7000mAh భారీ బ్యాటరీతో చైనాలో అడుగుపెట్టిన Realme Neo 7 ఫోన్‌.. ధ‌ర ఎంతో తెలుసా

Realme Neo 7 ఫోన్‌ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh భారీ బ్యాటరీతో వ‌స్తుంది. Realme Neo 7 దుమ్ము, నీటి నియంత్రం కోసం IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంది

7000mAh భారీ బ్యాటరీతో చైనాలో అడుగుపెట్టిన Realme Neo 7 ఫోన్‌.. ధ‌ర ఎంతో తెలుసా

Photo Credit: Realme

Realme Neo 7 మూడు కలర్ ఆప్షన్లలో విడుదలైంది

ముఖ్యాంశాలు
  • Realme Neo 7 ఫోన్‌ డ్యూయల్ స్పీకర్‌ల‌ను కలిగి ఉంటుంది
  • ఇది Android 15 ఆధారిత Realme UI 6.0పై రన్ అవుతుంది
  • మెరుగైన నెట్‌వర్క్ కనెక్టివిటీ కోసం స్కై కమ్యూనికేషన్ సిస్టమ్ 2.0 ఫీచర్‌
ప్రకటన

Neo సిరీస్ నుంచి తాజాగా Realme Neo 7 పేరుతో కంపెనీ కొత్త మోడ‌ల్‌ను చైనాలో లాంచ్ చేసింది. MediaTek Dimensity 9300+ ప్రాసెస‌ర్‌పై ఈ కొత్త Realme ఫోన్ ర‌న్ అవుతుంది. అలాగే, 50-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను అందించారు. అంతేకాదు, Realme GT Neo 6 ఫోన్‌కు కొన‌సాగింపుగా వ‌స్తున్న‌ప్ప‌టికీ ఈ Realme Neo 7 హ్యాండ్‌సెట్‌కు GT బ్రాండింగ్ అనేది లేదు. ఈ ఫోన్‌ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh భారీ బ్యాటరీతో వ‌స్తుంది. Realme Neo 7 దుమ్ము, నీటి నియంత్రం కోసం IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంది.

ధ‌రల విష‌యానికి వ‌స్తే..

Realme Neo 7 ఫోన్‌ 12GB + 256GB RAM స్టోరేజ్ వేరియంట్ ధ‌ర చైనాలో CNY 2,099 (దాదాపు రూ. 24,000)గా ఉంది. అలాగే, 12GB + 512GB, 16GB + 512GB, 16GB + 1TB వేరియంట్ల ధర వ‌రుస‌గా CNY 2,499 (దాదాపు రూ. 29,000), CNY 2,799 (దాదాపు రూ. 32,000), CNY రూ. 3,290 (రూ. 3,290), 16GB + 256GB వెర్షన్ ధర CNY 2299 (దాదాపు రూ. 26,000). ఇది మెటోరైట్ బ్లాక్, స్టార్‌షిప్, సబ్‌మెర్సిబుల్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌

Realme Neo 7 డ్యూయల్ సిమ్ (నానో), Android 15 ఆధారంగా Realme UI 6.0పై ర‌న్ అవుతుంది. 6.78-అంగుళాల 1.5K (1,264x,2,780 పిక్సెల్‌లు) 8T LTPO డిస్‌ప్లే 6,000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2,600Hz స్పర్శ, 2,600Hz ట‌చ్‌ను కలిగి ఉంది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వ‌స్తుంది. OIS స‌పోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ Sony IMX882 కెమెరా, 8-మెగాపిక్సెల్ సెకండరీ వైడ్-యాంగిల్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. మెరుగైన నెట్‌వర్క్ కనెక్టివిటీ కోసం స్కై కమ్యూనికేషన్ సిస్టమ్ 2.0 ఫీచర్‌తో వ‌స్తుంది.

అండర్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌

కనెక్టివిటీ ఎంపికల్లో Realme Neo 7లో 5G, Beidou, బ్లూటూత్ 5.4, GPS, గెలీలియో, GLONASS, QZSS, NavIC, NFC, Wi-Fi 802.11 a/b/g/n/ac/ax/be వంటివి ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లు యాక్సిలరోమీటర్, కలర్ టెంపరేచర్ సెన్సార్, డిస్టెన్స్ సెన్సార్, జియోమాగ్నెటిక్ సెన్సార్ గైరోస్కోప్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, అండర్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ల‌ను అందించారు.

7,000mAh భారీ బ్యాటరీ

ఈ హ్యాండ్‌సెట్‌లో ORReality ఆడియో సౌండ్ సపోర్ట్, హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్‌తో డ్యూయల్ స్పీకర్‌లు కూడా ఉన్నాయి. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh భారీ బ్యాటరీని అందించారు. ఒక్కఛార్జ్‌పై గరిష్టంగా 21గంటల వీడియో ప్లేబ్యాక్, 14గంటల వరకు వీడియో కాలింగ్ సమయాన్ని అందిస్తుంద‌ని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ 162.55x76.39x8.56 మిమీ ప‌రిమాణంతో 213 గ్రాములు బ‌రువు ఉంటుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »