ఈ కామర్స్‌లో ప్రకటించే బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో కొన్ని లక్షల మంది వినియోగదారులు కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువ మందిని ఆకర్షించేందుకు ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్స్ ఇస్తుంటారు. ఈ క్రమంలో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించారు.
Photo Credit: Apple
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 ఐఫోన్ 14 (చిత్రంలో) డిస్కౌంట్‌తో అందిస్తుంది
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025లో ఐఫోన్ లవర్స్‌కి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్టుగానే కనిపిస్తోంది. ఐఫోన్ 14ను డిస్కౌంట్ ధరకు అందిస్తుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ సేల్ ఈవెంట్ సందర్భంగా ఈ-కామర్స్ సెప్టెంబర్ 2022లో ప్రారంభించిన ఐఫోన్ 14ను భారతదేశంలో రూ. 40,000 లోపు అందిస్తుంది. ఈ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సేల్‌లో అనేక ఎలక్ట్రానిక్‌లను అత్యంత తక్కువ ధరకు లభించబోతోన్నాయి. ఐఫోన్ 14తో పాటు, ఆపిల్ గత సంవత్సరం ఐఫోన్ మోడల్‌లు కూడా డిస్కౌంట్‌తో లభిస్తాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్లు 10 శాతం తక్షణ తగ్గింపునకు కూడా అర్హులు అని తెలిపింది.
రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025లో ఐఫోన్ 14పై ఇండియాలో భారీ డిస్కౌంట్ లభించబోతోంది. ఈ డిస్కౌంట్ ధరను వెల్లడించడానికి ఫ్లిప్‌కార్ట్ తన మొబైల్ యాప్‌ను అప్‌డేట్ చేసింది. ఆసక్తిగల కొనుగోలుదారులు బ్యాంక్ డిస్కౌంట్‌లతో రూ. 39,999 ధరకు ఐఫోన్ 14ను పొందగలరు.
ప్రస్తుతం 128GB స్టోరేజ్‌తో ఐఫోన్ 14 బేస్ వేరియంట్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో రూ. 52,990 కు అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 2022లో ప్రారంభించబడిన ఈ హ్యాండ్‌సెట్ బేస్ ఆప్షన్ ధర భారతదేశంలో రూ.79,900గా ఉంది. ఇది బ్లూ, మిడ్‌నైట్, పర్పుల్, స్టార్‌లైట్, రెడ్ రంగులలో అందిస్తున్నారు.
బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌పై ఆఫర్‌లను ప్రకటించింది. రెండు ఫోన్‌లు భారీ డిస్కౌంట్‌లతో లభిస్తాయి. ఐఫోన్ 16 ప్రో రూ. 70,000 లోపు ధరకు లభిస్తుందని, ఐఫోన్ 16 ప్రో మాక్స్ రూ. 90,000 లోపు ధరకు లభిస్తుందని చెబుతున్నారు. అయితే, ఈ డిస్కౌంట్లలో బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయని ఈ-కామర్స్ దిగ్గజం చెబుతోంది. ఐఫోన్ 16 ప్రో గత సంవత్సరం రూ. 1,19,900 ప్రారంభ ధరతో ప్రారంభించగా, 16 ప్రో మాక్స్ రూ. 1,44,900 వద్ద ప్రారంభించబడింది.
ఈ-కామర్స్ దిగ్గజం రాబోయే రోజుల్లో తన అతిపెద్ద సేల్ - బిగ్ బిలియన్ డేస్ సేల్ చుట్టూ హైప్ సృష్టించడానికి మరిన్ని డీల్‌లను త్వరలోనే వెల్లడిస్తుందని భావిస్తున్నారు.
ప్రకటన
ప్రకటన