Photo Credit: HMD
Finnish కంపెనీ నుంచి HMD Arc పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ థాయ్‌లాండ్‌లో విడుదలైంది. HMD Arc ప్రత్యేకమైన ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఇది సెల్ఫ్-రిపేర్ సపోర్ట్‌తో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అంటే, డిస్ ప్లే, బ్యాటరీ వంటి స్పేర్‌పార్ట్స్‌ను సర్వీస్ చేసేందుకు సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, వినియోగదారులే మార్చుకునేలా అనుమతిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 60Hz HD+ డిస్‌ప్లే, 13-మెగాపిక్సెల్ వెనుక కెమెరాతో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 (గో ఎడిషన్)పై రన్ అవుతోంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ లభ్యత, ధరకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. ఈ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను చూద్దాం!
HMD Arc హ్యాండ్‌సెట్ 6.52-అంగుళాల HD+ (576 x 1,280 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌తో థాయ్‌లాండ్‌లో లాంచ్ అయింది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియోతోపాటు 460 nits పీక్ బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంటుంది. అలాగే, 166.4 x 76.9 x 8.95mm పరిమాణంతో 185.4 గ్రాముల బరువును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్‌కు అనుగుణంగా IP52 (యూరోప్), IP54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో ఉంటుంది.
HMD Arc ఫోన్ 4GB RAM, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అటాచ్ చేసిన Unisoc 9863A ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుంది. అలాగే, ఇది ఆండ్రాయిడ్ 14 (గో ఎడిషన్)పై రన్ అవుతోంది. ఈ హ్యాండ్‌సెట్‌కు మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 128GB వరకు పెంచుకునే అవకాశం ఉంది. అంతేకాదు, తమ తాజా స్మార్ట్ ఫోన్‌కు రెండు సంవత్సరాల త్రైమాసిక సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇది తప్పనిసరిగా కొనుగోలుదారులను ఆకట్టకుంటుందని కంపెనీ భావిస్తోంది.
కెమెరా విషయానికి వస్తే.. HMD Arc ఫోన్ ఆటోఫోకస్‌తో కూడిన 13-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను, ముందు భాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌లో అమర్చిన 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వస్తోంది. ఈ కెమెరా బోకె, నైట్ మోడ్, ప్రొఫెషనల్ మోడ్, స్లో మోషన్, క్విక్ స్నాప్‌షాట్, ఫిల్టర్‌లు, టైమ్-లాప్స్, పనోరమా వంటి సరికొత్త ఫీచర్‌లకు సపోర్ట్ చేస్తుంది. HMD మాడ్యూల్‌లో LED ఫ్లాష్‌ను సైతం అందించింది. ఇది సింగిల్ స్పీకర్, మైక్రోఫోన్ యూనిట్‌ను కలిగి ఉంటుంది.
10W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని HMD Arc స్మార్ట్ ఫోన్‌కు అందించారు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్ వంటివి ఉన్నాయి. ఈ సరికొత్త హ్యాండ్‌సెట్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, వర్చువల్ RAM సపోర్ట్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. దీని ధర మాత్రం అధికారికంగా వెలువడ లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రకటన
ప్రకటన