Photo Credit: Instagram
ఇన్‌స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్‌లతో యూజర్‌లను ఆకట్టుకుంటోంది. తాజాగా.. చాలా రోజుల నుంచి ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు ఇబ్బందికరంగా మారిన ఫీచర్‌ను తొలిగించేందుకు కంపెనీ సన్నద్ధమైంది. ఈ విషయాన్ని కంపెనీ హెడ్ సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. అంతేకాదు, ఇప్పటి నుండి యాప్ నుంచి బయటకు వచ్చిన కొద్ది సమయం తర్వాత మళ్లీ యాప్ ఓపెన్ చేస్తే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫీడ్ ఆటోమిటిక్‌గా రిఫ్రెష్ అవ్వదు. దీంతో వినియోగదారు వారి స్క్రీన్‌పై మొదట కనిపించే పోస్ట్‌లను చూడగలుగుతారు. అయితే, ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు వీక్షించిన వీడియోల కోసం వరుస క్రమంలో రిజర్వ్ చేస్తూ, ఎక్కువ వీక్షణలను పొందని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు, రీల్స్ క్వాలిటీని ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తుందని కంపెనీ ధృవీకరించిన తర్వాత ఈ డెవలప్‌మెట్ అమల్లోకి వచ్చింది. ఈ విషయానికి సంబంధించిన మరిన్ని కీలక విషయాలను తెలుసుకుందాం!
వినియోగదారుల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సమీక్షించడంలో ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఎప్పుడూ ముందుంటోంది. ఇటీవల ఆస్క్ మి ఎనీథింగ్ (AMA) సమయంలో ప్లాట్‌ఫారమ్‌లో ఇటీవలి అప్‌డేట్ గురించి ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరిని సోషల్ మీడియాలో అడిగారు. దీనిపై వివరణ ఇస్తూ.. ఇన్‌స్టాగ్రామ్ ఇంటర్‌నల్‌గా రగ్ పుల్ అని పిలవబడే ఫీచర్‌ను ఆపివేసిందంటూ క్లారిటీ ఇచ్చారు. నిజానికి, ఇది వినియోగదారు ఇంటర్‌ఫేస్ (UI) ఫీచర్ అని అన్నారు. దీని కారణంగా వినియోగదారు యాప్‌ని యాక్సెస్ చేసినప్పుడు ఫీడ్ ఆటోమిటిక్‌గా రిఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు ఇదే ఈ ఫ్లాట్‌ఫాంకు పెద్ద తలనొప్పిగా మారింది.
అయితే, యాప్ కంటెంట్‌ను లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో చివరిగా డౌన్‌లోడ్ చేసిన పోస్ట్‌లు, వీడియోలను డిన్‌ప్లే చేయడం జరుగుతుంది. నిజానికి, ఈ ఫీచర్ యూజర్ ఎంగేజ్‌మెంట్‌ను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. స్క్రీన్‌పై మొదట కనిపించిన ఏదైనా ఆసక్తికరమైన కంటెంట్ కదిలితే, మళ్లీ కనిపించకుండా పోతుంది. అంతేకాదు, వినియోగదారులు దాని కోసం మాన్యువల్‌గా క్రిందికి స్క్రోల్ చేయవలసి వస్తోంది. ఇది నిజంగా బాధ కలిగించేదిగా ఆయన అంగీకరించారు. ఈ కారణంగా యూజర్స్ నిరుత్సాహానికి గురవుతున్న కంపెనీ గుర్తించిందని ఆయన వెల్లడించారు.
అంతేకాదు, ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో సరికొత్త మార్పు చేయడంతో ఈ సమస్య మళ్లీ పునరావృతం కాదని మోస్సేరి స్పష్టం చేశారు. ఫీడ్‌ను ఆటోమిటిక్‌గా రిఫ్రెష్ చేయడానికి బదులుగా, Instagram ఇప్పుడు కంటెంట్‌ను లోడ్ చేస్తుంది కానీ వినియోగదారు స్క్రోల్ చేసే వరకు దాన్ని డిస్‌ప్లే చేయదు. దీంతో కొత్తగా లోడ్ చేయబడిన కంటెంట్ అప్పటికే డిస్‌ప్లే చేయబడే పోస్ట్‌ల కిందకు వెళుతుంది. ఇది సగటు వినియోగదారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటనతో ఇన్‌స్టా యూజర్స్ తమ ఆనందాన్ని అదే ఫ్లాట్‌ఫాంపై తెలియజేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఇంకెలాంటి అప్‌డేట్‌లను తీసుకువస్తుందో చూడాల్సి ఉంది.
ప్రకటన
ప్రకటన