Photo Credit: Honor
ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Honor తన సరికొత్త మోడల్ Honor 300 Ultra విడుదలకు సిద్ధం చేస్తోంది. టిప్‌స్టర్ షేర్ చేసిన వివరాలను చూస్తే దీనిని ధృవీకరించవచ్చు. ఇప్పటికే Honor 300, 300 ప్రోలను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండు హ్యాండ్‌సెట్‌ల ప్రీఆర్డర్‌లు ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉన్నాయి. అయితే, అల్ట్రా మోడల్‌కు సంబంధించిన ఎలాంటి ప్రకటనా వెలువడించలేదు. తాజాగా Honor 300 Ultra మోడల్‌కు చెందిన రెండు ఫొటోలు చైనీస్ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ Weiboలో ప్రత్యక్షమయ్యాయి. దీని డిజైన్‌తోపాటు కలర్ ఆప్షన్స్ కూడా బహిర్గతమయ్యాయి.
చైసీస్ Weiboలోని ఒక పోస్ట్‌లో టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Honor 300 Ultra డిజైన్‌ను లీక్ చేసింది. చైనాలో కంపెనీ Honor 300, Honor 300 ప్రో విడుదలను ఇప్పటికే ప్రకటించగా, 300 Ultra స్మార్ట్ ఫోన్ గురించి మాత్రం వెల్లడించలేదు. కంపెనీ ద్వారా ఈ మోడల్ సిరీస్‌లో భాగంగా, లేదా తర్వాతి రోజులలో లాంచ్ కావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. చైనాలో ఇప్పటికే Honor 300, 300 ప్రో మోడల్స్ ప్రీఆర్డర్‌లకు అందుబాటులోకి వచ్చాయి.
వెబ్‌సైట్‌లో లీక్ అయిన ఫొటోల ప్రకారం చూస్తే.. Honor 300 Ultra మోడల్ Honor 300 Pro పోలికతో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. అలాగే, ఇందులో ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌ను అందించడంతోపాటు షట్కోణ కెమెరా ఐస్‌లాండ్‌లో రూపొందించారు. ఈ స్మార్ట్ ఫోన్ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. దాని వెనుక ప్యానెల్ నలుపు, తెలుపు రంగు ఆప్షన్స్‌లో ఉండి, రెండోది సరికొత్త పెయింట్ ఆకృతితో కనిపిస్తుంది.
Honor 300 Ultra స్పెసిఫికేషన్స్ గురించిన సమాచారం అధికారికంగా వెల్లడికానప్పటికీ, Honor 300, Honor 300 ప్రో స్మార్ట్ ఫోన్‌ల వివరాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో బహిర్గతమయ్యాయి. ఇటీవలే డిజిటల్ చాట్ స్టేషన్ Honor 300 సిరీస్ 1.5K OLED స్క్రీన్‌లతో రావడంతోపాటు ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో వస్తుందని భావిస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయాలు అధికారికంగా నిర్థారణ కవాల్సి ఉంది. కంపెనీ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
టిప్‌స్టర్ వివరాల ప్రకారం.. 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరాతో Honor 300 ప్రో అందుబాటులోకి రానుంది. అలాగే, Honor 300 సిరీస్ 100W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయడంతోపాటు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడా రావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. టిప్‌స్టర్ ఉద్దేశంబట్టీ మాట్లాడుతూ, Honor 300 లైనప్‌లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అమర్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేయవచ్చు. ఏది ఏమైనప్పటికీ, Honor 300, Honor 300 ప్రో గురించి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన