GPU వైపు చూస్తే, OnePlus కొత్తగా Next-Gen HyperRendering అనే సొల్యూషన్‌ను కూడా పరిచయం చేసింది.
                Photo Credit: OnePlus
బ్రాండ్ ప్రకారం, OP గేమింగ్ కోర్ ప్రసిద్ధ ఆటలలో 165fps గేమ్‌ప్లేను అందిస్తోంది.
మొబైల్ గేమింగ్‌లో ఎదురయ్యే ల్యాగ్, ఫ్రేమ్ డ్రాప్, హీట్ మేనేజ్‌మెంట్ వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని OnePlus కొత్తగా ‘OP Gaming Core' అనే ప్రత్యేక గేమింగ్ టెక్నాలజీని ప్రకటించింది. కంపెనీ ప్రకారం, ఇది చిప్ లెవల్‌లో జరిగే ఆప్టిమైజేషన్ నుంచి సాఫ్ట్‌వేర్ ట్యూనింగ్ వరకు మొత్తం గేమింగ్ పనితీరును తిరిగి నిర్మించే విధంగా రూపొదించబడింది. గేమింగ్ సమయంలో కంట్రోల్, టచ్ రెస్పాన్స్, ఫ్రేమ్ స్టెబిలిటీ మెరుగయ్యేలా ఈ సిస్టమ్ పనిచేస్తుందని OnePlus చెబుతోంది. ఈ టెక్నాలజీతో గేమింగ్ ఫోన్లు అత్యంత ప్రాచుర్యం పొందిన గేమ్‌లలో కూడా 120fps ఫ్రేమ్‌రేట్‌ని స్థిరంగా కొనసాగించగలవని కంపెనీ ధృవీకరిస్తోంది. ఈ సిస్టమ్‌కు తోడుగా రూపొందించిన Performance Tri-Chip హార్డ్‌వేర్ మరియు OP FPS Max అనే హై ఫ్రేమ్‌రేట్ సొల్యూషన్ కూడా ఇందులో భాగమే.
OnePlus వివరాల ప్రకారం, OP Gaming Core అనే ఈ టెక్నాలజీ 20,000 కంటే ఎక్కువ కోడ్ లైన్లతో నిర్మించబడింది. ఇది Android యొక్క ఫౌండేషన్ లెవల్‌లో పనిచేస్తూ, గేమింగ్ పనితీరును చిప్ స్థాయి నుంచి పునర్నిర్వచిస్తుంది. దీనికి సంబంధించిన 254 గేమింగ్ ఆప్టిమైజేషన్ పేటెంట్లు కూడా OnePlus సొంతం అయినట్లు కంపెనీ పేర్కొంది. ఈ సిస్టమ్‌ను మొదటగా రాబోయే OnePlus 15 సిరీస్‌లో ప్రవేశపెట్టబోతున్నట్లు బ్రాండ్ ప్రకటించింది.
ఈ గేమింగ్ ఆర్కిటెక్చర్‌లో ముఖ్యమైన భాగం OnePlus CPU Scheduler. సాధారణంగా Androidలో ఉపయోగించే Completely Fair Scheduler (CFS) స్థానంలో, గేమ్ ప్రాసెసింగ్ సమయంలో ఏ టాస్క్‌కు ఎంత కంప్యూటింగ్ పవర్ అవసరం అయ్యేనా అన్నది రియల్‌టైమ్‌లో అంచనా వేసి రిసోర్స్‌లను పంపిణీ చేసే విధంగా ఇది పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల కీలకమైన CPU ఇన్‌స్ట్రక్షన్‌లను దాదాపు 22 శాతం వరకు తగ్గించవచ్చని కంపెనీ పేర్కొంది. అలాగే ఇది ఫ్రేమ్ డ్రాప్‌లు తగ్గించి, పవర్ కన్సంప్షన్‌ను ప్రతి ఫ్రేమ్‌కి వేర్వేరుగా నియంత్రించే సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది. దీంతో గేమింగ్ సమయంలో ఉష్ణోగ్రత, బ్యాటరీ డ్రెయిన్, పనితీరు స్థిరత వంటి అంశాలు మెరుగవుతాయని చెబుతోంది.
GPU పరంగా చూస్తే OnePlus కొత్త Next-Gen HyperRendering టెక్నాలజీని పరిచయం చేసింది. Vulkan డ్రైవర్ స్థాయిలో ఆప్టిమైజేషన్ చేయడం ద్వారా ప్రతి ఫ్రేమ్ రెండరింగ్ వేగాన్ని 80% వరకు పెంచగలనని కంపెనీ చెబుతోంది. అలాగే ఫ్రేమ్ ఇంటర్‌పొలేషన్ వల్ల వచ్చే అదనపు లేటెన్సీని దాదాపు పూర్తిగా తగ్గించేలా ఈ సిస్టమ్ డిజైన్ చేయబడింది.
హార్డ్వేర్ వైపు వచ్చేసరికి, OnePlus Performance Tri-Chip అనే మూడు చిప్‌ల కలయికను ఉపయోగిస్తోంది. ఇందులో ప్రాసెసింగ్ కోసం ఒక చిప్, ఫాస్ట్ టచ్ రెస్పాన్స్ కోసం ప్రత్యేక టచ్ చిప్, అలాగే నెట్‌వర్క్ స్టెబిలిటీకి Wi-Fi G2 చిప్ ఉన్నాయి. ఇవన్నీ Snapdragon 8 Elite Gen 5 ఆధారంగా పనిచేస్తాయి. టచ్ చిప్ 330Hz టచ్ సాంప్లింగ్ రేట్ తో పాటు 3200Hz ఇన్‌స్టంట్ సాంప్లింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. Wi-Fi G2 చిప్ మాత్రం సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కనెక్షన్ స్టెబిల్‌గా ఉండేలా RF మాడ్యూల్స్ మరియు SmartLink ఆల్గోరిథమ్‌తో ఆప్టిమైజ్ చేయబడింది.
ఇవన్నీకి తోడు OnePlus OP FPS Max అనే గేమింగ్ మోడ్‌ను కూడా ప్రకటించింది. ఇది 165Hz డిస్‌ప్లే, నేటివ్ 165fps గేమ్ రన్ సపోర్ట్‌ను అందిస్తుంది. ఇందులో ఫ్రేమ్ స్టెబిలిటీని OP Gaming Core చూసుకుంటే, టచ్ స్పీడ్ మరియు నెట్‌వర్క్ హ్యాండ్లింగ్‌ను Performance Tri-Chip నిర్వహిస్తుంది. ఇప్పటికే కొన్ని గేమ్‌లు ఈ మోడ్‌కై ట్యూన్ చేసినట్లు OnePlus తెలిపింది. రానున్న నెలల్లో మరిన్ని గేమ్ టైటిల్స్, గేమింగ్ బ్రాండ్ భాగస్వామ్యాలు కూడా జోడించనున్నట్లు పేర్కొంది.
ప్రకటన
ప్రకటన
                            
                            
                                Samsung Galaxy S26 Series Price Hike Likely Due to Rising Price of Key Components: Report