Qualcomm న్యూ స్నాప్‌డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అండర్ ది హుడ్‌తో వచ్చే మొదటి హ్యాండ్‌సెట్‌లలో OnePlus 13 ఒకటిగా గుర్తింపు పొందింది
Photo Credit: OnePlus 13
OnePlus 13 హాసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది
చైనాలో ఈ సంవత్సరం అక్టోబర్ 31న OnePlus 13 స్మార్ట్ ఫోన్ లాంచయిన విషయం తెలిసిందే. త్వరలో దీనిని భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్‌లలోనూ అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఈ తాజా నాన్-ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్ లాంచ్ టైమ్‌లైన్‌ను ఇప్పటికే ధృవీకరించింది. ఈ ప్రకటనతో ఈ ఏడాది ఇది అందుబాటులో ఉండదని స్పష్టమైంది. Qualcomm న్యూ స్నాప్‌డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అండర్ ది హుడ్‌తో వచ్చే మొదటి హ్యాండ్‌సెట్‌లలో ఇదీ ఒకటి. OnePlus ఈ స్మార్ట్‌ఫోన్‌ను 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో హాసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ ఆప్టిక్స్‌తో రూపొందించింది.
భారతీయ మొబైల్ మార్కెట్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా OnePlus 13 జనవరి 2025లో విడుదల కానున్నట్లు ఓ పత్రికా ప్రకటనలో కంపెనీ వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్ ఆర్కిటిక్ డాన్, బ్లాక్ ఎక్లిప్స్, మిడ్‌నైట్ ఓషన్ మూడు రంగులలో కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. అలాగే, మెరుగైన హ్యాండ్ ఫీల్, స్కఫ్ రెసిస్టెన్స్ కోసం మైక్రో-ఫైబర్ వేగన్ లెదర్‌తో వస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. అలాగే, OnePlus 13 ఫోన్ ధూళి, నీటిని నియంత్రించేందుకు సరికొత్త IP68+69-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ గురించిన మరిన్ని వివరాలు రాబోయే కొద్ది రోజుల్లోనే బహిర్గతం కానున్నాయి.
ఈ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ ఒక ప్రత్యేకమైన మైక్రోసైట్‌ను కూడా సిద్ధం చేసింది. ప్రస్తుతం ఆ సైట్‌లో త్వరలోనే వస్తోంది అని కనిపిస్తోంది. అలాగే, OnePlus ఐదు మైల్‌స్టోన్స్, రివార్డ్‌లతో నోటిఫై మీ అనే ప్రచారాన్ని కూడా నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనేవారు ప్రచారం పూర్తయిన తర్వాత రూ.11 OnePlus బోనస్ డ్రాప్‌కు అర్హులు. ఇందులో గెలుపొందినవారు 500 రెడ్‌కాయిన్‌లకు అదనంగా రూ. 3,000 OnePlus ఉత్పత్తులను గెలుచుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు, రివార్డులలో భాగంగా OnePlus ట్రావెల్ కిట్‌ను కంపెనీ అందిస్తోంది.
OnePlus 13 చైనా వేరియంట్ 6.82-అంగుళాల క్వాడ్-HD+ (1440x3168 పిక్సెల్‌లు) LTPO AMOLED స్క్రీన్‌తో వచ్చింది. అలాగే, 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్ట బ్రైట్‌నెస్ స్థాయి 4,500 nits, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. Qualcomm న్యూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తోంది. అలాగే, గరిష్టంగా 24GB వరకు LPDDR5X RAM, 1TB వరకు UFS 4.0 స్టోరేజీతో అటాచ్ చేయబడి ఉంది. ఇది Adreno 830 GPUతో వస్తోంది.
దీనిలో హాసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్, 6x)లు అందించారు. అలాగే, సెల్ఫీల కోసం ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ షూటర్‌తో వస్తుంది. ఇది 100W ఫ్లాష్ ఛార్జ్ (వైర్డ్), 50W ఫ్లాష్ ఛార్జ్ (వైర్‌లెస్)కి సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతోపాటు రివర్స్ వైర్డ్ (5W), రివర్స్ వైర్‌లెస్ (10W) ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తోంది.
ప్రకటన
ప్రకటన
Samsung Could Reportedly Use BOE Displays for Its Galaxy Smartphones, Smart TVs
OpenAI, Anthropic Offer Double the Usage Limit to Select Users Till the New Year