్లాస్ బడ్జెట్ ధరలో వస్తుంది
ప్రకటన

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో, ప్రతి నెలా భారత మార్కెట్లో కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ టెక్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇదే క్రమంలో, తాజాగా "ఒప్పో K13X 5G" అనే కొత్త మోడల్‌ని త్వరలో భారత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. అధికారిక లాంచింగ్ తేదీపై ఇంకా స్పష్టత రాకపోయినా, ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. లీకైన డీటెయిల్స్ ప్రకారం ఈ ఫోన్ కస్టమర్లను ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.ఒప్పో నుండి వచ్చే ఫోన్లు మీడియం బడ్జెట్ నుండి ప్రీమియం రేంజ్ వరకు ఉంటాయి. అయితే, ఈ ఒప్పో K13X 5G ధర ఇండియాలో రూ.15,999 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ రేంజ్ బడ్జెట్ పెడితే మిడిల్ క్లాస్ పీపుల్ ఈ ఫోన్ పైన ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ కి సంబంధించి స్టోరేజ్ ఆప్షన్స్ మాత్రం బయటికి రాలేదు. ఒప్పో K12X కూడా రూ.12,999 నుండి రూ. 15,999 మధ్య ఉండగా, దీనికి 6GB+128GB, 8GB+256GB స్టోరేజ్ ఆప్షన్స్ ఇచ్చారు.

ఏప్రిల్లో ఇండియాలో లాంచ్ అయిన ఒప్పో K13 5G వెనీలా 8GB+128GB వేరియంట్ ధర రూ.17,999 గా ఉంటే, 8GB+256GB వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. ఈ మీడియల్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 4 SoC, 7000mAh బ్యాటరీ బ్యాకప్ తో వచ్చింది. వీటి ప్రకారం చూసుకుంటే ఈ ఒప్పో K13X 5G మోడల్ కి కూడా ఇదే రేంజ్ లో స్టోరేజ్ ఆప్షన్స్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

లీకైనా రిటైల్ బాక్స్ ఇమేజెస్ ప్రకారం చూస్తే ఈ ఫోన్ ఫ్లాట్ డిస్ప్లే, రౌండ్ కార్నర్స్, టాప్లో సెంటర్ హోల్ పంచ్ స్లాట్ తో వస్తుంది.

ఈ కొత్త ఒప్పో K13X 5G మోడల్లో మీడియా టెక్ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్ తో బిల్ట్ అవుతుంది. ఇక OS విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 15 కి చెందిన colourOS తో ఈ ఫోన్ రన్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6000mAh బ్యాటరీ బ్యాకప్ కూడా ఇస్తున్నారు. ఇక క్వాలిటీ ఫోటోలు తీసుకునేందుకు అనువుగా బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా యూనిట్ ఉంచారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ ఇష్టపడేవారి కోసం ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సల్ కెమెరాని సెట్ చేశారు.

అయితే అఫీషియల్ లాంచింగ్ డేట్ రానప్పటికీ ఇది ఇండియాలో జూన్ ఎండింగ్ కి అందుబాటులోకి ఉండవచ్చు అని టెక్ పండితులు అంచనా వేస్తున్నారు. మొబైల్ ని ఫ్లిప్ కార్ట్ లేదా అఫీషియల్ ఈ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
మొత్తంగా 5G కనెక్టివిటీ, బెస్ట్ బ్యాటరీ లైఫ్, డీసెంట్ కెమెరా ఆప్షన్స్ అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో రావడంతో ఇది మిడిల్ క్లాస్ కి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు

#తాజా కథనాలు
  1. గంటకు 1.37 లక్షల మైళ్ల వేగం.. మన సౌర కుటుంబంలోకి దూసుకొచ్చిన 'పరాయి' గ్రహ శకలం!
  2. భూమిపై నీరు ఎక్కడి నుంచి వచ్చింది?.. NASA షాకింగ్ ఆన్సర్.. అంతరిక్షంలో భారీ 'మంచు కొండలు'!
  3. వాట్సాప్‌లో అదిరిపోయే మార్పు.. మెసెంజర్ లాగా 'చాట్ బబుల్స్' వచ్చేస్తున్నాయి.. మల్టీటాస్కింగ్ ఇక ఈజీ!
  4. జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.459 ప్లాన్‌తో రూ.35,000 విలువైన Google AI ఫ్రీ!
  5. గుడ్ న్యూస్! వాట్సాప్‌లోనే మొబైల్ రీఛార్జ్.. జియో, ఎయిర్‌టెల్, Vi యూజర్లు ఎలా రీఛార్జ్ చేయాలో చూడండి!
  6. శాంసంగ్ Galaxy S28 Ultra లీక్స్! ఫోన్ స్క్రీన్ పైనే 3D సినిమాలు.. అదిరిపోయే సరికొత్త మెటాలెన్స్ టెక్నాలజీ!
  7. ఐఫోన్ యూజర్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి! సిగ్నల్ మెసేజ్‌లు లీక్ అవుతున్నాయా? యాపిల్ సీరియస్ వార్నింగ్!
  8. ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్! ఇకపై OTP లతో పనిలేదు.. గూగుల్ తెచ్చిన కొత్త మ్యాజిక్!
  9. గూగుల్ మీట్ అదిరిపోయే అప్‌డేట్! ఇకపై జూమ్, టీమ్స్ మీటింగ్స్ నోట్స్ కూడా గూగుల్ రాసేస్తుంది!
  10. వన్‌ప్లస్ నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్! 8000mAh బ్యాటరీ.. వాటర్ ప్రూఫ్ ఫీచర్స్! ధర ఎంతంటే?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »