Photo Credit: Realme
Realme GT 7 ఇండియా లాంచ్ టీజ్ చేయబడింది: 6-గంటల స్టేబుల్ 120FPS గేమింగ్‌ను కంపెనీ అధికారికంగా ధృవీకరించింది
చైనాలో Realme GT 7 ఇటీవల పరిచయం అయిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ మోడల్‌ను మన దేశంలోనూ విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. మొబైల్ ఇండస్ట్రీలో మొదటిసారి నిరంతరాయంగా ఆరు గంటలపాటు 120 ఎఫ్‌పీఎస్ గేమింగ్ అనుభవాన్ని అందించడంతోపాటు పరీక్షించేందుకు క్రాఫ్టన్‌తో కంపెనీ పార్ట్నర్‌షిప్‌ను ప్రకటించింది. గేమింగ్‌పై అమితాసక్తి కలిగిన వారి కోసం రాబోయే Realme GT 7 ను రూపొందించారు. ఈ మోడల్ BATTLEGROUNDS మొబైల్ ఇండియా ప్రో సిరీస్ 2025కు అధికారిక హ్యాండ్‌సెట్‌గా నిలుస్తోంది. ఈ వీకెండ్‌లో బీజీఐఎస్ 2025 చివరి ఈవెంట్ కోల్‌కతాలోని ప్రంగాలో బిస్వా బంగ్లా మేలా నిర్వహించబోతున్నారు. ఈ పోటీలో మన దేశంలోని టాప్ 16 బీజీఎం టీమ్‌లు పాల్గొనబోతున్నాయి.చైనాలో వెర్షన్ మాదిరిగానే,మన దేశంలో అడుగుపెట్టబోయే ఈ Realme GT 7 ఇటీవల చైనాలో విడుదలైన వెర్షన్ మాదిరిగానే స్పెసిఫికేషన్స్ కలిగి ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతే కాదు, ఈ అంచనా ప్రకారం 6.78 అంగుళాల(2800×1280 రిజల్యూషన్ కలిగిన) డిస్‌ప్లేతో 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 6500నిట్స్ వరకూ పీక్ బ్రైట్ నెస్, టచ్ శాంప్లింగ్ రేట్ 2600 హెచ్‌జెడ్‌తో ఫుల్ డీసీఐ పీ3 కలర్ గమట్‌తో వస్తోంది. ఇది 460 హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, ఫుల్ బ్రైట్ నెస్ డీసీ డమ్మింగ్‌ను కలగి ఉంటుంది.
ఈ Realme GT 7 స్మార్ట్ ఫోన్‌కు 3 ఎన్ఎం డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్‌ను కంపెనీ అందించింది. ఇది Immortalis- జీ925 జీపీయూతో రన్ అవుతోంది. అలాగే, 12జీబీ, 16 జీబీ LPDDR5X ర్యామ్‌తో 256 జీబీ, 512 జీబీ లేదా ఒక టీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో దీనిని రూపొందించారు. అంతే కాదు, ఈ హ్యాండ్‌సెట్ కంపెనీ యూఐ 6.0 తో ఆండ్రాయిడ్ 15 పై పని చేస్తుంది.
రాబోయే కొత్త మొబైల్ 100 W ఫాస్ట్ చార్జింగ్‌తో 7200 mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. అలాగే, ఇండియాలో అమెజాన్‌తోపాటు కంపెనీ అధికారికి వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో లభించనుంది. కెమెరా విషయంలో ఈ ఫోన్ ముందుందనే చెప్పాలి. అంతే కాదు, ఒఐఎస్‌తో కూడిన 50- మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్896 మెయిన్ సెన్సార్, 8- మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్‌తోపాటు ముందు భాగంలో 16- మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్480 సెల్ఫీ కెమెరాను దీనికి అందించారు.
ఇన్ డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను Realme GT 7 స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన కీలక ఫీచర్స్‌లో ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. అంతే కాదు, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌తోపాటు దుమ్ము- నీటి నియంత్రణకు ఐపీ68- ఐపీ69 రేటింగ్‌ను కలిగి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతోపాటు కనెక్టవిటీ ఆప్షన్‌లలో Wi-Fi 7, బ్లూటూత్ 5.4, స్టీరియో స్పీకర్స్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సీ వంటివి ఇందులో ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన