Photo Credit: Samsung
Samsung Galaxy A56 మరియు Galaxy A36 Android 15 ఆధారంగా One UI 7తో రవాణా చేయబడతాయి
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2025) కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా Samsung Galaxy A26 5Gతో పాటు Galaxy A56 5G, Galaxy A36 5G స్మార్ట్ ఫోన్‌లను ఆవిష్కరించింది. Samsung Galaxy A56 5G, Galaxy A36 5G హ్యాండ్‌సెట్‌లు తాజాగా భారతీయ అధికారిక వెబ్‌సైట్‌లో వాటి ధరలతో లిస్ట్ అవుట్ చేయబడ్డాయి. Galaxy A26 5G ధర మన దేశంలో ఇంకా వెల్లడికాలేదు. ఈ Galaxy A సిరీస్ ఫోన్‌లు 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్లతో రూపొందించబడ్డాయి. అలాగే, ఇవి Android 15-ఆధారిత One UI 7పై రన్ అవుతాయి.
మన దేశంలో Galaxy A56 5G హ్యాండ్‌సెట్ 8GB + 128GB ధర రూ. 41,999 నుండి ప్రారంభమవుతుంది. 8GB + 256GB, 12GB + 256GB వేరియంట్‌లు ధరలు వరుసగా రూ. 44,999, రూ. 47,999గా ఉన్నాయి. అలాగే, Galaxy A36 5G ఫోన్ 8GB + 128GB వెర్షన్ భారత్‌లో రూ. 32,999 నుండి ప్రారంభమవుతుంది. 8GB + 256GB, 12GB + 256GB కాన్ఫిగరేషన్‌ల ధరలు వరుసగా రూ. 35,999,రూ. 38,999గా ఉన్నాయి.
Galaxy A56 5G, Galaxy A36 5G హ్యాండ్‌సెట్‌ల 8GB + 256GB వేరియంట్‌లను పరిమిత సమయం వరకు 8GB + 128GB ఆప్షన్ ధరకు కొనుగోలు చేయవచ్చు. Samsung Galaxy A56 5G ఫోన్ ఆకర్షణీయమైన గ్రాఫైట్, లేత బూడిద రంగు, ఆలివ్ కలర్ ఆప్షన్‌లలో లభించనుంది. Galaxy A36 5G నలుపు, లావెండర్, వైట్ షేడ్స్‌లో వస్తుంది.
Galaxy A56 5G, Galaxy A36 5G లు 6.7-అంగుళాల ఫుల్-HD+ (1,080 x 2,340 పిక్సెల్స్) సూపర్ AMOLED స్క్రీన్‌లతో 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా విక్టస్+ గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తున్నాయి. ఈ ఫోన్‌లు ఆటో ట్రిమ్, బెస్ట్ ఫేస్, AI సెలెక్ట్, రీడ్ అలౌడ్ వంటి AI ఫీచర్లకు సపోర్ట్ చేస్తాయి. Galaxy A56 5G ఫోన్ Exynos 1580 ప్రాసెసర్‌తో, Galaxy A36 5G Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లు 6 జనరేషన్స్ OS అప్‌గ్రేడ్‌లను, ఆరేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందునున్నాయి.
Galaxy A56 5G ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్, 5-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. అలాగే, Galaxy A36 5G దాదాపు ఒకేలాంటి కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అయితే, ఇందులో 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉంటుంది. రెండు హ్యాండ్‌సెట్‌లు 12-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటాయి. Galaxy A56 5G, Galaxy A36 5G రెండూ 5,000mAh బ్యాటరీతో వస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన