Infinix Zero 40 సిరీస్‌ను ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్‌లలో కంపెనీ లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో Infinix Zero 40 5G, Infinix Zero 40 4G హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి.
Photo Credit: Infinix
దిగ్గజ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ Infinix తన Infinix Zero 40 సిరీస్‌ను ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో Infinix Zero 40 5G, Infinix Zero 40 4G హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి. ఇవి 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అందిస్తున్నారు. అలాగే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో కూడిన 6.74-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లతో పాటు ఆండ్రాయిడ్ 16 వరకు - రెండు OS అప్‌గ్రేడ్‌లను ఈ హ్యాండ్‌సెట్‌లు అందుకోనున్నాయి.
మనదేశంలో Infinix Zero 40 సిరీస్‌ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకువచ్చేదీ కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, గ్లోబల్ మార్కెట్ ధరల ఆధారంగా దేశీయ మార్కెట్‌లో ఈ సిరీస్ ధరలను అంచనా వేయవచ్చు.Infinix Zero 40 5G ధర $399 (సుమారు రూ. 33,500), 4G వెర్షన్ అయితే $289 (దాదాపు రూ. 24,200) వద్ద ప్రారంభమవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ల ధరలు ప్రాంతాల వారీగా మారుతాయని కంపెనీ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. మలేషియాలో Infinix Zero 40 5G వేరియంట్ ధర MYR 1,699 (సుమారు రూ. 33,000) నుండి మొదలవుతుంది. 4G వేరియెంట్ అయితే MYR 1,200 (సుమారు రూ. 23,300) నుండి ప్రారంభమవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. Infinix Zero 40 5G వెర్షన్ మూవింగ్ టైటానియం, రాక్ బ్లాక్, వైలెట్ గార్డెన్ షేడ్స్‌లో, 4G వేరియంట్ అయితే.. బ్లోసమ్ గ్లో, మిస్టీ ఆక్వా, రాక్ బ్లాక్ కలర్‌వేస్‌లో లభిస్తుంది.
Infinix Zero 40 సిరీస్ హ్యాండ్‌సెట్‌లు 6.78-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేలు 144Hz వరకు రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 1,300nits వరకు బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, TÜV రైన్‌ల్యాండ్ ఐ-కేర్ మోడ్ సర్టిఫికేషన్‌తో అందుబాలోకి వస్తాయి. ఈ సిరీస్ 5G వెర్షన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ ద్వారా శక్తిని అందుకుంటాయి. అయితే 4G వేరియంట్ MediaTek Helio G100 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లు 24GB వరకు డైనమిక్ ర్యామ్‌కు మద్దతిస్తాయి. హ్యాండ్‌సెట్ యొక్క డిఫాల్ట్ మెమరీ స్పెసిఫికేషన్‌లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. 512GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. రెండు మోడల్స్ కూడా ఆండ్రాయిడ్ 14 ఆధారిత Infinix UIతో రన్ అవుతాయి.
Infinix Zero 40 సిరీస్‌లో కెమెరా విభాగం విషయానికి వస్తే.. ఇది 108-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లలో ప్రత్యేకమైన వ్లాగ్ మోడ్‌ను అందించారు. ఇది వ్లాగ్ క్రియేషన్‌లో వినియోగదారులకు సహాయ పడుతుంది. 5G, 4G వేరియంట్‌లు రెండూ కూడా GoPro మోడ్‌ను కలిగి ఉంటాయి. వినియోగదారులు ఏదైనా GoPro పరికరాన్ని హ్యాండ్‌సెట్‌లతో కనెక్ట్ చేసుకునే యాక్సస్ ఉంటుంది. వినియోగదారులు కనెక్ట్ చేసిన GoPro పరికరాన్ని Infinix Zero 40 స్మార్ట్‌ఫోన్ నుండి నేరుగా ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే, ఫుటేజీని స్క్రీన్ చేయడానికి ఫోన్ డిస్‌ప్లేను మానిటర్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు.
Infinix Zero 40 సిరీస్‌లో 5,000mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీని అందించారు. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు చేస్తుండగా, 5G వెర్షన్ 20W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ NFC కనెక్టివిటీతోపాటు Google యొక్క జెమిని AI అసిస్టెంట్‌కు కూడా మద్దతిస్తుంది.
ప్రకటన
ప్రకటన
Secret Rain Pattern May Have Driven Long Spells of Dry and Wetter Periods Across Horn of Africa: Study
JWST Detects Thick Atmosphere on Ultra-Hot Rocky Exoplanet TOI-561 b
Scientists Observe Solar Neutrinos Altering Matter for the First Time