Photo Credit: iQOO
త్వరలోనే iQOO 13 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో అడుగుపెట్టబోతోందని ఈ చైనీస్ టెక్ బ్రాండ్ మరోసారి స్పష్టం చేసింది. అయితే, ఖచ్చితమైన ప్రారంభ తేదీని వెల్లడించనప్పటికీ, దేశీయ మార్కెట్‌లో అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి ఇది అందుబాటులో ఉంటుందని మాత్రం కంపెనీ ధృవీకరించింది. iQOO 13 వెనుక భాగంలో కెమెరా ఫేమ్ చుట్టూ డైనమిక్ లైటింగ్ ఎలిమెంట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ సరికొత్త మోడల్ అక్టోబర్ 30న చైనాలో లాంచ్ కాబోతోంది. అలాగే, ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 2K రిజల్యూషన్‌తో BOE Q10 8T LTPO OLED డిస్‌ప్లేతో దీనిని రూపొందించారు. ఈ తాజా iQOO 13 స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన కీలకమైన స్సెసిఫికేషన్స్‌తోపాటు ధరల వివరాలను కూడా చూసేద్దామా?!
iQOO ఇండియా X పోస్ట్ ద్వారా మన దేశంలో iQOO 13 మోడల్ అందుబాటులోకి వచ్చే వివరాలతోపాటు కొత్త హాలో లైట్ ఫీచర్‌ను ప్రకటించింది. కంపెనీ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ ద్వారా విక్రయించబడుతుందని ధృవీకరించబడింది. అలాగే, బ్రాండ్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఫోన్ వెనుక డిజైన్‌ను చూపే టీజర్‌ను పోస్ట్ చేసింది. అంతేకాదు, అమెజాన్ తన వెబ్‌సైట్‌లో iQOO 13 కోసం ప్రత్యేక ల్యాండింగ్ పేజీని అందుబాటులోకి తెచ్చింది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుందని లిస్టింగ్ చూపిస్తుంది. ఈ మోడల్ కెమెరా ఫ్రేమ్ చుట్టూ హాలో లైట్ ఎలిమెంట్‌ను కలిగి ఉంది. ఇది ఇంట్రస్టింగ్ గేమింగ్ అనుభవం కోసం డైనమిక్ లైటింగ్ ఎఫెక్ట్‌లను అందిస్తుంది. ఇది ఖచ్ఛితంగా కొనుగోలుదారులకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని కంపెనీ భావిస్తుంది.
iQOO 13 హ్యాండ్‌సెట్‌ను అక్టోబర్ 30న చైనాలో ప్రారంభించటానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అలాగే, ఈ బ్రాండ్ ఫోన్‌కు సంబంధించిన కీలకమైన స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. చైనాలో లాంచ్ ఈవెంట్ స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:00 గంటలకు (1:30pm IST) ప్రారంభమవుతుంది. iQOO 13 ఫోన్ నలుపు, ఆకుపచ్చ, బూడిద, తెలుపు రంగులలో అందుబాటులో ఉంటుందని ప్రచారంలో ఉంది. అదే సమయంలో ఇతర మార్కెట్‌లలోకి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.
త్వరలో రాబోయే ఈ హ్యాండ్‌సెట్ 2K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో BOE Q10 8T LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు ధృవీకరించబడింది. దీని డిస్‌ప్లే రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌తో కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది 7.99mm మందపాటి బాడీని కలిగి ఉండి, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,150mAh బ్యాటరీతో అందుబాటులోకి వస్తుంది. iQOO 13 స్మార్ట్ ఫోన్ గేమింగ్ కోసం కంపెనీ సెల్ఫ్-డెవలప్డ్ గేమింగ్ చిప్ Q2ని కలిగి ఉంటుంది. ఇది చైనీస్ మార్కెట్‌లో OriginOS 5తో వస్తుందని కంపెనీ టీజ్ చేసింది.
ప్రకటన
ప్రకటన