Photo Credit: Samsung
Samsung Galaxy S25 Ultra 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది
భారత్‌లో Samsung Galaxy S25 అల్ట్రా ఈ ఏడాది మొదట్లో మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 1,29,999 గా ఉంది. తాజాగా Samsung ఫ్లాగ్‌షిప్ భారత్‌లో తగ్గింపు ధరకు కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌పై తక్షణ క్యాష్‌బ్యాక్‌గా రూ. 12,000 వరకు ఈ దక్షిణ కొరియా బ్రాండ్ ప్రకటించింది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI ఆప్షన్‌లు కూడా ఉన్నాయి. ఈ Galaxy S25 Ultra హ్యాండ్‌సెట్ 12GB RAM, 1TB వరకు స్టోరేజీతో జత చేసిన Galaxy ప్రాసెసర్ కస్టమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌లో అందుబాటలోకి రానుంది.రూ. 12,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్,ఈ కొత్త ఆఫర్‌ను పరిమితి కాల ఆఫర్‌గా కంపెనీ ఆన్ లైన్ స్టోర్ కొనుగోలుపై మాత్రమే ప్రకటించింది. ఈ ఫోన్ టైటానియం సిల్వర్ బ్లూ కలర్ వేరియంట్ కొనుగోలు చేయాలనుకునే వారు రూ. 11,000 విలువైన స్పాట్ బ్యాంక్ డిస్కౌంట్ లేదా రూ. 12,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను సొంతం చేసుకోవచ్చు. అంతే కాదు, Galaxy S25 Ultra స్మార్ట్ ఫోన్ ధర ఈ తాజా ఆఫర్‌తో రూ. 1,17,999 కు తగ్గింది. అయితే, దీని అసలు లాంఛ్ ధర రూ. 1,29,999 గా ఉంది.
కంపెనీ అందిస్తోన్న ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులు షాప్ యాప్ కొనుగోలుపై రూ. 4000 వరకూ అదనంగా ప్రయోజనాలను కూడా పొందొచ్చు. ఈ ఫోన్‌పై no-కాస్ట్ EMI ఆప్షన్‌లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కేవలం రూ. 3,278 నుంచి కూడా అందించారు. విక్రేతల వద్ద తమ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నప్పుడు సుమారు రూ. 75,000 వరకు డిస్కౌంట్‌ను పొందే అవకాశం ఉంది.
Galaxy S25 Ultra ఆండ్రాయిడ్ 15 పై రన్ అవుతోంది. టాప్‌లో Samsung వన్ UI 7 ఇంటర్‌ఫేస్ ఉంటుంది. ఈ మోడల్ 6.9-అంగుళాల (1,400x3,120 పిక్సెల్స్) డైనమిక్ AMOLED 2X స్క్రీన్‌ను కలిగి ఉంది. 120Hz వరకూ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 ప్రొటక్షన్‌తో వస్తోంది. దీనికి కస్టమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను అందించారు. అలాగే, 12GB RAM, 1TB వరకు ఇన్ బిల్ట్ స్టోరేజీతో దీనిని రూపొందించారు.
దీని కెమెరా విషయానికి వస్తే.. S25 Ultra హ్యాండ్‌సెట్‌లో క్వాడ్ రియల్ కెమెరా యూనిట్‌ను అమర్చారు. అలాగే, ఇందులో 200-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతోపాటు 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, మరో 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాలు ఉంటాయి. వీటితోపాటు ముందు భాగంలో 12-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. అంతే కాదు, ఇది 45W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీతో వస్తోంది.
ప్రకటన
ప్రకటన