Photo Credit: One Plus
ఇండియాలో OnePlus కమ్యూనిటీ సేల్‌ను OnePlus ప్రకటించేసింది. ఈ సేల్ డిసెంబర్ 6 నుంచి ప్రారంభమై డిసెంబర్ 17 వరకు కొనసానుంది. ఈ సేల్‌లో OnePlus స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్‌లు, ట్యాబ్‌లు ఇలా అనేక ప్రొడక్ట్‌లపై కొనుగోలుపై ఆసక్తికరమైన తగ్గింపు ధరల్లో లభించనున్నాయి. అలాగే, సాధారణ డిస్కౌంట్‌లతో పాటు కస్టమర్‌లు సేల్ సమయంలో ICICI బ్యాంక్, OneCard, RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై బ్యాంక్ ఆధారిత చెల్లింపు ఆఫర్‌లను కూడా సొంతం చేసుకోవచ్చు. కొన్ని ఎంపిక చేసిన ప్రొడక్ట్‌లపై 12 నెలల వరకు నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా ఉంది.
ఇండియా మార్కెట్‌లో OnePlus 12 ఫోన్ 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 64,999కాగా, రాబోయే సేల్‌లో రూ. 6,000 తగ్గింపు పొందొచ్చు. ICICI బ్యాంకు, OneCard, RBL క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 7,000 వరకూ డిస్కౌంట్. OnePlus 12R రూ. 6,000 తగ్గింపు, రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్ ఉంటుంది. దీంతోపాటు OnePlus Nord 4 ఎంపిక చేసిన వేరియంట్‌లు రూ. 3,000 ధర తగ్గింపు, బ్యాంక్ వినియోగదారులకు తక్షణ తగ్గింపు రూ. 2,000 ఉంది.
ఈ OnePlus కమ్యూనిటీ సేల్‌లో OnePlus Nord CE 4 కొనుగోలుపై రూ. 2,000 తగ్గింపుతోపాటు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 1000 తక్షణ తగ్గింపు ఉంటుంది. OnePlus ఓపెన్ ధర రూ. 1,49,999 బదులుగా రూ. 1,34,999లకు, OnePlus Pad Go ధర రూ. 37,999 బదులుగా రూ. 27,999గా సేల్ సమయంలో అందుబాటులో ఉంటుంది. వీటితోపాటు OnePlus Pad 2, OnePlus Nord CE 4 Lite ధరపై రూ. 2,000 తగ్గింపు లభిస్తుంది. OnePlus Nord CE 4 Lite కొనుగోలుదారులు రూ. 1,000 తక్షణ బ్యాంక్ తగ్గింపుతోపాటు OnePlus Bullets Wireless Z2ని సొంతం చేసుకోవచ్చు.
OnePlus వాచ్ 2, OnePlus వాచ్ 2R ధర రూ. 3,000 తగ్గింపు, తక్షణ బ్యాంక్ డిస్కౌంట్‌గా OnePlus వాచ్ 2పై రూ. 3,000, OnePlus వాచ్ 2R కొనుగోలుపై రూ.2,000 తగ్గింపు పొందవచ్చు. OnePlus Buds Pro 3కి రూ. 1,000 ధర తగ్గింపుతో పాటు తక్షణ బ్యాంక్ డిస్కౌంట్‌గా రూ. 1,000 తగ్గింపుతో రూ. 11,999లకే లభించనున్నాయి. OnePlus బడ్స్ ప్రో 2 రిటైల్ ధర రూ. 7,999, దీని అసలు ధర రూ. 11,999ల నుంచి తగ్గింపు ఉంటుంది.
పైన తెలిపిన తగ్గింపు ఆఫర్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్, OnePlus ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, Amazon, Flipkart, Myntra వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేసిన OnePlus ప్రొడక్ట్‌లపై అందుబాటులో ఉన్నాయి. ఇది రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్‌తో సహా ఆఫ్‌లైన్ రిటైలర్‌లలో అందుబాటులో ఉంటుంది.
ప్రకటన
ప్రకటన