రియల్‌మీ 14T 5G స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకునే 2,100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో AMOLED డిస్ప్లేతో రూపొందించబడింది. అలాగే 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Photo Credit: Xiaomi
Realme 14T 5G లైట్నింగ్ పర్పుల్, అబ్సిడియన్ బ్లాక్ మరియు సర్ఫ్ గ్రీన్ రంగులలో వస్తుంది
భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి తాజాగా రియల్‌మీ 14T 5G స్మార్ట్ ఫోన్, శుక్రవారం(మే 25న) విడుదలైంది. శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 6,000 mAh బ్యాటరీ, 45W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ దీని ప్రత్యేకతలు. ఈ గ్యాడ్జెట్‌లో వెనుక వైపు 50 మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరా, ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. అంతేకాదు, దుమ్ము- నీటిని నిరోధించేందుకు ఈ రియల్‌మీ ఫోన్.. ఐపీ66+ఐపీ68+ఐపీ69 రేటింగ్‌ను కలిగి ఉంది.భారత్‌లో ధర ఎంతంటే?రియల్‌మీ 14T 5G స్మార్ట్ ఫోన్ రెండు వెరియంట్లలో లభిస్తోంది. 8GB + 128GB వేరియంట్ ఆరంభ ధర రూ. 17,999 ఉండగా.. 8GB + 256GB వెర్షన్ ధర రూ. 19,999గా ఉంది. ఈ హ్యాండ్ సెట్ లైట్నింగ్ పర్పుల్, ఆబ్సిడియన్ బ్లాక్, సర్ఫ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిని వినియోగదారులు ఫ్లిఫ్‌కార్ట్, రియల్‌మీ ఇండియా అధికారిక ఈ-స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ 14T 5G స్మార్ట్ ఫోన్.. 6.67-అంగుళాల ఫుల్-HD+ (1,80×2,400 పిక్సెల్స్) AMOLED డిస్ప్లే తో వస్తుంది. అలాగే ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో, 2,100nits పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉండటం విశేషం. 180Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. 92.7% స్క్రీన్ టు బాడీ రేషియో, 20:9 యాస్పెక్ట్ రేషియో, కలిగి ఉంటుంది. DCI-P3 వైడ్ కలర్ గామట్ 111 శాతం వరకు ఉంటుంది. మరోవైపు TUV రీన్‌ల్యాండ్ సర్టిఫైడ్ డిస్ప్లే ఉండటంతో రాత్రిపూట కంటిపైన ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ 6nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8GB LPDDR4X RAM, 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మీ UI 6పై పనిచేస్తుంది.
ఇక రియల్‌మీ 14T 5G కెమెరా విషయానికొస్తే ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా (f/1.8 ఎపర్చర్)తోపాటు, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ (f/2.4 ఎపర్చర్) ఉంటుంది. సెల్ఫీ ఫోటోలు తీసుకునేందుకు ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెటప్‌తో సెల్ఫీ కెమెరా (f/2.4 ఎపర్చర్) ఉంది. వీటితోపాటు కెమెరా విభాగంలో లైవ్ ఫోటో మోడ్, AI ఆధారిత ఇమేజింగ్ టూల్స్ ప్రత్యేకంగా ఉన్నాయి. ఇవి ఫోటోలు, వీడియోలను మరింత నాణ్యతతో అందించేందుకు సహాయపడతాయి.
ఇక బ్యాటరీ విషయానికొస్తే.. రియల్‌మీ 14T 5G స్మార్ట్ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీని అమర్చారు. ఇది 45W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో కొద్ది సమయంలోనే మొబైల్ ఫుల్ ఛార్జింగ్ అవుతుంది.
కనెక్టివిటీ పరంగా రియల్‌మీ 14T 5Gలో ఆధునాతనమైన ఫీచర్లు ఉన్నాయి. ప్రధానంగా 5G, 4G నెట్‌వర్క్ సపోర్ట్‌తో పాటు, జీపీస్, వై-ఫై 5, బ్లూటూత్ 5.3 కలిగి ఉంది. అలాగే ఇందులో యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ కూడా ఉంది. . డిజైన్ పరంగా రియల్‌మీ 14T 5G స్మార్ట్ ఫోన్ యూనిక్ డిజైన్‌తో ఆకర్షిస్తోంది. 7.97మీమీ మందంతో 196 గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన
The Offering Is Streaming Now: Know Where to Watch the Supernatural Horror Online
Lazarus Is Now Streaming on Prime Video: Know All About Harlan Coben's Horror Thriller Series