Photo Credit: Infinix
ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో+ 5Gలో OIS తో కూడిన 50-మెగాపిక్సెల్ సోనీ IMX896 ప్రైమరీ కెమెరా ఉంది.
Infinix కంపెనీ తమ Infinix Note 50 Pro+ 5G మోడల్‌ను గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. అలాగే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. Infinix Note 50 Pro+ 5G కంపెనీ Note 50 సిరీస్ నుంచి వచ్చిన మూడవ మోడల్. ఇందులో Infinix Note 50, Note 50 ప్రోలను మొదటగా ఇండోనేషియా మార్కెట్‌లో లాంఛ్ చేశారు. Infinix Note 50 Pro+ 5G మోడల్ Infinix AI ఫీచర్లతో రానుంది. అలాగే, 100W వైర్డ్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
Infinix Note 50 Pro+ 5G ధర USలో $370 (సుమారు రూ. 32,000) నుండి ప్రారంభమవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్చాన్టెడ్ పర్పుల్, టైటానియం గ్రే, స్పెషల్ రేసింగ్ ఎడిషన్ వెర్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. Infinix Note 50, Infinix Note 50 ప్రో ధరలు గ్లోబల్ మార్కెట్‌లలో వరుసగా $180 (సుమారు రూ. 15,000), $210 (సుమారు రూ. 18,000) ధరలతో ఉన్నాయి. Note 50 సిరీస్‌లో మరో రెండు కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లను తర్వాత ప్రకటించనుంది.
కొత్త Note 50 Pro+ 5G కాల్స్, నోటిఫికేషన్‌లు వంటివాటి కోసం మల్టీ-కలర్ మినీ-LED ఎఫెక్ట్స్ బయో-యాక్టివ్ హాలో AI లైటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో OISతో కూడిన 50-మెగాపిక్సెల్ సోనీ IMX896 ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. అలాగే, JBL డ్యూయల్ స్పీకర్లు, NFC సపోర్ట్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్‌ను అందించారు. ఈ డివైజ్ దుమ్ము, నీటి నియంత్రణ కోసం IP64 రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది.
ఈ మోడల్ బ్యాటరీ పవర్ రిజర్వ్ మోడ్‌లో ఒక శాతం బ్యాటరీతో ఇది 2.2 గంటల వరకు లైఫ్‌ను అందిస్తుంది. ఈ Infinix Note 50 ఫ్యామిలీని Infinix AI∞ బీటా ప్లాన్‌తో విడుదల చేశారు. ఈ AI strategy కంపెనీ తాజా వన్-ట్యాప్ Infinix AI ∞ కార్యాచరణతో పని చేస్తుంది. ఇది వినియోగదారులు పవర్ బటన్‌ను ఎక్కువసేపు ప్రెస్ చేయడం ద్వారా Infinix AI అసిస్టెంట్ ఫోలాక్స్‌ను యాక్టివేట్ చేయడానికి అనుమతిస్తుంది.
ఇందులో ఫోలాక్స్ ఆన్-స్క్రీన్ కంటెంట్‌ను గుర్తించడంతోపాటు టెక్స్ట్‌ను అనువదిస్తుంది. అలాగే, షెడ్యూలింగ్, నావిగేషన్, కాలింగ్, కాంటాక్ట్ మేనేజ్‌మెంట్ కోసం క్రాస్-యాప్ వాయిస్ కమాండ్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఇది AI ఎరేజర్, AI కటౌట్, AI రైటింగ్, AI నోట్, AI వాల్‌పేపర్ జనరేటర్ వంటి ఫీచర్స్‌లను అందిస్తుంది. కమ్యూనికేషన్ కోసం, రియల్-టైమ్ కాల్ ట్రాన్స్‌లేటర్, కాల్ సమ్మరీ, AI ఆటో-ఆన్సర్, డ్యూయల్-వే స్పీచ్ ఎన్‌హాన్స్‌మెంట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన