Photo Credit: X/CMF by Nothing
ఎసెన్షియల్ స్పేస్ అనేది సమాచారాన్ని నిల్వ చేసి, తరువాత AI ఉపయోగించి దానిని గుర్తుకు తెస్తుందని చెబుతారు.
CMF ఫోన్ 2 ప్రో ఏప్రిల్ 28న లాంఛ్ కాబోతోంది. ఇది ఇండియాలోపాటు గ్లోబల్ మొబైల్ మార్కెట్‌కు పరిచయం కానుంది. అయితే, దీని అరంగేట్రానికి ముందే ఈ నథింగ్ అనుబంధ సంస్థ రాబోయే హ్యాండ్‌సెట్‌కు చెందిన పలు కీలక అంశాలను టీజ్ చేసింది. వాటిలో ప్రధానమైనదిగా ఫోన్ కృత్రిమ మేధస్సు(AI) సామర్థ్యాలుగా చెప్పొచ్చు. రాబోయే ఫోన్ 2 ప్రో ఈ సంవత్సరం మార్చిలో వచ్చిన నథింగ్ ఫోన్ 3a సిరీస్ ద్వారా పరిచయం అయిన AI- ఆధారిత ఎసెన్షియల్ స్పేస్ ఫీచర్‌తోపాటుగా, అది పని చేసేందుకు అవసరమైన ప్రత్యేక బటన్‌తో దీనిని రూపొందించబడినట్లు కంపెనీ స్పష్టం చేసింది.నథింగ్ ఫోన్ 3a సిరీస్ మాదిరి,X వేదికగా కంపెనీ ఓ అధికారిక పోస్ట్ ద్వారా సెకండ్ మెమరీతోపాటు వినియోగదారులు తమ ఎసెన్షియల్ స్పేస్ ఫీచర్‌ను కూడా ఈ ఫోన్‌లో ఉపయోగించవచ్చని తెలిపింది. ఈ ఫోన్ కుడివైపు స్పైన్ మీదుగా, గతంలో విడుదలైన నథింగ్ ఫోన్ 3a సిరీస్ ఫోన్‌ల మాదిరిగానే పవర్ బటన్ పక్కనే ఉన్న ప్రత్యేకమైన ఎసెన్షియల కీ తో యాక్టివేట్ చేయబడుతుందని తెలిపింది.
ఈ ఎసెన్షియల్ స్పేన్ అన్ని రకాల డేటానూ.. అంటే ఫోటోలు, వాయిస్ నోట్స్, స్క్రీన్‌షాట్‌లు లాంటి డేటాను కలెక్ట్ చేసి, వాటిని AI ద్వారా రీకాల్ చేసుకునేందుకు ఇది వన్-స్టాప్ సొల్యూషన్‌గా వర్క్ చేస్తోంది. ఆడియో, ఇమేజ్, టెక్ట్స్ సంబంధిత జాబితాను క్రమబద్ధీకరించే స్మార్ట్ కలెక్షన్ అనే ఫీచర్‌ను కూడా అందించినట్లు కంపెనీ చెబుతోంది. అంతే కాదు, దీని ద్వారా డేటా మాన్యువల్ ఆర్గనైజేషన్ అవసరం పూర్తిగా ఉండదు.
నథింగ్ ఫోన్ 3a సిరీస్‌లో కెమెరా క్యాప్చర్ ఫీచర్‌కు ఈ ఎసెన్షియల్ కీ సపోర్ట్ చేస్తుంది. అయితే, రాబోయే కొత్త మోడల్‌లో ఈ ఎసెన్షియల్ కీ సపోర్ట్ ఫీచర్ ఉంటుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ తో రన్ అవుతుందని కంపెనీ స్పష్టం చేసింది. అలాగే, రాబోయే ఈ ఫోన్ 2024వ సంవత్సరంలో వచ్చిన ఫోన్ 1 మోడల్‌తో పోల్చితే, ఐదు శాతం గ్రాఫిక్స్ డెవలప్‌మెంట్‌ను, 10 శాతం వరకూ వేగవంతమైన సీపీయూను అందిస్తోందని కంపెనీ వెల్లడించింది.
ఈ ఫోన్‌కు ట్రిపుల్ రియల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50- మెగాపిక్సెల్ 1/1.57- అంగుళాల సెన్సార్‌తోపాటు 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50- మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంది. అలాగే, 119.5- డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 8- మెగాపిక్సెల్ అల్ట్రా- వైడ్ కెమెరాను కూడా అందించారు. ఈ ఫోన్ BGMI కోసం 120fps సపోర్ట్‌తో 1000 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందిస్తుందని టీజ్ ద్వారా తెలుస్తోంది. అంతే కాదు, లాంఛ్ టైం ఏప్రిల్ 28 దగ్గర పడుతోన్న కొలదీ, మరిన్ని విషయాలు బహిర్గతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన