బడ్జెట్ ధరలో లావా నుంచి బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్.. ధర ఎంతంటే

దేశియ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లావా తన సిరీస్‌ నుంచి రెండు కొత్త ఫోన్లను త్వరలో విడుదల చేయనుంది. వీటిలో ‘లావా స్టార్మ్ ప్లే 5G’ శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్‌తో వస్తోంది. ఇది UFS 3.1 స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది.

బడ్జెట్ ధరలో లావా నుంచి  బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్.. ధర ఎంతంటే

Photo Credit: Lava

లావా స్టార్మ్ 5G (చిత్రంలో) డిసెంబర్ 2023లో భారతదేశంలో ప్రారంభించబడింది

ముఖ్యాంశాలు
  • లావా స్టార్మ్ ప్లే 5G ఫోన్ LPDDR5 RAM కి మద్దతు ఇస్తుంది
  • ఈ హ్యాండ్‌సెట్ UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది
  • అమెజాన్ ద్వారా లావా స్టార్మ్ ప్లే 5G, స్టార్మ్ లైట్ 5G ఫోన్ల కొనుగోలు
ప్రకటన

భారతీయ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా మొబైల్స్ తన స్ట్రామ్ 5G లైనప్‌ను విస్తరించే పనిలో పడింది. ఈ కంపెనీ త్వరలో రెండు కొత్త స్మార్ట్‌ ఫోన్లను విడుదల చేయనుంది. వీటిని 'లావా స్టార్మ్ ప్లే 5G', 'లావా స్టార్మ్ లైట్ 5G' పేర్లతో లాంచ్ చేయనుంది. తాజాగా ఈ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికెషన్లను టీజర్‌ ద్వారా వెల్లడించింది.అయితే 2023 డిసెంబర్‌లో విడుదలైన స్టాండర్డ్ లావా స్టార్మ్ 5G వెర్షన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 SoC చిప్‌సెట్‌తో వచ్చిన విషయం తెలిసిందే. ఇది 50MP డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చింది.భారత్‌లో లావా స్టార్మ్ ప్లే 5G, స్టార్మ్ లైట్ 5G మోడల్స్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా తెలిపింది. ఈ రెండు ఫోన్‌లను అమెజాన్, లావా ఇండియా ఇ-స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

లావా స్టార్మ్ ప్లే 5G ధర, స్పెసిఫికేషన్లు

'లావా స్టార్మ్ ప్లే 5G'లో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. భారత్‌లో ఈ చిప్‌సెట్‌తో విడుదల కానున్న తొలి స్మార్ట్‌ ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ చిప్‌సెట్‌తో LPDDR5 RAM, UFS 3.1 స్టోరేజ్‌తో రానుంది. ఈ స్థాయిలో చిప్‌సెట్, పెద్ద మోతాదులో ర్యామ్‌తో ఈ ఫోన్‌ను అందిస్తున్నారంటే లావా కంపెనీ గేమింగ్ ప్రియులను టార్గెట్ చేసినట్లు అర్థం అవుతోంది. వీటితో పాటు మల్టీ టాస్కింగ్, యాప్ లోడింగ్ స్పీడ్ కూడా ఈ ఫోన్‌లో బాగుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ అన్ని రకాల 5G బ్యాండ్స్ కనెక్టివిటీతో వస్తుంది.

ఈ గ్యాడ్జెట్ 6.78-అంగుళాల HD ప్లస్ LCD స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. లావా స్మార్ట్ ప్లే 6GB RAMతో వస్తోంది. ఇందులో 128GB ఇన్-బిల్ట్ స్టోరేజ్ లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్స్ లాంఛ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. మరికొన్ని రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది. విడుదల తర్వాత వినియోగదారులు లావా ఇండియా ఇ-స్టోర్, అమెజాన్ ద్వారా ఈ రెండు ఫోన్లను కొనుగోలు చేయొచ్చు.

లావా స్ట్రామ్ 5G ధర, స్పెసిఫికేషన్లు

రెండేళ్ల క్రితం 2023లో విడుదలైన లావా లైనప్ స్టాండర్డ్ వెర్షన్ 'లావా స్ట్రామ్ 5G' ధర రూ. 13,499. ఇది 8GB RAM, 128GB స్టోరేజ్‌తో వచ్చింది. ఈ ఫోన్‌ను అమెజాన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. కంపెనీ దీన్ని గేల్ గ్రీన్, థండర్ బ్లాక్ అనే రెండు రంగుల్లోన విడుదల చేసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6080 SoC చిప్‌సెట్‌తో విడుదలైంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉపయోగించారు. ఇది 33W వైర్డ్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ గ్యాడ్జెట్ సెక్యూరిటీ పరంగా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. అలాగే ఫేస్‌ అన్‌లాక్ ఫీచర్‌ కూడా ఉంది.

ఈ గ్యాడ్జెట్ 6.78 అంగుళాల ఫుల్-HD+ IPS 2.5D డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 5G, Wi-Fi, బ్లూటూత్ 5.0, GPRS, OTG, GLONASS, 3.5mm ఆడియో జాక్‌తో పాటు USB టైప్-సీ కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది

కెమెరా ఫీచర్లు

ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ వెనక డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన కెమెరా 50MP, దీనికి అనుబంధంగా 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం కంపెనీ 16MP ఫ్రంట్ కెమెరాను యాడ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఈ ఫోన్‌లో ప్రత్యేకించి ప్రో విజువల్ ఇంజిన్ ఉంటుంది, దీని ద్వారా పలు ఏఐ ఆధారిత ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉంటాయి
  2. ఈ ఫోన్‌ 4400mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 30 నిమిషాల్లో 50% ఛార్జ్
  3. ChatGPT said: ఆఫర్లు బ్యాంక్, కూపన్ డిస్కౌంట్లు, నో కాస్ట్ EMIతో ఎఫెక్టివ్ ధరలకు అందుబాటులో ఉన్నాయి
  4. ఈ ఆఫర్లు బ్యాంక్ ఆఫర్లు, కూపన్‌లతో లభ్యమవుతూ నో కాస్ట్ EMI ఫైనాన్స్ ఎంపికలు అందుబాటులో
  5. జూలై 14న ఇండియ‌న్ మార్కెట్‌లోకి Vivo X Fold 5, Vivo X200 FE
  6. స‌రికొత్త బ్యాట‌రీ అప్‌గ్రేడ్‌తో మార్కెట్‌లోకి iPhone 17 Pro Max
  7. ఇది మిడ్ రేంజ్‌ సెగ్మెంట్లో గట్టి పోటీగా జూలై 12 నుంచి అమెజాన్‌లో లభ్యం
  8. ప్రైమ్ డే 2025: ఎకో, ఫైర్ టీవీ, కిండిల్‌లపై గరిష్ఠంగా 50% డిస్కౌంట్
  9. నథింగ్ హెడ్‌ఫోన్ 1లో 1040mAh బ్యాటరీ ఉంది, 120 నిమిషాల్లో Type-C ద్వారా ఛార్జ్ అవుతుంది
  10. నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారంగా రూపొందించిన నథింగ్ OS 3.5 పై రన్ అవుతుంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »