ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర నేరుగా రూ. 69,360కి తగ్గింది, అంటే మీకు సుమారు రూ. 10,639 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది.
Photo Credit: Google
గూగుల్ పిక్సెల్ 10 ధర అమెజాన్‌లో రూ. 69,360కి తగ్గింది
గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ అంటేనే ఆ క్రేజే వేరు, ముఖ్యంగా ఫోటోగ్రఫీ పిచ్చోళ్లకి ఇది ఒక డ్రీమ్ ఫోన్. కానీ, దీని భారీ ధర చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే మీకోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ ఉంది. ఇండియాలో రూ. 79,999 ధరకు లాంచ్ అయిన గూగుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ 'పిక్సెల్ 10', ఇప్పుడు అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 13,800 కంటే ఎక్కువ సేవింగ్స్ చేసుకునే అవకాశం ఇక్కడ కనిపిస్తోంది. క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవం, పవర్‌ఫుల్ కెమెరా సెటప్, అదిరిపోయే ఏఐ ఫీచర్ల కలయికగా వచ్చిన ఈ ఫోన్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్న వారికి ఇది సరైన సమయం.
ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర నేరుగా రూ. 69,360కి తగ్గింది, అంటే మీకు సుమారు రూ. 10,639 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. ఇంతటితో ఆగకుండా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీల ద్వారా అదనంగా మరో రూ. 3,250 వరకు తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర పాత ఫోన్ ఉంటే, దానిని ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ మొత్తాన్ని ఆదా చేయవచ్చు. సాధారణంగా ఇలాంటి క్రేజీ డీల్స్ ఎక్కువ కాలం ఉండవు, కాబట్టి ఈ డీల్ ముగిసేలోపే ఒక కన్నేయడం మంచిది. ప్రీమియం ఫోన్ తక్కువ ధరలో కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాన్స్.
టెక్నికల్ విషయాలకు వస్తే, పిక్సెల్ 10 గూగుల్ సొంతంగా తయారు చేసిన శక్తివంతమైన టెన్సర్ జీ5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది కేవలం వేగం మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనులను కూడా ఎంతో స్మార్ట్‌గా పూర్తి చేస్తుంది. ఇందులో 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ చేస్తున్నా లేదా హెవీ గేమ్స్ ఆడుతున్నా ఈ ఫోన్ ఏమాత్రం తడబడకుండా స్మూత్‌గా పనిచేస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా గూగుల్ ఇచ్చే అప్‌డేట్స్, యూజర్ ఇంటర్‌ఫేస్ ఎప్పుడూ టాప్ క్లాస్‌లో ఉంటాయి.
ఈ ఫోన్ డిస్‌ప్లే క్వాలిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో 6.3 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ముఖ్యంగా దీని పీక్ బ్రైట్‌నెస్ 3,000 నిట్స్ వరకు ఉండటం వల్ల, మండుటెండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భద్రత కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఇచ్చారు, ఇది చిన్నపాటి గీతలు , పడిపోయినప్పుడు వచ్చే డ్యామేజ్ నుండి ఫోన్‌ను కాపాడుతుంది. మూవీస్ చూడటానికి లేదా సోషల్ మీడియా స్క్రోలింగ్ చేయడానికి ఈ డిస్‌ప్లే ఒక వండర్ అని చెప్పొచ్చు.
కెమెరా విషయానికి వస్తే పిక్సెల్ ఫోన్లు ఎప్పుడూ కింగే. పిక్సెల్ 10 వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపీ మెయిన్ కెమెరా, 13ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్ , 10.8ఎంపీ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఈ టెలిఫోటో లెన్స్ ద్వారా 5x ఆప్టికల్ జూమ్ చేయవచ్చు, అంటే దూరంగా ఉన్న వస్తువులను కూడా క్లారిటీ తగ్గకుండా ఫోటో తీయొచ్చు. ఇక సెల్ఫీల కోసం 10.5ఎంపీ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. గూగుల్ మేజిక్ ఎరేజర్, ఏఐ ఫీచర్లు తోడైతే మీ ఫోటోలు ప్రొఫెషనల్ కెమెరా క్వాలిటీని తలపిస్తాయి.
చివరిగా బ్యాటరీ, ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో 4,970mAh బ్యాటరీ ఉంది. ఇది రోజంతా నిరంతరాయంగా వాడటానికి సరిపోతుంది. దీనికి 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్,15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మార్కెట్లో ఇతర బ్రాండ్లతో పోలిస్తే ఛార్జింగ్ స్పీడ్ కొంచెం తక్కువగా అనిపించినా, బ్యాటరీ ఆప్టిమైజేషన్ మాత్రం చాలా బాగుంటుంది. మొత్తానికి బడ్జెట్ పెరిగినా పర్లేదు కానీ బెస్ట్ కెమెరా ,స్మార్ట్ ఫీచర్లు ఉన్న ఫోన్ కావాలనుకునే వారికి, ఈ డిస్కౌంట్ ధరకు పిక్సెల్ 10 ఒక అద్భుతమైన డీల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ప్రకటన
ప్రకటన
James Webb Space Telescope Little Red Dots May Reveal Birth of Black Holes
Falcon Heavy Roars Back to Life with Powerful Broadband Satellite Launch
Jolly O Gymkhana Now Available Online: Where to Watch This Tamil Reality Show
Mustafa Mustafa OTT Release: Where to Watch the Tamil Friendship Comedy Online