Photo Credit: Motorola
జపాన్ మార్కెట్లోకి Motorola Razr 50D ఫోన్ వచ్చే వారం లాంచ్ కానుంది. అయితే, Motorola ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్ విడుదల గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ, లాంచ్ కోసం ఓ మైక్రోసైట్ జపనీస్ మొబైల్ ఆపరేటర్ NTT డొకోమో వెబ్‌సైట్‌లో విడుదల తేదీ, ధరతోపాటు స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఇందులో ఫోన్ డిజైన్‌తోపాటు కలర్ ఆప్షన్‌లను కూడా బహిర్గతం చేసింది. మన దేశంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న Razr 50 ఫోన్ మాదిరిగానే Motorola Razr 50D డిజైన్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్ 6.9-అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 3.6-అంగుళాల కవర్ స్క్రీన్‌తో రూపొందించబడింది.
NTT డొకోమో వెబ్‌సైట్‌తోపాటు మైక్రోసైట్‌లో వెల్లడైన వివరాల ప్రకారం ఈ మొబైల్ లాంచ్ తేదీ, ధర, ప్రీ-ఆర్డర్‌తోపాటు కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్‌లు వెల్లడయ్యాయి. అలాగే, జపాన్‌లో దీని ధర JPY 1,14,950 (దాదాపు రూ. 65,000)గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డిసెంబర్ 19న విడుదల కానుంది. నెలవారీ వాయిదాగా JPY 2,587 (దాదాపు రూ. 1,500) చెల్లించడం ద్వారా దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఫోన్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌లకు కూడా అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు డిసెంబర్ 17 నుండి కస్టమర్‌లు దీనిని ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.
ఈ Motorola Razr 50D ఫోన్ వైట్ మార్బుల్ ఫినిషింగ్‌లో అందుబాటులోకి రానుంది. అలాగే, క్లామ్‌షెల్-ఫోల్డబుల్ గుండ్రని సైడ్‌లతో డిజైన్‌తో ఇది Razr 50 ఫోన్ మాదిరిగా ఉంటుంది. రెగ్యులర్ Motorola Razr 50 డొకోమో-ఎక్స్‌క్లూసివ్ మోడల్‌గా కనిపిస్తోంది. ఈ స్టాండర్డ్ Motorola Razr 50 ఫోన్ మన దేశంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర 64,999గా ఉంది.
లిస్ట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. డ్యూయల్ సిమ్ (నానో+eSIM)తో Motorola Razr 50D ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో కూడిన 6.9-అంగుళాల ఫుల్-HD+ పోలెడ్ ఇన్నర్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 3.6-అంగుళాల ఔటర్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌కు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 13-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ను అందించారు. అలాగే, ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను కూడా ఏర్పాటు చేశారు.
Motorola Razr 50D ఫోన్ 4,000mAh బ్యాటరీతో 8GB RAM + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో ఒకే వేరియంట్ గుర్తించబడింది. ఇది IPX8-రేటెడ్ వాటర్-రిపెల్లెంట్ బిల్డ్, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 171x74x7.3mm పరిమాణంతో 187గ్రాముల బరువుతో రానుంది. భారత్‌లో అందుబాటులో ఉన్న Motorola Razr 50 మోడల్ 6.9-అంగుళాల ఇంట్రనల్ స్క్రీన్, 3.63-అంగుళాల కవర్ డిస్‌ప్లేతో ఉంది. ఇది MediaTek డైమెన్సిటీ 7300X ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.
ప్రకటన
ప్రకటన