Photo Credit: Pexels/ Anton
iOS లో WhatsApp వినియోగదారులు మోషన్ ఫోటోలను లైవ్ ఫోటోలుగా వీక్షించగలగాలి.
ఫీచర్ ట్రాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. చాట్స్, ఛానెల్‌లలో మోషన్ ఫోటోలను షేర్ చేయడానికి అవకాశం కల్పించే అంశంపై WhatsApp పని చేస్తోంది. ఈ మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ సర్వీస్ త్వరలో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావచ్చు. ఇది వినియోగదారులు ఫోటో తీసేటప్పుడు కొన్ని స్మార్ట్ ఫోన్‌లకు రికార్డ్ చేసిన ఆడియో, వీడియోతో బ్రీఫ్ క్లిప్‌ను షేర్ చేయడానికి అవకాశాం కల్పిస్తుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ల కోసం యాప్ తాజా బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ డెవలప్ చేస్తున్నట్లు వెల్లడైంది. ఐఫోన్ వినియోగదారులు వీటిని iOS నందు WhatsAppలో లైవ్ ఫోటోలుగా చూడగలుగుతారు.
WABetaInfo షేల్ చేసిన వివరాలు ప్రకారం.. ఈ మెసేజింగ్ సర్వీస్ పర్సనల్ చాట్స్, గ్రూప్ చాట్స్‌తోపాటు ఛానెల్‌లలో మోషన్ పిక్చర్‌లను షేర్ చేసేందుకు కృషి చేస్తోంది. మొదట ఆండ్రాయిడ్ 2.25.8.12 అప్‌డేట్ కోసం వాట్సాప్ బీటాలో కనిపించింది. అలా ప్లే స్టోర్ ద్వారా బీటా టెస్టర్లకు అందుబాటులోకి రానుంది. అయితే, ఇది ఇంకా డెవలప్‌మెంట్ దశలోనే ఉండడంతో వినియోగదారులు ఈ ఫీచర్‌ను అప్పుడే ప్రయత్నించలేరు.
ఈ మోషన్ ఫోటోలు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లలో సపోర్ట్ చేసే ఫీచర్. ఇది ఎంపిక చేసిన డివైజ్‌లలోని కెమెరా యాప్ ద్వారా క్యాప్చర్ చేయొచ్చు. మోషన్ ఫోటో (లేదా పిక్సెల్ ఫోన్‌లలో టాప్ షాట్) తీసేటప్పుడు హ్యాండ్‌సెట్ ఒక చిన్న వీడియో క్లిప్, కొంత ఆడియోను స్టిల్ ఇమేజ్‌తో పాటుగా రికార్డ్ చేస్తుంది. ఈ ఫీచర్ iOSతో సమానమైన లైవ్ ఫోటోలుగా చెప్పొచ్చు. రాబోయే మీడియా పికర్ స్క్రీన్‌షాట్ (ప్రస్తుతం బీటా పరీక్షకులకు అందుబాటులో ఉంది) పాప్-అప్ కార్డ్ కుడిపైపున ఎగువ భాగంలో, HD బటన్ పక్కన ఉన్న కొత్త సింబల్‌ను చూపుతోంది.
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, వినియోగదారులు వారి Android స్మార్ట్ ఫోన్ నుండి ఇతర వినియోగదారులకు మోషన్ ఫోటోలను షేర్ చేయవచ్చు. ఈ ఇమేజ్‌లు ప్రస్తుతం స్టాటిక్ ఇమేజ్‌లుగా షేర్ చేయబడుతున్నాయి. WhatsApp నుంచి రాబోయే వెర్షన్ వినియోగదారులు చాట్స్‌లో లేదా ఛానెల్‌లలో మోషన్ పిక్చర్‌లను (లేదా iOSలో లైవ్ ఫోటోలు) షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది.
WABetaInfo ప్రకారం, మోషన్ ఫోటోలను క్యాప్చర్ చేయడం ఎంపిక చేసిన Android స్మార్ట్ ఫోన్‌లకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నప్పటికీ, WhatsApp రిజీవర్స్ వాటిని సపోర్ట్ చేయని హ్యాండ్‌సెట్‌లకు కూడా అనుమతిస్తుంది. అంటే, దీని అర్థం WhatsApp అన్ని Android ఫోన్‌లలో ఈ ఇమేజ్‌లను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తుందన్నమాట. ప్రస్తుతానికి డెవలప్‌మెంట్ దశలో ఉన్న ఇతర ఫీచర్ల మాదిరిగానే, WhatsApp ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకువస్తుందన్న దానిపై ఎలాంటి సమాచారం లేదు. ఇది పరీక్షించడానికి సిద్ధమైన తర్వాత, స్టేబుల్ ఛానెల్‌లోని అందరి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే ముందు, ఆండ్రాయిడ్‌లోని బీటా టెస్ట్‌లకు ఇది అందుబాటులో ఉండాల్సి ఉంటుంది.
ప్రకటన
ప్రకటన