Photo Credit: Samsung
Galaxy S25 Edge ఇతర S25 మోడల్‌ల కంటే స్లిమ్మెర్ ప్రొఫైల్‌ను కలిగి ఉందని ఆటపట్టించబడింది.
రాబోయే మరికొన్ని నెలల్లో Samsung Galaxy S25 Edge లాంచ్ కావచ్చని ఓ నివేదిక ప్రకారం తెలుస్తోంది. దక్షిణ కొరియా టెక్నాలజీ యూనిట్ కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో జరిగిన Galaxy Unpacked 2025 ఈవెంట్‌లో Galaxy S25 సిరీస్‌ను పరిచయం చేసింది. దీంతోపాటు, దాని ఫ్లాగ్‌షిప్ మోడల్‌ల కంటే సన్నని ప్రొఫైల్‌తో మరో కొత్త ప్రొడక్ట్‌ను కూడా ఆవిష్కరించి, దీని Edge బ్రాండింగ్‌ను తిరిగి తీసుకువచ్చింది. దీనిని Galaxy S25 Edge అనే పేరుతో పరిచయం చేయనున్నట్లు భావిస్తున్నారు. అయితే, ఫోన్‌ను కేవలం టీజ్ చేశారు. దాని ధర, స్పెసిఫికేషన్‌ల గురించి ఎలాంటి సమాచారం వెలువరించ లేదు.
తాజాగా, ఓ కంపెనీ ప్రతినిధి అధికారికంగా Galaxy S25 Edge లాంచ్ టైమ్‌లైన్‌ను టీజ్ చేసినట్లు ఓ నివేదిక చెబుతోంది. షోకేస్ చివరిలో ఓ శామ్‌సంగ్ ప్రతినిధి మాట్లాడిన విషయాన్ని వెల్లడిస్తూ.. 9to5Google రిపోర్ట్ ఆధారంగా, గెలాక్సీ S25 స్లిమ్ ఏప్రిల్ నాటికి లాంచ్ కానున్నట్లు సూచిస్తోంది. అలాగే, ఇది ఏప్రిల్ లేదా మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని గతంలో ప్రకటించిన లాంచ్ షెడ్యూల్‌లపై స్పష్టత ఇచ్చినట్లు అవుతోంది.
ఈ మోడల్ గురించిన సమాచారం పెద్దగా బయటకు రాలేదు. Galaxy అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లోని శామ్‌సంగ్ టీజర్ వీడియోలో ఫోన్ ఇంటర్నల్ భాగాలను డిస్‌ప్లే చేసింది. దీని ప్రకారం.. వెనుక భాగంలో నిలువుగా అమర్చిన లెన్స్‌లతో డ్యూయల్ కెమెరా యూనిట్‌ను అందించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. Galaxy S25 Edge మోడల్ Galaxy S25 సిరీస్‌లోని ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌తో పోల్చినప్పుడు వాటి కంటే సన్నగా ఉన్నట్లు తెలుస్తోంది.
Galaxy S25 Edgeకు సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్‌లు తెలియకపోయినప్పటికీ, ఐఫోన్ 17 ఎయిర్‌ను పోలి ఉండవచ్చని ప్రచారం జరిగింది. దీని ప్రకారం.. రాబోయే ఈ మోడల్ ఇదే ఏడాది ఐఫోన్ 17 లైనప్‌లో భాగంగా లాంచ్ కావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఫోన్ కంపెనీ లైనప్‌లోని Galaxy S25 ప్లస్, Galaxy S25 అల్ట్రా మోడళ్ల మధ్య ఉండే అవకాశం కూడా ఉంది.
గతంలో వచ్చిన నివేదికల ప్రకారం చూస్తే.. Samsung Galaxy S25 Edgeలో Galaxy S25+ మోడల్ మాదిరిగానే 6.66- అంగుళాల డిస్‌ప్లేను అందించే అవకాశం ఉన్నట్లు అంచనా. ఈ ఫోన్ కెమెరా యూనిట్ లేకుండా 6.4mm సన్నని ప్రొఫైల్‌ను కలిగి ఉంటుందని, కెమెరా మాడ్యూల్ చుట్టూ 8.3mm మందం ఉండవచ్చునని చెబుతున్నారు. దీని కెమెరా విషయమై ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. Galaxy S25 Edgeకు Galaxy S25 మోడల్‌లకు శక్తినిచ్చే అదే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ Galaxy ప్రాసెసర్ ద్వారా శక్తిని అందిస్తుందని ప్రచారంలో ఉంది. దీనిని స్టాండర్డ్‌గా 12GB RAMతో అటాచ్ చేయవచ్చు.
ప్రకటన
ప్రకటన