Oppo Enco X3s ధర సింగపూర్‌లో SGD 189 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 12,900)గా నిర్ణయించారు. ప్రస్తుతం ఇది Nebula Silver కలర్ ఆప్షన్‌లో ఒప్పో అధికారిక ఈ-స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.
Photo Credit: Oppo
ఒప్పో ఎన్కో X3s ఇయర్‌ఫోన్‌లు ఒకే నెబ్యులా సిల్వర్ కలర్‌వేలో అమ్ముడవుతాయి.
బార్సిలోనాలో మంగళవారం జరిగిన ఈవెంట్‌లో Oppo తన ఫ్లాగ్‌షిప్ Find X9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో పాటు కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ Oppo Enco X3s ను కూడా ఆవిష్కరించింది. Oppo Enco X3s ధర సింగపూర్‌లో SGD 189 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 12,900)గా నిర్ణయించారు. ప్రస్తుతం ఇది Nebula Silver కలర్ ఆప్షన్‌లో ఒప్పో అధికారిక ఈ-స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. అయితే ఈ వైర్‌లెస్ హెడ్‌సెట్‌ను భారతదేశంలో ఎప్పుడు విడుదల చేస్తారో కంపెనీ ఇంకా ప్రకటించలేదు. రాబోయే వారాల్లో Find X9 సిరీస్ భారత మార్కెట్లో విడుదలయ్యే సమయంలోనే ఈ ఇయర్‌బడ్స్ కూడా రావచ్చని అంచనా.
Oppo Enco X3s డ్యూయల్ డైనమిక్ డ్రైవర్‌లతో వస్తుంది. వీటిలో 11మిల్లీమీటర్లు మరియు 6మిల్లీమీటర్ల యూనిట్లు కోయాక్షియల్ సెటప్‌లో అమర్చబడి ఉంటాయి. హై మరియు లో ఫ్రీక్వెన్సీలకు వేర్వేరు DAC సపోర్ట్ ఉంటుంది. ఈ హెడ్‌సెట్‌ను డెన్మార్క్‌కు చెందిన ప్రఖ్యాత ఆడియో బ్రాండ్ Dynaudio ట్యూన్ చేసింది. వినియోగదారులు నాలుగు సౌండ్ ప్రొఫైల్ల్స్ అయిన అథెంటిక్ లైవ్, ప్యూర్ వోకల్స్, అల్టిమేట్ సౌండ్, థండరింగ్ బేస్ నుండి తమకు నచ్చిన మోడ్‌ని ఎంచుకోవచ్చు.
నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ప్రతి ఇయర్‌బడ్‌లో మూడు మైక్రోఫోన్‌లతో కూడిన డ్యూయల్-ఫీడ్ ANC సిస్టమ్ అమర్చబడింది, ఇది 55dB వరకు నాయిస్ రిడక్షన్‌ను అందిస్తుంది. కొత్తగా అందించిన Real-time Dynamic ANC ఫీచర్ మనం ఉన్న పరిసర పరిస్థితులను బట్టి (ఉదా: బస్సులు, ఆఫీస్ మొదలైనవి) నాయిస్ కంట్రోల్ స్థాయిని సెల్ఫ్ అడ్జెస్ట్ చేస్తుంది. అదనంగా, Adaptive Mode ద్వారా ట్రాన్స్‌పరెన్సీ మరియు నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్‌లు ఆటోమేటిక్‌గా సర్దుబాటు అవుతాయి. వాయిస్ కాల్‌ల సమయంలో AI ఆధారిత నాయిస్ సప్రెషన్ టెక్నాలజీ వలన గాలి లేదా బిజీ వాతావరణంలో కూడా స్పష్టమైన ఆడియో లభిస్తుంది.
కనెక్టివిటీ పరంగా, ఈ హెడ్‌సెట్‌లో Bluetooth 5.4 సపోర్ట్ ఉంటుంది. ఇది LHDC 5.0, AAC, మరియు SBC కోడెక్‌లను సపోర్ట్ చేస్తుంది, తద్వారా హై-రెజల్యూషన్ వైర్‌లెస్ ఆడియో అనుభవం లభిస్తుంది. గేమ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా Game Mode అందించబడింది, ఇది లేటెన్సీని తగ్గిస్తుంది. అంతేకాకుండా, AI Translate ఫీచర్ సహాయంతో ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లతో కలిపి వాడినప్పుడు 20కి పైగా భాషల్లో రియల్‌టైమ్ మరియు ముఖాముఖి అనువాదం సాధ్యమవుతుంది. ఇతర Android మరియు iOS వినియోగదారులు HeyMelody యాప్ ద్వారా కస్టమైజేషన్ మరియు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను పొందవచ్చు.
ANC ఆఫ్‌లో ఉన్నప్పుడు ఒక్కసారి ఛార్జ్‌పై ఇయర్‌బడ్స్ 11 గంటల వరకు పనిచేస్తాయి, ANC ఆన్‌లో ఉన్నప్పుడు సుమారు 6 గంటలు ప్లేబ్యాక్ ఇస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 45 గంటల బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. ఇయర్‌బడ్స్ సుమారు 50 నిమిషాల్లో, కేస్ 80 నిమిషాల్లో USB Type-C ద్వారా పూర్తిగా ఛార్జ్ అవుతుంది. IP55 రేటింగ్ కలిగిన ఈ ఇయర్‌బడ్స్ దుమ్ము మరియు నీటికి నిరోధకతను కలిగి ఉంటాయి. ఒక్క ఇయర్‌బడ్ బరువు 4.73 గ్రాములు, కేస్‌తో కలిపి మొత్తం బరువు 49.02 గ్రాములు ఉంటాయి.
ప్రకటన
ప్రకటన
Astrophysicists Map Invisible Universe Using Warped Galaxies to Reveal Dark Matter