Photo Credit: Samsung
దేశీయ మార్కెట్‌లోకి Samsung Galaxy M15 5G ప్రైమ్ ఎడిషన్ గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఫీచర్స్‌తోపాటు స్పెసిఫికేషన్‌లు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇండియాలో విడుదలైన Galaxy M15 5G మాదిరిగానే ఉన్నాయి. 8GB వరకు RAM, ట 6,000mAh బ్యాటరీతో రూపొందించిన ఈ మొబైల్‌లో MediaTek డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌ను అందించారు. ఇది 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 13-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14తో రన్ అవుతుంది. అలాగే, నాలుగు OS అప్‌గ్రేడ్‌లను అందిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.
మన దేశంలో Samsung Galaxy M15 5G ప్రైమ్ ఎడిషన్ ప్రారంభ ధర 4GB + 128GB వేరియంట్ అయితే రూ 10,999గా నిర్ణయించారు. అలాగే, 6GB + 128GB, 8GB + 128GB వేరియంట్‌ల ధరలు వరుసగా రూ. 11,999, రూ. 13,499గా ఉన్నాయి. ఈ ఫోన్ అమెజాన్, Samsung ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. బ్లూ టోపాజ్, సెలెస్టియల్ బ్లూ, స్టోన్ గ్రే కలర్ మూడు కలర్ ఆప్షన్‌లలో ఇది లభిస్తుంది. ఇప్పటికే దీని డిజైన్, కలర్ ఆప్షన్స్‌పై మార్కెట్ వర్గాల నుంచి సాలుకూలమైన స్పందన ఉంది.
Samsung Galaxy M15 5G ప్రైమ్ ఎడిషన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్-HD+ (1,080 x 2,340 పిక్సెల్స్) సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది MediaTek డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ ద్వారా 8GB వరకు RAM, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజీతో అలాచ్ చేయబడింది. ఇది కొనుగోలుదారులకు అదనపు ప్రయోజనంగా భావించవచ్చు. అలాగే, ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.0తో ఫోన్ షిప్పింగ్ చేశారు. అంతేకాదు, ఇది నాలుగు OS అప్‌గ్రేడ్‌లు, ఐదు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
కెమెరా విషయానికి వస్తే.. Samsung Galaxy M15 5G ప్రైమ్ ఎడిషన్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 5-మెగాపిక్సెల్, 2-మెగాపిక్సెల్ సెన్సార్‌తో పాటు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కూడా ఉంది. అలాగే, 13-మెగాపిక్సెల్ సెన్సార్‌తో ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ప్రైమ్ ఎడిషన్‌లో 6,000mAh బ్యాటరీని అమర్చారు. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అలాగే, ఫోన్‌లో నాక్స్ సెక్యూరిటీ, క్విక్ షేర్ ఫీచర్‌లు మరియు కాల్ క్లారిటీ కోసం వాయిస్ ఫోకస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. కనెక్టివిటీ విషయానికి వస్తే.. డ్యూయల్ 5G, 4G LTE, GPS, బ్లూటూత్ 5.3, USB టైప్-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్‌ను అందించారు. ఈ హ్యాండ్‌సెట్ 160.1 x 76.8 x 9.3 mm పరిమాణంతో 217 గ్రాముల బరువుతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ప్రకటన
ప్రకటన