యాపిల్ సంస్థ తన వార్షిక వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2026 వేదికగా సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను పరిచయం చేసేందుకు సర్వం సిద్ధం చేస్తోంది.
Photo Credit: Techjuice
iOS 27లో మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు
యాపిల్ సంస్థ తన వార్షిక వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2026 వేదికగా సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను పరిచయం చేసేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఓఎస్ 27, ఐప్యాడోస్ 27 అప్‌డేట్స్ గురించి టెక్ ప్రపంచంలో అప్పుడే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. గతేడాది 'లిక్విడ్ గ్లాస్' పేరుతో తీసుకొచ్చిన భారీ విజువల్ మార్పుల తరహాలో ఈసారి విప్లవాత్మక డిజైన్ మార్పులేవీ ఉండకపోవచ్చని ప్రముఖ టెక్ జర్నలిస్ట్ మార్క్ గుర్మన్ తన తాజా నివేదికలో పేర్కొన్నారు. ఈసారి యాపిల్ కేవలం గతంలో ప్రవేశపెట్టిన డిజైన్‌ను మరింత మెరుగుపరచడంపైనే దృష్టి సారించిందని, యూజర్ ఎక్స్‌పీరియెన్స్‌ను స్మూత్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది.
ముఖ్యంగా యాపిల్ ఇంటర్‌ఫేస్ విభాగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నప్పటికీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న లిక్విడ్ గ్లాస్ డిజైన్‌ను పక్కన పెట్టే ఆలోచనలో కంపెనీ లేదని స్పష్టమవుతోంది. గతంలో తీసుకొచ్చిన గ్లాస్ ఎఫెక్ట్స్ వల్ల కొన్ని చోట్ల టెక్స్ట్ లేదా ఐకాన్లు స్పష్టంగా కనిపించడం లేదని యూజర్లు ఫిర్యాదులు చేశారు. ఈ రీడబిలిటీ సమస్యలను పరిష్కరిస్తూ, ఇంటర్‌ఫేస్‌ను, క్లియర్‌గా మార్చేందుకు యాపిల్ ఇంజనీర్లు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఐఓఎస్ 26.4 వంటి అప్‌డేట్స్ ద్వారా ఈ దిశగా అడుగులు పడుతుండగా, ఐఓఎస్ 27లో ఈ మార్పులు మరింత పరిణతి చెంది కనిపిస్తాయి. అంటే ఈసారి విజువల్ గా కొత్తదనం కంటే, ఉన్న దానిని పర్ఫెక్ట్ గా మార్చడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ అప్‌డేట్‌లో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, యూజర్లు తమ ఇష్టానుసారం గ్లాస్ ఎఫెక్ట్ తీవ్రతను తగ్గించుకోవడానికి లేదా పెంచుకోవడానికి వీలుగా ఒక సిస్టమ్ వైడ్ కంట్రోల్‌ను ఆపిల్ తీసుకురావాలని భావిస్తోంది. గతంలో లాక్ స్క్రీన్ క్లాక్ వరకు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్‌ను, ఇప్పుడు హోమ్ స్క్రీన్, యాప్ ఫోల్డర్లు, నావిగేషన్ బార్లకు కూడా విస్తరించాలని చూస్తున్నారు. దీనివల్ల ప్రతి యూజర్ తమ కళ్లకు నచ్చిన విధంగా ఫోన్ లుక్‌ను మార్చుకునే వెసులుబాటు కలుగుతుంది. అయితే దీని వెనుక కొన్ని టెక్నికల్ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ, ఐఓఎస్ 27 ద్వారా వాటిని అధిగమించి యూజర్లకు పూర్తి నియంత్రణను అందించాలని ఆపిల్ గట్టిగా ప్రయత్నిస్తోంది.
ఈ ఏడాది సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌లో అసలైన హైలైట్ 'ఐఫోన్ ఫోల్డ్'. ఈ ఫోల్డబుల్ డివైజ్ కోసం ఆపిల్ ప్రత్యేకంగా రీడిజైన్ చేసిన లేఅవుట్‌లను సిద్ధం చేస్తోంది. ఐఫోన్ మడత విప్పినప్పుడు, దాని ఇంటర్‌ఫేస్ డైనమిక్‌గా మారి ఐప్యాడ్ తరహా అనుభూతిని ఇస్తుంది. పెద్ద స్క్రీన్ ఉన్నప్పుడు నావిగేషన్ బార్లు ఎడమ వైపునకు మారడం వంటి స్మార్ట్ ఫీచర్లను కూడా ఐఓఎస్ 27 లో చూడవచ్చు. ఇది కేవలం లుక్ పరంగానే కాకుండా, పనితీరు పరంగా కూడా ఫోల్డబుల్ ఫోన్ వినియోగదారులకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతోంది. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ మధ్య సమన్వయం ఎలా ఉంటుందో అని టెక్ లవర్స్ ఆత్రుతగా ఉన్నారు.
మరో భారీ ఫీచర్ ఏంటంటే, ఐఫోన్ చరిత్రలో మొదటిసారిగా స్ప్లిట్-స్క్రీన్ మల్టీటాస్కింగ్‌ను ఫోల్డబుల్ ఐఫోన్ ద్వారా ప్రవేశపెట్టబోతున్నారు. దీనివల్ల పెద్ద స్క్రీన్‌పై ఒకేసారి రెండు యాప్‌లను పక్కపక్కనే వాడుకునే వీలుంటుంది. ఆపిల్ విజన్ ప్రోలో వాడే విజన్ ఓఎస్ ప్రేరణతో రూపొందించిన ఈ లిక్విడ్ గ్లాస్ ఇంటర్‌ఫేస్, యాపిల్ ప్రొడక్ట్స్ అన్నింటినీ ఒకే తాటిపైకి తెస్తోంది. గతేడాది ఏఐ రేసులో వెనుకబడిందన్న విమర్శల నుండి అందరి దృష్టిని మళ్లించేలా ఈ డిజైన్ పనిచేసింది. ఇప్పుడు అదే డిజైన్‌ను ఫోల్డబుల్ ఫోన్లకు అనుగుణంగా మార్చడం ద్వారా యాపిల్ తన సృజనాత్మకతను చాటుకోవాలని భావిస్తోంది.
మొత్తానికి ఐఓఎస్ 27 అనేది భారీ విప్లవం కాకపోయినా, ఒక స్థిరమైన, ఆలోచనాత్మకమైన అప్‌డేట్ అని చెప్పవచ్చు. కొత్తగా రాబోయే ఫోల్డబుల్ కేటగిరీకి ఇది పునాది వేయబోతోంది. పాత డిజైన్‌లోని లోపాలను సరిదిద్దడం, కొత్త డివైజ్‌ల కోసం యూజర్ ఇంటర్‌ఫేస్‌ను సిద్ధం చేయడం వంటి అంశాలపై ఆపిల్ ఫోకస్ పెట్టింది. డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026 సదస్సులో ఈ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి మరిన్ని అధికారిక వివరాలు వెల్లడవుతాయి. అప్పటి వరకు ఈ లీక్స్ టెక్ ప్రియుల్లో అంచనాలను భారీగా పెంచుతున్నాయి. ఫోల్డబుల్ ఐఫోన్ రాకతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ తన ఆధిపత్యాన్ని ఎలా నిలబెట్టుకుంటుందో చూడాలి.
ప్రకటన
ప్రకటన
Oppo Find X9s Launched in India With Hasselblad-Tuned 50-Megapixel Cameras, 7,025mAh Battery: Price, Features