Photo Credit: WhatsApp
ప్రముఖ మెసేజింగ్ యాప్ WhatsApp మరో సరికొత్త ఫీచర్స్‌ను వినియోగదారులకు అందించేందుకు సిద్ధమవుతోంది. నిజానికి, ఎప్పటికప్పుడు యూజర్‌లకు ఆకర్షణీయమైన అప్‌డేట్‌లను అందిస్తూ ఈ సంస్థ తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. Android వినియోగదారుల కోసం అనేక రకాల డిజైన్ స్టైల్స్‌లో చాట్‌లు, చాట్ బబుల్‌ల కోసం డిఫాల్ట్ థీమ్ పిక్స్‌ను అందించేలా కొత్త ఫీచర్‌పై WhatsApp పని చేస్తోంది. కొత్త వినియోగదారులు ఇంటర్‌ఫేస్ (UI) ద్వారా ఎక్కువ సంఖ్యలో డిజైన్‌లను ఎంపిక చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. మరెందుకు ఆలస్యం.. WhatsApp నుంచి వస్తోన్న ఈ సరికొత్త ఫీచర్ గురించిన ఆసక్తికరమైన విషయాలను చూసేద్దామా?!
WhatsApp ఫీచర్ ట్రాకర్ WABetaInfo ప్రకారం.. మెసేజింగ్ క్లయింట్ ఈ ఫీచర్‌ను రాబోయే యాప్ వెర్షన్‌లో విడుదల చేయడానికి కంపెనీ డెవలప్ చేస్తోంది. ఇది Android వెర్షన్ 2.24.20.12 కోసం WhatsApp బీటాలో రూపొందించబడుతోంది. ఈ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు తమకు ఇష్టమైన డిజైన్‌లను ఎక్కువ సంఖ్యలో ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, ఇప్పటికే గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ డీఫాల్ట్ చాట్ థీమ్ ఫీచర్ బీట్ టెస్టర్స్ కోసం Android WhatsApp బీటా 2.24.2012 అప్‌డేట్‌ను అందుబాటులో ఉంచారు. ఈ ఫీచర్ ద్వారా మనకు నచ్చిన పలు రకాల థీమ్‌లను ఎంపిక చేసుకోవచ్చు.
WABetaInfo విడుదల చేసిన స్క్రీన్‌షాట్‌లను పరిశీలిస్తే.. చాట్ బబుల్స్, వాల్‌పేపర్‌ల రంగులు ఎంచుకునే థీమ్‌ను డీఫాల్ట్‌గా ఎంపిక చేయబడతాయి. అలాగే, వినియోగదారులు చాట్ బబుల్‌తో సంబంధం లేకుండా వాల్‌పేపర్ కోసం రంగులను ఎంచుకునే అవకాశం కూడా ఉండవచ్చని తెలుస్తోంది. దీని ద్వారా యూజర్స్ తమకు కావాల్సిన వాల్‌పేపర్ రంగులను ఇష్టంగా సెట్ చేసుకోవచ్చు. Android కోసం WhatsAppలోని సెట్టింగ్‌లలో ఎక్కువ థీమ్‌లను సెలక్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే.. యాప్ సెట్టింగ్ ద్వారా వినియోగదారులు థీమ్ కస్టమైజేషన్ అనే ఆప్షన్‌ను ద్వారా చాట్ థీమ్‌ను మనకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకునేలా దీనిని రూపొందించారు. ఇది డిఫాల్ట్‌గా అన్ని సంభాషణలకు వర్తింపజేయడానికి ఈ ఫీచర్ సహాయపడుతుంది. అంతేకాదు, వినియోగదారులు ఒక నిర్దిష్ట సంభాషణ కోసం కూడా దీన్ని మాన్యువల్‌గా ఎంపిక చేసుకునే అవకాశం కూడా కల్పించారు.
ఇంకా డెవలప్‌మెంట్ దశలోనే..
అయితే, WABetaInfo నివేదిక ప్రకారం..ఈ డిఫాల్ట్ థీమ్‌ను ఎంచుకునే కొత్త ఫీచర్ ఇంకా పూర్తి కాలేదని, డెవలప్‌మెంట్ దశలోనే ఉందని, Google Play బీటా ప్రోగ్రామ్ ద్వారా ఎన్రోల్ అయిన బీటా టెస్టర్‌లకు కూడా అందుబాటులో లేదని స్పష్టం చేసింది. ఏదేమైనప్పటికీ, ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వినియోగదారుల కోసం అనేక కొత్త ఫీచర్‌లపై పని చేస్తున్నప్పటికీ, అవన్నీ ఇతర ఫ్లాట్‌ఫారమ్‌లలో వినియోగించడం సాధ్యం కాదని గుర్తించడం చాలా ముఖ్యమని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ కొత్త అప్‌డేట్ పూర్తిగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని WhatsApp వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రకటన
ప్రకటన