Photo Credit: Lava
Lava Blaze 3 5G is claimed to be equipped with a segment-first VIBE light
దేశీయ మార్కెట్‌లోకి Lava Blaze 3 5G స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ గ్రాండ్‌గా లాంచ్ చేసింది. గత ఏడాది నవంబర్‌లో విడుదలైనLava Blaze 2 5Gకి కొనసాగింపుగా కంపెనీ నుంచి వస్తోన్న ఈ హ్యాండ్‌సెట్ 90Hz డిస్‌ప్లే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లతోపాటు MediaTek Dimensity 6300 ప్రాసెసర్ వంటి స్పెసిఫికేషన్‌లతో వస్తోంది. అలాగే, Lava Blaze 3 5Gలో వైబ్ లైట్ కూడా ఉంది. ఇది ఫోటోగ్రఫీ సమయంలో లైటింగ్‌ను మెరుగుపరచడంలో సహాయపడే సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్‌గా చెప్పొచ్చు.
మన దేశీయ మొబైల్ మార్కెట్‌లో Lava Blaze 3 5G ప్రారంభ ధర రూ. 11,499గా నిర్ణయించారు. అయితే ఇది ప్రత్యేక లాంచింగ్ ధర అని కంపెనీ చెబుతోంది. వివిధ బ్యాంక్ ఆఫర్‌లను ద్వారా ఈ మోడల్‌ను రూ. 9,999లకే సొంతం చేసుకోవచ్చని ప్రకటించింది. ఇది 8GB RAM+128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 18 మధ్యాహ్నం 12 am నుండి ప్రత్యేకంగా Amazonలో దీనిని కొనుగోలు చేయవచ్చు. గ్లాస్ బ్లూ, గ్లాస్ గోల్డ్ కలర్ అనే రెండు రంగులలో ఈ హ్యాండ్‌సెట్‌ను పరిచయం చేశారు.
Lava Blaze 3 5G ఫోన్ 720x1,600 పిక్సెల్‌ల రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. అలాగే, 6.56-అంగుళాల HD+ హోల్-పంచ్ డిస్‌ప్లేతో రూపొందించబడింది. కొలతల పరంగా చూస్తే.. ఈ హ్యాండ్‌సెట్ 164.3×76.24×8.6mmతో 201 గ్రాముల బరువు ఉంటుంది. ఇది 6GB LPDDR4x RAM, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేయబడిన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. దీని స్టోరేజీని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. అలాగే, RAMని 6GB వరకు వర్చువల్‌గా విస్తరించవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది.
Lava Blaze 3 5G స్మార్ట్‌ఫోన్ కెమారా విషయానికి వస్తే.. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో f/1.8 ఎపర్చర్, 2-మెగాపిక్సెల్ సెకండరీ AI కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే, సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ సెకనుకు 30 ఫ్రేమ్‌ల (fps) వరకు 2K రిజల్యూషన్‌లో వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది AI ఎమోజి మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, ప్రో వీడియో మోడ్, డ్యూయల్ వ్యూ వీడియో, AI మోడ్ వంటి కెమెరా-సెంట్రిక్ ఫీచర్‌లను కూడా కలిగి ఉంటుంది. కనెక్టివిటీని చూస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌లో USB టైప్-సి పోర్ట్, 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్, 5G, డ్యూయల్ 4G VoLTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi 5, బ్లూటూత్ 5.2కి సపోర్ట్ చేస్తుంది. అదనపు భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్‌ను కూడా కలిగి ఉంటుంది. 18W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని అందించారు.
ప్రకటన
ప్రకటన