రాబోయే ఈ కొత్త మోడల్ గత ఏడాది అక్టోబర్‌లో చైనాలో విడుదలైన Find X8 Pro హ్యాండ్‌సెట్ మాదిరిగానే మంచి విజయాన్ని అందుకుంటుందని అంచనా.
Photo Credit: Oppo
Oppo X9 Pro, Oppo Find X8 Pro కంటే సన్నని బెజెల్స్‌ను పొందవచ్చు (చిత్రంలో)
తాజాగా Oppo Find X9 Pro మోడల్‌కు సంబంధించిన పలు కీలక స్పెసిఫికేషన్స్ బహిర్గతం అయ్యాయి. ఆన్‌లైన్‌లో ఓ టిప్‌స్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం రాబోయే X9 Pro ఫోన్ భారీ బ్యాటరీతో అందుబాటులోకి రావచ్చని అంచనా. అలాగే, దీని ప్రాసెసర్, ఐపీ రేటింగ్ వంటి విషయాలను షేర్ చేశారు. ఈ వివరాలు Find X9 Pro కు సంబంధించి గతంలో చక్కర్లు కొట్టిన లీక్‌లకు అనుగుణంగానే ఉండడంతో వీటిపై మార్కెట్ వర్గాలు ఏకాభిప్రాయానికి వస్తున్నాయి. రాబోయే ఈ కొత్త మోడల్ గత ఏడాది అక్టోబర్‌లో చైనాలో విడుదలైన Find X8 Pro హ్యాండ్‌సెట్ మాదిరిగానే మంచి విజయాన్ని అందుకుంటుందని అంచనా.50W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో,చైనాకు చెందిన మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం వీబోలోని ఓ పోస్ట్ ను బట్టీ Oppo Find X9 Pro 50W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అంచనా. అలాగే, కంపెనీ నుంచి దీని ముందు విడులైన Find X8 Pro మోడల్ 5910mAh బ్యాటరీతో రావడంతో దాని కంటే మంచి అప్‌గ్రేడ్ బ్యాటరీగా కూడా చెప్పుకోవచ్చు. అంతే కాదు, రాబోయే Find X9 Pro మోడల్ మీడియాటెక్ Dimensity 9500 ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుందని ఈ పోస్ట్‌లో వెల్లడైంది.
రాబోయే Oppo Find X9 Pro కెమెరా విషయానికి వస్తే.. ఇది 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్‌తో కూడిన వెనుక కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా ముందొచ్చిన 50 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్‌తో పోల్చి చూస్తే, అప్‌గ్రేడ్‌గానే ఉంటుంది. అంతే కాదు, ఈ స్మార్ట్ ఫోన్ దుమ్ము నీటి నియంత్రణకు ఐపీ68, ఐపీ 69 రేటింగ్‌ను కలిగి ఉండవచ్చని అంచనా. దీనికి 3D ఆల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించనున్నారు.
Oppo Find X9 Pro ఫోన్ డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఇది 1.5K రిజల్యూషన్, లో ఇంజెక్షన్ ప్రెజర్ ఓవర్ మౌల్డింగ్ టెక్నాలజీతో కూడిన 6.78 అంగుళాల 2.5D LTPO స్ట్రయిట్ డిస్‌ప్లేతో రూపొందించబడుతుందని టాక్. అంతే కాదు, ఈ హ్యాండ్‌సెట్‌కు సన్నని బెజెల్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, దీని డిస్‌ప్లే పరిమాణం గతంలో వచ్చిన లీక్‌లకు అనుగుణంగా కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో వచ్చిన Oppo Find X8 Pro స్పెసిఫికేషన్స్ పరిశీలిస్తే, దీనికి 6.78 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేను అందించారు. అలాగే, ఆక్టా కోర్ మీడియాటెక్ Dimensity 9400 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది 16GB వరకూ LPDDR5X RAM, 1TB వరకూ యూఎఫ్ఎస్ 4.0 ఇంటర్నల్ స్టోరేజీతో అటాచ్ చేయబడి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రూపొందించారు.
ప్రకటన
ప్రకటన
Microsoft Announces Latest Windows 11 Insider Preview Build With Ask Copilot in Taskbar, Shared Audio Feature
Samsung Galaxy S26 Series Specifications Leaked in Full; Major Camera Upgrades Tipped