Photo Credit: Tecno
త్వరలోనే Tecno Camon 40 సిరీస్ స్మార్ట్ ఫోన్‌లను కంపెనీ పరిచయం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి ప్రారంభంలో MWC 2024లో ప్రాంరభమైన Camon 30 సిరీస్‌కు కొనసాగింపుగా ఈ కొత్త సిరీస్ వచ్చే అవకాశం ఉంది. Tecno Camon 30 సిరీస్‌లో బేస్, ప్రో మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. అలాగే, వీటిని 4G, 5G వేరియంట్‌లలో తీసుకువచ్చారు. అయితే, తాజా Tecno Camon 40 లైనప్‌కు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. Camon 40 Pro 5Gగా చెప్పబడుతోన్న కొత్త Tecno హ్యాండ్‌సెట్ ప్రముఖ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్‌లో బహిర్గతమైంది. ఇందులో ప్రాసెసర్, RAMతోపాటు ఆపరేటింగ్ సిస్టమ్ వివరాలను గమనించవచ్చు.
తాజాగా Geekbenchలో మోడల్ నంబర్ Tecno Tecno CM7తో హ్యాండ్‌సెట్ లిస్టవుట్ చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ Camon 40 Pro 5G పేరుతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఫోన్ సింగిల్-కోర్, మల్టీ-కోర్ స్కోర్‌లను వరుసగా 1,034, 3,257 కలిగి ఉన్నట్లు లిస్టింగ్‌లో స్పష్టమైంది. గతంలో వెలువడించిన EEC లిస్టింగ్‌లో Tecno Camon 40 Pro 5G, Camon 40 ప్రీమియర్ 5G వేరియంట్‌లు వరుసగా CM7, CM8 మోడల్ నంబర్‌లను కలిగి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది.
2GHz వేగంతో నాలుగు కోర్లను కలిగి ఉన్నటువంటి ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో Geekbench లిస్ట్ Tecno Camon 40 Pro 5Gని చూపిస్తోంది. అలాగే, మరో నాలుగు కోర్లను 2.50GHz వద్ద క్లాక్ చేస్తూ కనిపిస్తోంది. ఇదే సమయంలో Tecno Camon 30 Pro 5G సక్సెసర్ MediaTek Dimensity 7300 ప్రాసెసర్‌తో పవర్‌ను గ్రహిస్తున్నట్లు గ్రహించాలి. 8GB RAMతో ఈ Tecno Camon 40 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు స్పష్టమైంది.
Geekbench లిస్టింగ్ ఆధారంగా.. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత HiOS 15తో రన్ చేయబడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ Tecno Camon 40 Pro 5G మోడల్ నంబర్ CM8తో IMEI డేటాబేస్‌లో లిస్టింగ్ చేసినట్లు గత నివేదిక ఆధారంగా వెల్లడైంది. ఇది రూమర్డ్ హ్యాండ్‌సెట్‌కి కొత్త వేరియంట్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై కూడా ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టతా లేకపోవడంతో కంపెనీ అధికారిక ప్రకటన కోసం మార్కెట్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.
అయితే, గతంలో వెల్లడైన EEC లిస్టింగ్‌ను పరిశీలిస్తే, అది Tecno Camon 40 ప్రీమియర్ 5G వెర్షన్ కావచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఈ నివేదికల బట్టీ చూస్తే మాత్రం.. Tecno Camon 40 Pro, బేస్ Camon 40 4G వేరియంట్‌లు వరుసగా CM6, CM5 మోడల్ నంబర్‌లతో వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మరికొన్ని వారాల్లోనే బహిర్గతం అయ్యే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన