ఈ ఫీచర్ గురించి వివరాలను ప్రముఖ ఫీచర్ ట్రాకర్ WABetaInfo వెల్లడించింది. సంస్థ తాజాగా విడుదల చేసిన WhatsApp iOS బీటా వెర్షన్ 25.28.10.72 లో ఈ ఫీచర్‌కు సంబంధించిన కొత్త కోడ్‌ను గుర్తించింది. ఇప్పటికీ ఇది టెస్టింగ్ దశలోనే ఉన్నప్పటికీ, త్వరలోనే యాప్‌కి రాబోయే అప్‌డేట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ఫీచర్ గతంలో ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్‌లో అభివృద్ధిలో ఉందని నివేదించబడింది
మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ WhatsApp మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను తీసుకురానుంది. తాజా సమాచారం ప్రకారం, iOS యూజర్ల కోసం WhatsApp త్వరలో "క్విక్ షేర్ ఆప్షన్" అనే కొత్త ఫీచర్‌ను అందించబోతోంది. దీని ద్వారా యూజర్లు తమ స్టేటస్ అప్‌డేట్స్‌ను మరింత వేగంగా, సులభంగా షేర్ చేయగలరు.... ప్రత్యేకంగా వేరే ఇంటర్‌ఫేస్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా.ఈ ఫీచర్ గురించి వివరాలను ప్రముఖ ఫీచర్ ట్రాకర్ WABetaInfo వెల్లడించింది. సంస్థ తాజాగా విడుదల చేసిన WhatsApp iOS బీటా వెర్షన్ 25.28.10.72 లో ఈ ఫీచర్‌కు సంబంధించిన కొత్త కోడ్‌ను గుర్తించింది. ఇప్పటికీ ఇది టెస్టింగ్ దశలోనే ఉన్నప్పటికీ, త్వరలోనే యాప్‌కి రాబోయే అప్‌డేట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
కొత్త ఫీచర్‌తో WhatsApp స్టేటస్ పేజ్ ఇంటర్‌ఫేస్ కూడా మారబోతోంది. అది Instagram లుక్‌ను పోలి ఉండేలా డిజైన్ చేయబడిందని తెలుస్తోంది. యూజర్లు స్క్రీన్ దిగువ ఎడమ వైపున view countను చూడగలరు. మరొక ముఖ్యమైన మార్పు ఏమిటంటే... WhatsApp స్టేటస్‌ను నేరుగా Facebook లేదా Instagram లో షేర్ చేసే రెండు కొత్త ఆప్షన్లు అందించబడనున్నాయి.
దీంతో యూజర్లు తమ స్టేటస్ అప్‌డేట్స్‌ను ఈ రెండు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా వెంటనే క్రాస్‌పోస్ట్ చేయవచ్చు. అయితే, యూజర్లకు పూర్తి నియంత్రణ ఉంటుంది... అంటే వారు కావాలనుకుంటే కేవలం Facebookలో లేదా Instagramలో మాత్రమే షేర్ చేయవచ్చు. ఒక ప్లాట్‌ఫార్మ్‌లో షేర్ చేసిన స్టేటస్ మరొకదానిలో ఆటోమేటిక్‌గా పోస్ట్ కాదు.
అయితే, ఈ కొత్త ఫీచర్ ఉపయోగించాలంటే యూజర్లు తమ WhatsApp అకౌంట్‌ను మెటా ఎకౌంటు సెంటర్ కి లింక్ చేయాలి. ఇది మెటా యాప్స్ మధ్య అనుసంధానాన్ని నిర్వహించే కేంద్ర హబ్‌గా పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరిమిత iOS బీటా టెస్టర్లకే అందుబాటులో ఉంది. వీరు Apple's TestFlight ప్రోగ్రామ్ ద్వారా నమోదు చేసిన వారు మాత్రమే. రాబోయే వారాల్లో ఈ ఫీచర్ మరింత విస్తృతంగా టెస్టింగ్ కోసం విడుదలయ్యే అవకాశం ఉంది.
మొత్తానికి, WhatsApp యొక్క ఈ కొత్త క్విక్ షేర్ ఫీచర్ ద్వారా యూజర్లకు స్టేటస్ అప్‌డేట్స్‌ను Facebook మరియు Instagramలో భాగస్వామ్యం చేయడం మరింత వేగంగా, సులభంగా మారబోతోంది. ఈ కొత్త అప్డేట్ WhatsApp అభిమానులకు మంచి అనుభూతిని ఇచ్చే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన