నేపథ్యంలో రాబోయే iPhone 17 సిరీస్పై వరుసగా లీకులు వెలుగులోకి వస్తున్నాయి

దక్షిణ కొరియాకు చెందిన ఒక టెలికాం ఆపరేటర్ పత్రాలలో కొత్త టెలిఫోటో కెమెరా వివరాలు ఉన్నాయని సమాచారం.

నేపథ్యంలో రాబోయే iPhone 17 సిరీస్పై వరుసగా లీకులు వెలుగులోకి వస్తున్నాయి

Photo Credit: Apple

యాపిల్ గతేడాది కొత్త గ్రాఫేన్ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది

ముఖ్యాంశాలు
  • iPhone 17 Pro మోడల్స్‌లో 8X ఆప్టికల్ జూమ్ ఆప్షన్ ఉండనుంది
  • వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ను ఆప్షన్ కూడా సెట్ చేశారు
  • ఇకపై ఓవర్ హీటింగ్ సమస్య ఉండదు
ప్రకటన

యాపిల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అవే డ్రాపింగ్ ఈవెంట్‌కి ఇక 48 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే iPhone 17 సిరీస్పై వరుసగా లీకులు వెలుగులోకి వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, iPhone 17 Pro మోడల్స్‌లో ఇప్పటి వరకు లేని 8X ఆప్టికల్ జూమ్ ఆప్షన్ ఉండనుంది. ఇది ప్రస్తుతం iPhone 16 Pro మోడల్స్‌లో ఉన్న 5X జూమ్ కంటే మెరుగైన అప్‌గ్రేడ్ అవుతుంది.iPhone 17 Pro కెమెరా లీకులు,దక్షిణ కొరియాకు చెందిన ఒక టెలికాం ఆపరేటర్ పత్రాలలో కొత్త టెలిఫోటో కెమెరా వివరాలు ఉన్నాయని సమాచారం. ఈ సెన్సార్ గరిష్టంగా 8X ఆప్టికల్ జూమ్ అందించగలదట. గతంలో జూలైలో బయటకు వచ్చిన రూమర్లు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ప్రస్తుత iPhone 16 Pro, iPhone 16 Pro Max మోడల్స్‌లో 48MP టెలిఫోటో కెమెరా ఉంది, ఇది 5X ఆప్టికల్ జూమ్ వరకే పరిమితం అయ్యింది.

కొత్త థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్

మరో ముఖ్యమైన అప్‌డేట్‌ హీట్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఉండనుందని లీకులు చెబుతున్నాయి. రాబోయే iPhone 17 Pro, iPhone 17 Pro Max మోడల్స్‌లో వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ను ఉపయోగించనున్నారని సమాచారం. ఈ సాంకేతికత CPU, GPU భాగాల నుండి వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. వాక్యూమ్-సీల్ చేసిన ఒక లిక్విడ్ చాంబర్ ద్వారా వేడి వ్యాప్తి చెందేలా ఇది పనిచేస్తుంది.

ఈ సిస్టమ్‌తో పాటు ఉండే అల్యూమినియం ఫ్రేమ్ కారణంగా, కొత్తగా రాబోయే A19 Pro చిప్‌సెట్ పూర్తి స్థాయిలో, ఎక్కువ సమయం పనితీరును కొనసాగించే అవకాశం ఉంది. అంటే, వేడి కారణంగా పనితీరు తగ్గిపోవడం సమస్య తక్కువగా ఉంటుంది.

ఇది నిజమైతే, వరుసగా రెండో సంవత్సరంలో Apple కొత్త థర్మల్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టినట్లవుతుంది. గత ఏడాది iPhone 16 Pro మోడల్స్‌లో కంపెనీ మొదటిసారి గ్రాఫీన్ థర్మల్ సిస్టమ్ను ఉపయోగించింది. ఇది iPhone 15 Proలో కనిపించిన ఓవర్‌హీటింగ్ సమస్యలను తగ్గించడానికి తీసుకొచ్చిన అప్‌డేట్.

వినియోగదారులకు లాభం ఏమిటి?

ఈసారి రాబోతున్న వేపర్ చాంబర్ టెక్నాలజీతో iPhone 17 Pro మోడల్స్ మరింత బలంగా మారవచ్చు. గేమింగ్, దీర్ఘకాలిక ProRes వీడియో షూటింగ్, అలాగే 8K రికార్డింగ్ వంటి పనులను కూడా వినియోగదారులు ఎలాంటి “Your iPhone needs to cool down” హెచ్చరిక లేకుండా చేయగల అవకాశం ఉంది.

దీనితోపాటు ఈ iPhone 17 సిరీస్ కు సంబంధించిన కంప్లీటెడ్ డీటెయిల్స్ తెలియాలంటే మరికొద్ది సమయం వేచి చూడాల్సిందే.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. సరికొత్త Apple స్మార్ట్ వాచ్‌లు వచ్చేశాయ్, ఆరోగ్య లక్షణాలు చెప్పే సెన్సార్లు, 19 నుంచి సేల్స్ ప్రారంభం
  2. కళ్లు చెదిరే మోడల్స్, ధరతో ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్
  3. iPhone Air పూర్తిగా eSIM-only మోడల్‌గా వస్తుంది
  4. iPhone 17 లో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది
  5. నేపథ్యంలో రాబోయే iPhone 17 సిరీస్పై వరుసగా లీకులు వెలుగులోకి వస్తున్నాయి
  6. iPhone 17 Pro మోడళ్ల రూపకల్పనలో కూడా కీలక మార్పులు జరగనున్నాయి
  7. ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 17 లైనప్‌లో నాలుగు కొత్త మోడల్స్ ప్రకటించబడతాయని అంచనా
  8. మార్కెట్‌లోకి సరికొత్త Apple స్మార్ట్ వాచ్‌లు, కళ్లు చెదిరే ఫీచర్లు
  9. ఐఫోన్ 17 సిరీస్ రెడీ టు లాంఛ్.. ఏ ఏ మోడల్స్ వస్తున్నాయంటే?
  10. దయచేసి మీ ఫోన్లను రీస్టార్ట్‌ చేయండి అని ఎయిర్‌టెల్ వినియోగదారులకు సూచించింది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »