Photo Credit: Lava
భారత్ మొబైల్ మార్కెట్‌లోకి Unisoc T606 ప్రాసెసర్‌తో Lava Yuva 4 స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ఈ హ్యాండ్‌సెట్ 2,30,000 కంటే ఎక్కువ AnTuTu స్కోర్‌ను నమోదు చేసిట్లు తెలుస్తోంది. ఇది 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్, 5,000mAh బ్యాటరీతోపాటు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ఈ ఫోన్‌ను రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో ప్రస్తుతం ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కొనుగోలు చేసేందుకు అవకావం కల్పించింది. ఈ సరికొత్త Lava Yuva 4 స్మార్ట్ ఫోన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ అయిన Yuva 3కి కొనసాగింపుగా పరిచయం చేస్తోంది.
Lava Yuva 4 ప్రారంభ ధర మన దేశీయ మార్కెట్‌లో 4GB + 64GB వేరియంట్ రూ. 6999గాను, 4GB + 128GB వేరియంట్ ధరను రూ. 7,499గానూ నిర్ణయించినట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ Gadgets360కి వెల్లడించారు. ఇది గ్లోషీ బ్లాక్, గ్లోషీ పర్పుల్, గ్లోషీ వైట్ అనే మూడు రంగులలో కొనుగోలుకు అందాబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతానికి దేశంలోని ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కొనుగోలు చేసేందుకు కంపెనీ అవకాశం కల్పించింది.
రిటైల్-ఫస్ట్ స్ట్రాటజీలో భాగంగా వినియోగదారులకు ప్రత్యేకమైన రిటైల్ అనుభవాన్ని అందించడంతోపాటు అనుకూలమైన పోస్ట్-సేల్స్ జర్నీ అందించడంపై దృష్టి సారించినట్లు కంపెనీ తెలిపింది. Lava Yuva 4 హ్యాండ్‌సెట్‌పై ఒక ఏడాది వారంటీతోపాటు ఉచితంగా హోమ్ సర్వీసింగ్‌ను అందించనున్నట్లు ఒక పత్రికా ప్రకటన ద్వారా కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీ ఇస్తోన్న ఈ ఆఫర్ కొనుగోలుదారులను మరింతగా ఆకర్షించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Lava Yuva 4 స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల HD+ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ 4GB RAM, 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో అటాచ్ చేయబడిన Unisoc T606 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతోంది. ఇది ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతోంది. కంపెనీ నిర్ణయించిన ధరలో ఈ మోడల్‌కు అందించిన ఫీచర్స్ ఇతర కంపెనీల స్మార్ట్ ఫోన్‌లకు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనడంలో సందేహం లేదు.
ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్ కెమెరాతోపాటు సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను అందించారు. Lava Yuva 4 హ్యాండ్ సెట్ 10W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh సమార్థ్యం కలిగిన బ్యాటరీతో రూపొందించారు. అలాగే, భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను జత చేశారు. ఈ ఫోన్ గ్లోషీ బ్యాక్ డిజైన్‌తో వస్తుంది. మరి బడ్జెట్ ధరలో మార్కెట్‌లోకి విడుదలైన ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ అమ్మకాలలో ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో అని మార్కెట్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన