Photo Credit: Motorola
మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ MIL-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కలిగి ఉంది.
ఇండియాలో Motorola Edge 60 Fusion లాంఛ్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ద్వారా 12GB వరకు RAMతో అటాచ్ చేయబడింది. అలాగే, 68W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని అందించారు. ఇది IP68, IP69-రేటెడ్ డస్ట్, వాటర్-రెసిస్టెంట్ బిల్డ్, MIL-810H డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌తో వస్తోంది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కలిగి ఉంది. మన దేశంలో Motorola Edge 50 ఫ్యూజన్ గతేడాది మే లో అడుగుపెట్టింది. ఏప్రిల్ 9 నుంచి అమ్మకాలు ,భారత్‌లో Motorola Edge 60 Fusion 8GB + 256GB వేరియంట్ ధర రూ. 22,999 నుండి ప్రారంభమవుతుంది. ఇది ఫ్లిప్‌కార్ట్, Motorola ఇండియా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకు అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఏప్రిల్ 9 మధ్యాహ్నం 12 గంటల నుండి ఇండియాలో అమ్మకాలు మొదలవుతాయి. ఇది పాంటోన్ అమెజోనైట్, పాంటోన్ స్లిప్‌స్ట్రీమ్, పాంటోన్ జెఫిర్ కలర్ ఆప్షన్‌లలో లభించనుంది.
ఈ Motorola Edge 60 Fusion 6.7-అంగుళాల 1.5K (1,220x2,712 పిక్సెల్స్) ఆల్-కర్వ్డ్ pOLED స్క్రీన్‌ను 120Hz వరకు రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో వస్తుంది. అలాగే, ఇది పాంటోన్ వాలిడేటెడ్ ట్రూ కలర్ సర్టిఫికేషన్‌తో పాటు SGSలో బ్లూ లైట్, లో మోషన్ బ్లర్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్ విస్తరణకు సపోర్ట్ చేస్తుంది. ఇది Android 15-ఆధారిత హలో UIతో వస్తోంది. అలాగే, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లతోపాటు మూడు సంవత్సరాల Android OS అప్‌గ్రేడ్‌లను పొందుతుంది.
ఈ ఫోన్ 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను అందించారు. 4K వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మోటో AI ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఇమేజింగ్, ఫోటో డెవలప్‌మెంట్, అడాప్టివ్ స్టెబిలైజేషన్, మ్యాజిక్ ఎరేజర్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ గూగుల్ సర్కిల్ టు సెర్చ్, మోటో సెక్యూర్ 3.0, స్మార్ట్ కనెక్ట్ 2.0, ఫ్యామిలీ స్పేస్ 3.0, మోటో గెస్టర్స్ వంటి ఇతర ఫీచర్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే, డాల్బీ అట్మాస్-బ్యాక్డ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను అందించారు.
కనెక్టివిటీ ఆప్షన్స్‌లో 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, AGPS, LTEPP, SUPL, GLONASS, గెలీలియో, NFC, USB టైప్-C పోర్ట్ వంటివి ఉన్నాయి. ఇది 68W వైర్డు టర్బో ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ బయోమెట్రిక్‌తో కూడిన ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. 161 x 73 x 8.2mm పరిమాణంతో 180 గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన