Photo Credit: iQOO
iQOO Neo 10R మూన్‌నైట్ టైటానియం మరియు ర్యాగింగ్ బ్లూ కలర్‌వేస్‌లో అందుబాటులో ఉంటుంది
మార్చి 11న మన దేశంలో iQOO Neo 10R హ్యాండ్‌సెట్ లాంఛ్ కానుంది. దీని లాంఛ్‌కు ముందు, కంపెనీ సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ ధర, AnTuTu స్కోర్‌ను టీజ్ చేసింది. అయితే, ఖచ్చితమైన ధర వెల్లడించనప్పటికీ హ్యాండ్‌సెట్ ధర ఏ రేంజ్‌లో ఉంటుందో మాత్రం కంపెనీ పేర్కొంది. అంతే కాదు, ఫోన్ తమ విభాగంలోనే అత్యధిక AnTuTu స్కోర్‌ను సాధించిందని కంపెనీ ప్రకటించింది. Neo సిరీస్‌లో మొదటి R-బ్రాండెడ్ మోడల్ అయిన iQOO Neo 10R మోడల్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్‌లో రూపొందించినట్లు స్పష్టం చేయబడింది.
కంపెనీ X (గతంలో ట్విట్టర్ అని పిలువబడేది)లో చేసిన పోస్ట్‌లో iQOO అధికారిక హ్యాండిల్ ద్వారా రాబోయే ఈ హ్యాండ్‌సెట్‌ను తమ సెగ్మెంట్‌లోనే అత్యంత శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ అని వెల్లడించింది. అలాగే, ప్రమోషనల్ మెసేజ్ తర్వాత మార్చి 2025 వరకు రూ 30 వేల విభాగంలో ప్రారంభించబడిన మోడల్స్ AnTuTu స్కోర్ ఆధారంగా అంటూ దిగువన వివరించబడిన స్టార్ గుర్తు కూడా ఉంది.
కంపెనీ నుంచి వచ్చిన ఈ మెసేజ్‌తో iQOO Neo 10R రూ. 30,000 కంటే తక్కువ రేంజ్‌లో ఉండే అవకాశాలు ఉన్నట్లు చెప్పకనే చెప్పినట్లు భావించవచ్చు. అంతేకాదు, గతంలోనూ పలువురు టిప్‌స్టర్‌లు ఇదే అంశాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ లాంఛ్‌కు ముందే కీలక విషయాలను ధృవీకరించలేనప్పటికీ, iQOO దాని ధర విభాగంలో అత్యధిక AnTuTu స్కోర్‌లలో 1.7 మిలియన్ పాయింట్లకు పైగా స్కోర్ చేసిందని పేర్కొంది. దీనితో పాటు, కంపెనీ ఇటీవల ప్రకటించిన మూన్‌నైట్ టైటానియం కలర్ ఆప్షన్‌ను కూడా బహిర్గతం చేసింది. ఇది ప్రకాశవంతమైన కోటింగ్‌తో వెండి లేదా బూడిద రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. iQOO Neo 10R రేజింగ్ బ్లూ కలర్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.
రాబోయే iQOO Neo 10R స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుందని కూడా కంపెనీ స్పష్టం చేసింది. ఇది TSMC 4nm ప్రాసెస్ టెక్నాలజీపై రూపొందించబడిన ప్రాసెసర్. దీనిని 12GB వరకు RAM, 256GB స్టోరేజీతో అటాచ్ చేయవచ్చు. అలాగే, గతంలో వచ్చిన నివేదికల ప్రకారం.. ఈ స్మార్ట్ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 6.78-అంగుళాల OLED స్క్రీన్‌ను కలిగి ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
కెమెరా విషయానికి వస్తే.. దీనిలో Sony LYT-600 సెన్సార్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంటుందని ప్రచారంలో ఉంది. అలాగే, హ్యాండ్‌సెట్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉండవచ్చని అంచా. ఈ iQOO Neo 10R స్మార్ట్ ఫోన్ 80W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6400mAh భారీ బ్యాటరీతో రానున్నట్లు
ప్రకటన
ప్రకటన