ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్థ Tecno కంపెనీ నుంచి Spark సిరీస్ ఫోన్ Tecno Spark Go 1ను పరిచయం చేస్తోంది. గత సంవత్సరం డిసెంబర్‌లో Tecno Spark Go పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను ఈ కంపెనీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా పరిచయం చేస్తోన్న ఈ Tecno Spark Go 1 మోడల్ దానికి అప్‌డేటింగ్ వెర్షన్‌గా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ రెండు రంగులతోపాటు నాలుగు ర్యామ్ మరియు స్టోరేజ్ ఆప్షన్‌లలో వస్తోంది. ఇది 8GB వరకు RAMతో పాటు Unisoc T615 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. అలాగే, ఈ Tecno Spark Go 1 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల డిస్‌ప్లేతో IP54-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంటుంది. 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో 15W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్‌లను వినియోగదారులకు అందిస్తోన్న మొబైల్ తయారీ సంస్థలు దేశీయ మార్కెట్‌లో కంపెనీల మధ్య పోటీని పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో Tecno నుంచి రాబోతోన్న ఈ సరికొత్త మోడల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం!
Tecno Spark Go 1 ధరతోపాటు ఎప్పటి నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుందన్న విషయాలను కంపెనీ అధికారికంగా ప్రకటించబడలేదు. ఇది ప్రస్తుతం Tecno యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో Glittery White, Startrail Black కలర్లతోపాటు 6GB + 64GB, 8GB + 64GB, 6GB + 128GB మరియు 8GB + 128GB నాలుగు RAM స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో కనిపిస్తోంది. అలాగే, Tecno Spark Go 1 Android 14 Go ఎడిషన్‌పై నడుస్తుంది. ఇది 6.67-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్‌లు) 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లేలో సెల్ఫీ షూటర్ కోసం హోల్ పంచ్ కటౌట్‌ను అందించారు.
డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్..
ఈ ఫోన్ ముందు కెమెరా కటౌట్ చుట్టూ నోటిఫికేషన్‌లను డిస్‌ప్లే చేసే డైనమిక్ పోర్ట్ ఫీచర్‌ను కూడా పొందుపరిచారు. ఇది Unisoc T615 ప్రాసెసర్‌తోపాటు 8GB వరకు RAMతో 128GB స్టోరేజ్ సామర్థ్యంతో పనిచేస్తుంది. మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా 8GB ఆన్‌బోర్డ్ మెమరీని 16GB వరకు పెంచుకునే అవకాశాన్ని కల్పించారు. ఇక ఆప్టిక్స్ విషయానికొస్తే.. Tecno Spark Go 1 డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయల్ ఫ్లాష్‌తో కూడిన 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను అందించారు. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం డ్యూయల్ ఫ్లాష్‌తో ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరా ఉంది.ఒక ఛార్జ్‌పై 31 గంటల వరకు..
Tecno Spark Go 1 DTS సౌండ్‌తో డ్యూయల్ స్పీకర్‌లతో దీనిని రూపొందించారు. అలాగే, ఇది IP54-రేటెడ్ బిల్డ్‌తో IR నియంత్రణను కలిగి ఉంటుంది. హ్యాండ్‌సెట్ భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ సెన్సర్‌ను అందించారు. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ యూనిట్ 60 రోజుల స్టాండ్‌బై టైమ్‌ను అందివ్వడంతోపాటు ఒక ఛార్జ్‌పై 31 గంటల వరకు కాలింగ్ సమయాన్ని అందిస్తుంది. ఇంకా, ఈ 4G ఫోన్ నాలుగు సంవత్సరాల పాటు సాంకేతిక సమస్యలు లేకుండా సమర్థవంతంగా పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ చెబుతోన్న ఫీచర్స్‌ను బట్టీ ఈ ఫోన్ ముమ్మాటికి ఫ్రెండ్లీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గానే వినియోగదారులకు చేరబోతోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సుమారుగా దీని ధర రూ. 8000 వరకూ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.