Photo Credit: Honor
Honor 300 సిరీస్‌ను త్వరలోనే చైనాలో పరిచయం చేసే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ లైనప్‌లో రాబోయే హ్యాండ్‌సెట్‌లకు సంబంధించిన పలు వివరాలు గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు, Honor 300, Honor 300 Pro మోడల్స్ కీలక స్పెసిఫికేషన్‌లు గతంలోనే బహిర్గతమయ్యాయి. బేస్ వేరియంట్‌కు చెందిన లీకైన లైవ్ ఫొటోలు దాని డిజైన్‌ను పరిచయం చేశాయి. కంపెనీ Honor 300 రంగుల ఎంపికతోపాటు పూర్తి డిజైన్‌ను సిరీస్ విడుదలకు ముందే వెల్లడించింది. అయితే, తాజాగా ఓ టిప్‌స్టర్ రాబోయే హ్యాండ్‌సెట్‌కు చెందిన RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతోపాటు కొన్ని కీలక స్పెసిఫికేషన్స్‌ను వెల్లడించారు.
త్వరలో రాబోయే Honor 300 స్మార్ట్ ఫోన్ డిజైన్‌ను కంపెనీ Weibo పోస్ట్‌లో పరిచయం చేసింది. అలాగే, కంపెనీ చేసిన మరో పోస్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ లు యాంజి, యులాంగ్‌క్స్, టీ కార్డ్ గ్రీన్, కాంగ్‌షాన్ యాష్ (చైనీస్ బాష నుండి అనువదించింది) రంగులలో అందుబాటులోకి రానున్నట్లు స్పష్టం చేసింది. పర్పుల్, బ్లూ, వైట్ వేరియంట్‌లు వెనుక పాలరాయి లాంటి ఆకర్షణీయమైన ప్యానల్‌తో కనిపిస్తాయి.
ఈ Honor 300 స్మార్ట్ ఫోన్‌కు వెనుక ప్యానెల్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో షట్కోణ మాడ్యూల్ పిల్-ఆకారపు LED ప్యానెల్‌తో వస్తుంది. అలాగే, దీనికి డ్యూయల్ కెమెరా యూనిట్‌ను అందించారు. కెమెరా మాడ్యూల్‌కి ఓ వైపున పోర్ట్రెయిట్ మాస్టర్ అనే పదాలను ఆకర్షణీయంగా రూపొందించారు. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ హ్యాండ్‌సెట్ కుడివైపున అంచున కనిపిస్తాయి. అలాగే, ఫోన్‌కు సంబంధించిన మరో పోస్ట్‌లో ఈ మోడల్ 6.97 మిమీ మందంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Weibo పోస్ట్ ప్రకారం Honor 300 స్మార్ట్ ఫోన్ 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది ప్లాస్టిక్ మిడిల్ ఫ్రేమ్, ఫ్లాట్ డిస్‌ప్లే, ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కలిగి ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే ఈ హ్యాండ్‌సెట్ 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ను చేస్తుందని అంచనాలు ఉన్నాయి. గత మోడల్స్‌తో పోల్చితే ఇది మెరుగైన ఫీచర్‌గా చెప్పొచ్చు.
ఈ బేస్ Honor 300 మోడల్ 8GB+256GB, 12GB+256GB, 12+512GB, 16+512GB RAM స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులోకి వస్తుందని టిప్‌స్టర్ వెల్లడించారు. Honor 300 స్మార్ట్ ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌లు, 1.5K OLED స్క్రీన్‌లు, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తాయని గతంలో వచ్చిన లీక్‌ల ఆధారంగా అంచనా వేస్తున్నారు. అలాగే, ప్రో వేరియంట్ మాత్రం 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ షూటర్‌తో వస్తుందని భావిస్తున్నారు. అయితే, ఈ సిరీస్ విడుదలకు సంబంధించిన అధికారిక తేదీని మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
ప్రకటన
ప్రకటన