కొత్త Bold N2, గత ఏడాది రూ. 5,999 ప్రారంభ ధరకు విడుదలైన Bold N1కు కంటిన్యూషన్గా రానుంది

అమెజాన్‌లో ప్రారంభమైన ఈ మైక్రోసైట్ ద్వారా Lava Bold N2 భారత్‌లో అదే ఈ-కామర్స్ వేదిక ద్వారా విక్రయానికి అందుబాటులోకి రానుందని స్పష్టమైంది. అయితే ఫోన్ స్పెసిఫికేషన్లు, ధర, ఖచ్చితమైన లాంచ్ తేదీ వంటి కీలక వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఇవి త్వరలో ప్రకటించే అవకాశముంది.

కొత్త Bold N2, గత ఏడాది రూ. 5,999 ప్రారంభ ధరకు విడుదలైన Bold N1కు కంటిన్యూషన్గా రానుంది

Photo Credit: Lava

లావా బోల్డ్ N2 వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.

ముఖ్యాంశాలు
  • బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో Lava Bold N2 అందుబాటులోకి రానుంది
  • 13MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, స్క్వేర్ కెమెరా డిజైన్
  • స్పెసిఫికేషన్లు, ధర, లాంచ్ తేదీ వివరాలు త్వరలో బయటకు రానున్నాయి
ప్రకటన

నోయిడాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా గత ఏడాది మే 2025లో Lava Bold N1 మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది. అదే సమయంలో Bold N1 Proను కూడా పరిచయం చేసింది. Bold N1లో 5,000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, Unisoc 9863A ప్రాసెసర్, 4GB RAM, 64GB స్టోరేజ్ వంటి ఫీచర్లు అందించారు. ఇప్పుడు ఈ మోడల్‌కు వారసుడిగా Lava Bold N2ను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సంస్థ అధికారికంగా ధృవీకరించింది. ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్ ఇప్పటికే అమెజాన్‌లో లైవ్ అయింది. అందులో డిజైన్, కలర్ ఆప్షన్లు, కెమెరా సెటప్ వంటి వివరాలు వెల్లడయ్యాయి. అమెజాన్‌లో ప్రారంభమైన ఈ మైక్రోసైట్ ద్వారా Lava Bold N2 భారత్‌లో అదే ఈ-కామర్స్ వేదిక ద్వారా విక్రయానికి అందుబాటులోకి రానుందని స్పష్టమైంది. అయితే ఫోన్ స్పెసిఫికేషన్లు, ధర, ఖచ్చితమైన లాంచ్ తేదీ వంటి కీలక వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఇవి త్వరలో ప్రకటించే అవకాశముంది.

డిజైన్ పరంగా Lava Bold N2 బ్లాక్, సిల్వర్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఫోన్ వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు LED ఫ్లాష్ ఉంటాయి. స్క్వేర్ ఆకారంలో ఉన్న కెమెరా ఐలాండ్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కనిపిస్తోంది. ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్ దిగువ ఎడమ వైపున కంపెనీ బ్రాండింగ్ ఉంటుంది. ఫోన్‌కు ఫ్లాట్ మెటల్ ఫ్రేమ్ ఉండే అవకాశముంది. పవర్ బటన్, వాల్యూమ్ కీలు కుడి వైపున ఉండగా, కింద భాగంలో USB Type-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్, స్పీకర్ గ్రిల్ ఉంటాయి.

ఈ కొత్త Bold N2, గత ఏడాది రూ. 5,999 ప్రారంభ ధరకు విడుదలైన Bold N1కు కంటిన్యూషన్ గా రానుంది. Bold N1 ప్రస్తుతం రేడియంట్ బ్లాక్, స్పార్క్లింగ్ ఐవరీ రంగుల్లో విక్రయానికి అందుబాటులో ఉంది.
గత మోడల్ వివరాలను గుర్తు చేసుకుంటే, Lava Bold N1లో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, Unisoc 9863A చిప్‌సెట్, 4GB RAM, 64GB స్టోరేజ్ ఉన్నాయి. 5,000mAh బ్యాటరీతో పాటు 10W వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ అందించారు. ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందుభాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కల్పించారు.

మొత్తానికి, Lava Bold N2 లాంచ్‌పై ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »