ప్రఖ్యాత స్మార్ట్‌ఫోన్ కంపెనీ iQoo కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు 21న మనదేశంలో iQoo Z9s 5G, iQoo Z9s Pro 5G మోడల్ ఫోన్‌లను ఆవిష్కరించనుంది.
అయితే, అధికారికంగా లాంచ్ చేయడానికి ముందే iQoo కొత్త iQoo Z9s సిరీస్ ఫోన్‌లకు సంబంధించిన ధరతోపాటు స్పెసిఫికేషన్‌లను ప్రకటించింది. ఈ iQoo Z9s 5G స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌పై పనిచేస్తున్నట్లు సంస్థ తెలిపింది. గ్రేటర్ నోయిడాలోని మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌తో తయారు చేసిన ఈ రెండు మోడళ్ల అమ్మకాలు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ద్వారా జరగనున్నాయి. అమెజాన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో లాంచ్‌ను టీజ్ చేయడానికి ప్రత్యేక వెబ్‌పేజీని రూపొందించింది. మరెందుకు ఆలస్యం.. iQoo నుంచి లాంచ్ కాబోతోన్న ఈ రెండు మోడల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందామా?!
ప్రాసెసర్ 820K కంటే ఎక్కువ పాయింట్ల..Vivo సబ్ బ్రాండ్ – iQoo తన iQoo Z9s 5G, iQoo Z9s Pro 5G ఫోన్‌ల ధర రూ.25 వేల లోపు ఉంచనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే iQoo భారతీయ మార్కెట్‌లో Z9 సిరీస్ ఫోన్‌లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. iQoo Z9 ధర రూ. 19,999గానూ, iQoo Z9x రూ. 11,999, అలాగే ఇటీవల విడుదలైన iQoo Z9 Lite ధర రూ. 10,499గానూ ఉంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ కొత్త iQoo ఫోన్‌లు Qualcomm ప్రాసెసర్‌లతో ప్యాక్ చేయబడ్డాయి. అలాగే, ఇవి కర్వ్డ్ డిస్‌ప్లేతో కూడిన AMOLED డిస్‌ప్లేలో రూపొందించడంతోపాటు శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. దీని బ్యాటరీ ఛార్జింగ్ వేగం కూడా బలంగా ఉంటుందని సంస్థ చెబుతోంది. కొన్ని నివేదికల ప్రకారం.. iQOO Z9s Pro 5G ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌ను కలిగి ఉండడంతోపాటు AnTuTu 10 బెంచ్‌మార్క్‌లో ఈ ప్రాసెసర్ 820K కంటే ఎక్కువ పాయింట్లను సాధించినట్లు సంస్థ వెల్లడించింది. అంతేకాదు, ఇదే సామర్థ్యం ఉన్న ఇతర ఫోన్‌ల స్కోర్‌ల కంటే ఈ మోడల్ స్కోరు ఎక్కువగా ఉన్నట్లు ప్రకటించింది.
AI ఎరేజ్, AI ఫోటో ఎన్‌హాన్స్ ఫీచర్లు..iQoo Z9s 5G, iQoo Z9s Pro 5G రెండు మోడల్స్‌లోనూ 50 మెగా పిక్సెల్ సోనీ IMX882 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), సూపర్ నైట్ మోడ్‌ను అందిస్తున్నారు. అలాగే, ఇది ఓఐఎస్ సాయంతో 4K వీడియోలను రికార్డ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. AI ఎరేజ్, AI ఫోటో ఎన్‌హాన్స్ ఫీచర్లను కూడా జోడించారు. అంతేకాదు iQoo Z9s Pro 5G ఫోన్ అదనంగా 8 మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉండబోతోంది. ఫ్లామ్ బయాంట్ ఆరెంజ్, లుక్స్ మార్బుల్ పినిషెస్ కలర్స్‌లలో అందుబాటులోకి రానున్నాయి. అలాగే, ఈ రెండు మోడల్స్ కూడా 7.49 mm బాడీ, 3D కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లేతో లాంచ్ కాబోతున్నాయి. iQoo Z9s 5G ఫోన్ 1800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌తోనూ iQoo Z9s Pro 5G ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 5500 పీక్ బ్రైట్ నెస్‌తో ఆకట్టుకోనున్నాయి. 5500 mAh బ్యాటరీ సామర్థ్యంతో ప్యాక్ చేయబడుతున్నప్పటికీ ఛార్జింగ్ వేగం ఎంత అనేది అధికారికంగా తెలియరాలేదు. ఎప్పటికప్పుడు రకరకాల మోడల్‌లో కొత్త వేరియంట్లను లాంచ్ చేస్తూ వస్తోన్న iQoo ఈ సరికొత్త మోడల్స్‌తో మార్కెట్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపబోతోందో తెలియాలంటే మాత్రం ఆగస్టు 21 వరకూ వేచి ఉండాల్సిందే.